terror suspects
-
షాకింగ్.. బ్రిటన్‌లో 23వేలమంది ఉగ్రవాదులు!
లండన్: బ్రిటన్‌లో వేలమంది అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు అక్కడి నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేదో ఒక వెయ్యో.. రెండువేలమందో కాదు. ఏకంగా 23వేల మంది అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల మాంచెస్టర్ దాడుల తర్వాత ఉలిక్కిపడిన బ్రిటన్.. ఉగ్రవాదం తమకు సవాలు మారిందని భావించి సమీక్షలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిఘా అధికారులను, ఈ తరహా కేసులను విచారించిన అధికారుల నుంచి దేశ అత్యున్నత నిఘా విభాగం ఉగ్రవాదులు జాడలు తెలుసుకునే ప్రయత్నం చేయగా దాదాపు 23వేలమంది వివిధ రూపాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చారు. ఇటీవల పాప్ సింగర్ అరియానా గ్రాండే మాంచెస్టర్‌లో సంగీత విభావరి నిర్వహిస్తుండగా సల్మాన్ అబేదీ అనే 22 ఏళ్ల ఉగ్రవాది అమర్చిన బాంబులు పేలి 22 మంది మరణించడం తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన వారి సంఖ్య 59 నుంచి 119కి పెరిగింది. ఈ ఘటనకు సంబంధించి దక్షిణ మాంచెస్టర్‌లో ముగ్గురినీ, అక్కడికి దగ్గర్లోనే మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. లిబియన్ సంతతికి చెందిన సల్మాన్ అబేది ముందు నుంచే నిఘా పరిశీలనలో ముందు వరుసలో ఉన్నాడు. మాతృదేశం లిబియా అయ్యి ఉండి బ్రిటన్‌లో జన్మించిన అతడు ఇటీవల లిబియా, సిరియా పలుమార్లు వెళ్లొచ్చాడు. ఆ తర్వాతే అతడు ఉగ్రవాదిగా మారి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిఘా వర్గాలు అంచనా వేస్తున్న 23వేలమంది అనుమానిత ఉగ్రవాదుల్లో మూడు వేల మంది మాత్రం వివిధ విచారణల్లో చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా తేలడంతోపాటు ఇప్పటి వరకు పోలీసులు నిర్వహించిన 500 అపరేషన్లలో దొరికిన వారిలో ఉన్నారట. మిగి 20వేల మంది మాత్రం గతంలో విచారించి వివిధ కేటగిరీల్లో చేర్చిన వ్యక్తులుగా ఉన్నట్లు వెల్లడించారు. -
ఇల్లు వదిలి వెళ్లిపోయి.. ఉగ్రవాదులయ్యారు!
మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో పేలుడుతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఆ కేసుకు సంబంధించి సైఫుల్లా అనే వ్యక్తిని లక్నోలో పోలీసులు సుదీర్ఘ ఎన్కౌంటర్లో హతమార్చారు. అతడి బంధువులు, స్నేహితులలో ముగ్గురిని అరెస్టు చేశారు. వీళ్లందరికీ ఒకే రకమైన నేపథ్యం ఉంది. అందరూ తల్లిదండ్రుల మీద కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయినవాళ్లే. తాము పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామని తమవాళ్లను మభ్యపెట్టినవాళ్లే. వీళ్లంతా కలిసి ఉగ్రవాదం బాట పట్టారు. ఉగ్రవాద సంస్థల పంచన చేరి.. దేశద్రోహానికి ఒడిగట్టారు. అందుకే ఎన్కౌంటర్లో మరణించిన సైఫుల్లా మృతదేహాన్ని తీసుకోడానికి అతడి తండ్రి సర్తాజ్ ఖాన్ నిరాకరించారు. దేశానికి వ్యతిరేకంగా ఉన్నవాడిని ఈ దేశపు మట్టిలో ఎలా కలుపుతానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి ముఖం చూడటం కూడా తనకు ఇష్టం లేదంటూ వెళ్లిపోయారు. బీకాం చదివిన సైఫుల్లా.. రెండున్నర నెలల క్రితం తండ్రి మీద కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎప్పుడూ వాట్సప్ చూసుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని ఆయన తిట్టడమే అందుకు కారణం. దుబాయ్ వెళ్లి అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని, అందుకోసం వీసా సంపాదించేందుకు ఢిల్లీ వెళ్తున్నానని సైఫుల్లా చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి అతడి స్నేహితుడు ఆతిఫ్ ముజఫర్ కూడా తాను ఢిల్లీ వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకుంటానంటూ తన తల్లి మీద ఒత్తిడి తెస్తున్నాడు. అతడికి తండ్రి లేరు. అతడిని పంపడానికి తల్లికి ఇష్టం లేదు. అన్నతో కలిసి డెయిరీ వ్యాపారం చూసుకొమ్మని తాను చెప్పానని, కానీ అతడు తన మాట వినకపోగా, తనకు చెప్పకుండా వెళ్లిపోయాడని ఆమె వాపోయారు. నిజానికి వీళ్లిద్దరూ కలిసి వెళ్లింది ఢిల్లీ కాదు.. కాన్పూర్! అక్కడ ఉగ్రవాద సంస్థలతో వీరికి పరిచయం ఏర్పడింది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సైఫుల్లా తెల్లవారుజామునే ఇంట్లోంచి వెళ్లిపోయి అర్ధరాత్రి వచ్చేవాడని, ఇంట్లో ఉన్నా సెల్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ చూసుకుంటూ కూర్చునేవాడని సర్తాజ్ ఖాన్ చెప్పారు. అతడి గాడ్జెట్లను ఎవరైనా ముట్టుకున్నా విపరీతమైన కోపం వచ్చేదని.. పిల్లలను కూడా ముట్టుకోనిచ్చేవాడు కాడని అన్నారు. తనకు మంచి ఉద్యోగం దొరికిందని.. కుటుంబంలో ఎవరూ ఎప్పుడూ ఊహించలేనంత పెద్ద మొత్తం సంపాదిస్తానని ఆ తర్వాత తన అన్నతో సైఫుల్లా చెప్పాడు. సైఫుల్లాకు ఉన్న మరో స్నేహితుడు ఆతిఫ్, అతడి బంధువు డానిష్ తరచు గంగానది ఒడ్డున కలుస్తుండేవారు. వీళ్లందరికీ టీ అంటే ఇష్టం. అక్కడే కూర్చుని పలు కప్పులు తాగేవారు. కానీ టీ తాగేటప్పుడు కూడా ఫోన్లలో వీడియోలు చూస్తూనే ఉండేవారు తప్ప తనవైపు కూడా చూసేవారు కారని అక్కడి టీ దుకాణం యజమాని అన్నారు. వీళ్లలో ఆతిఫ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో డిప్లొమా చదివేవాడు. 2013లో తండ్రి చనిపోవడంతో చదువు మానేశాడు. అతడిని ఎవరైనా ఏమైనా అడిగితే ఇట్టే కోపం వచ్చేసేదని అతడి సోదరుడు తెలిపారు. గత రెండు నెలల్లో ఆతిఫ్ తన తల్లికి ఫోన్ చేసినా, ఆమె మాట్లాడేవారు కారు. చిట్టచివరిసారిగా తన అక్కకు ఫోన్ చేసి, ముంబైలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడని, ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేయలేదని అతడి తల్లి తెలిపారు. సుమారు పది నెలల క్రితం ఎవరికీ చెప్పకుండా ఆతిఫ్ సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు వెళ్లాడని అంటున్నారు. అందుకోసం కుటుంబానికి చెందిన భూమిని 22 లక్షల రూపాయలకు అతడు అమ్మేశాడు. ఆతిఫ్, డానిష్లతో పాటు అలీగఢ్ యూనివర్సిటీకి చెందిన వాళ్ల స్నేహితుడు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. -
తమిళనాడు వేలూరులో ఉగ్రజాడలు...!
-
34 మంది ఉగ్రవాదులు అరెస్టు
అల్జీర్స్: ఉగ్రవాదులకు సహకరించిన 34 మంది అనుమానిత ఉగ్రవాదులను అల్జీరియా సైన్యం అరెస్టు చేసింది. టిజి ఓజో, ఎల్ క్వీడ్ ప్రావిన్స్‌లలో ఉగ్రవాదుల అలికిడి ఎక్కువగా ఉందని, అందుకు కారణం అక్కడ ఉన్న కొంతమంది సహకరిస్తుండటం వల్లే అలా జరుగుతోందని, అందుకే కొంతమందిని అరెస్టు చేసినట్లు ఆ దేశ రక్షణశాఖ తెలిపింది. ఉగ్రవాద చర్యల గురించి ఆరా తీయగా ఎల్ క్వీడ్ ప్రాంతంలో వారికి సంబంధించిన సమాచారం లభించిందని, దాంతో పోలీసుల సహాయం తీసుకొని తాము దాడులు నిర్వహించామని, ఈ క్రమంలో 34మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసిటనట్లు వెల్లడించింది. -
డామన్‌లో ఉగ్రవాదుల చొరబాటు!
డామన్: కేంద్రపాలిత ప్రాంతం డయ్యూడామన్‌లో ఉగ్ర కలకలం పోలీసులతోపాటు ప్రజలకూ కంటిమీద కునుకులేకుండా చేసింది. నేవీ అధికారుల దుస్తుల్లో, ఏకే-47 తుపాకులు చేతబట్టుకుని డామన్ జిల్లా కేంద్రంలోకి చొరబడ్డ నలుగురు అనుమానితుల్ని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'తుపాకులతో నలుగురు వ్యక్తులు సంచరిస్తున్నారని స్థానికులు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు, మొదట తీరప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, ఒక బోటు నుంచి నేవీ అధికారుల దుస్తుల్లో నలుగురు వ్యక్తులు తుపాకుతో దిగిన దృశ్యాలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన డామన్ ఎస్సీ ఈశ్ సింఘాట్.. నగరంలోని అన్నిప్రాంతాలకు సుశిక్షితులైన సాయుధబృందాలను పంపారు. రహదారుల వెంబడి గస్తీని పెంచారు. రాత్రి 1:30 ప్రాంతంలో ఒక మినీట్రక్కులో ప్రయాణిస్తున్న అనుమానితులను అటకాయించిన పోలీసులు.. ఆయుధాలను లాక్కొని విచారణ నిమిత్తం నలుగురినీ ఎస్సీ ఆఫీసుకు తరలించారు. డామన్‌కు ఎందుకొచ్చారిని ప్రశ్నించగా '200 కేజీల బరువున్న ఒక వస్తువు కోసం వచ్చాం'అని అనుమానితులు సమాధానమిచ్చారు. మరికొన్ని ప్రశ్నలకు కూడా ఇలా తలతిక్క సమాధానం చెప్పడంతో పోలీసులు తమదైన శైలి విచారణకు ఉద్యుక్తులయ్యారు. అప్పుడుకానీ నిజం బయటపడటేదు! నేవీ దుస్తుల్లో వచ్చిచ్చిన ఆ నలుగురూ నిజంగా నేవీ అధికారులని, మాక్ డ్రిల్‌లో భాగంగా డామన్ పట్టణంలో ఒక చోట ఉన్న 'జెమిని' అనే 200 కేజీల బోటును తీసుకెళ్లడం వారి టార్గెట్ అని, లక్ష్యాన్ని చేరుకునే లోపే దొరికిపోయారని నేవీ ఉన్నతాధికారులు లోకల్ పోలీసులకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.రు. పట్టుబడ్డ తమవారికి సంబంధించిన పూర్తివివరాలను పోలీసులకు చేరిన అనంతరం, ఆ నలుగురూ విడుదలయ్యారు. 'మిస్‌కమ్యూనికేషన్' వల్లే ఇలా జరిగిందని ఎస్పీ మీడియాకు వివరించారు. -
8 మంది ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్
కౌలాలంపూర్: మలేసియాలో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం గమనార్హం. నిందితులంతా 22 నుండి 36 సంవత్సరాల వయసు గల వారిగా మలేసియా పోలీసు అధికారి తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ఆరుగురిని 'టాండ్జిమ్ అల్ ఖైదా' ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. మరో ఇద్దరికి ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఆగస్టులో కూడా ఇద్దరు సివిల్ సర్వెంట్లకు ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం గుర్తించిన ఇద్దరు సివిల్ సర్వెంట్లు అదే వింగ్‌కు చెందినవారుగా అనుమానిస్తున్నారు. -
పుత్తూరులో పూర్తయిన ఆక్టోపస్ ఆపరేషన్