Terrorist vikaruddin
-
వికార్ ఎన్ కౌంటర్‌పై విచారణ
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్‌పై విచారణ సాగుతోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. విచారణలో పోలీసుల తప్పు ఉందని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్‌కౌంటర్‌పై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతోపాటు పలువురు సీఎం కేసీఆర్‌కు, తనకు విజ్ఞాపనలు అందజేశారన్నారు. హోంమంత్రిని బర్తరఫ్ చేస్తారని ఆదివారం జరిగిన ప్రచారాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లగా రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరిని ఉంచాలి, ఎవరిని తొలగించాలనేది సీఎం విచక్షణాధికార మని నాయిని అన్నారు. మార్పుపై సీఎంకు సర్వాధికారాలు ఉంటాయని పేర్కొన్నారు. 20న అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లు టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 20న పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరిస్తామని మంత్రి నాయిని చెప్పారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఆయనను పార్టీ అధినేత కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాయిని ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు. 20న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా నామినేషన్ల స్వీకరణ, 21న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 23న ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు. ఉపసంహరణల అనంతరం ఎవరైనా పోటీలో ఉంటే 24న ఎల్బీస్టేడియంలో జరిగే పార్టీ ప్లీనరీలో ఎన్నిక జరుపుతారు. ఆరోజు హాజరయ్యే 36 వేల మంది ప్రతినిధులు రాష్ట్ర అధ్యక్షుణ్ని ఎన్నుకుంటారు. ఒకవేళ ఉపసంహరణల తర్వాత బరిలో ఒక్కరే ఉంటే అదే రోజు రాష్ట్ర అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తామని నాయిని చెప్పారు. -
వికారుద్దీన్ గ్యాంగ్ బాడీలకు నేడు పోస్టుమార్టం
-
క్లూస్ టీమ్ పరిశీలన
భువనగిరి : ఆలేరు శివారులో జాతీయ రహదారిపై జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతాన్ని క్లూస్ టీములు సందర్శించాయి. పలు కోణాల్లో పరిశీలన చేశాయి. ఎన్కౌంటర్లో తీవ్రవాది వికారుద్దీన్, మరో నలుగురు మృతి చెందిన నేపథ్యంలో కేసును అన్నికోణాల్లో పరిశీలన చేపట్టారు. ప్రధానం గా ఎన్కౌంటర్ జరిగిన వాహనంతోపాటు, రక్తం మరకలను, వాహనం నుంచి విడిపోయిన భాగాలను, పలుచోట్ల పడిన బుల్లెట్ల విడిభాగాలను సేకరించారు. రక్తంలో ఉన్న బుల్లెట్‌ను జనం గుర్తించి పోలీసులకు అప్పగించారు. క్లూస్ టీం సభ్యులు రోడ్డుపై పడిన రక్తపు మరకలు పడిన డాం బర్ను తవ్వి తీసుకెళ్లారు. ఐరన్ రాడ్, గాజు ముక్కలను సేకరించారు. పంచనామా కోసం ఆ ప్రాంతం ఏ సర్వేనంబర్, ఏ గ్రామం పరిధి అన్న వివరాలతోపాటు అక్కడి రైతుల పేర్లను నమోదు చేసుకున్నారు. పోలీసులపై అజమాయిషీ చేసే తత్వం ఆలేరు సమీపంలో ఎన్కౌంటర్లో మృతిచెందిన వికారుద్దీన్ ఎప్పుడూ పోలీసులతో దురుసుగా వ్యవహరిస్తూ అజమాయిషీ చేసే వాడని ఘటనస్థలంలో పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా బిర్యానీ కోసం ఎక్కువగా తగువుపడేవాడని చెప్పారు. రెండు రోజుల క్రితం మోత్కూరు మండలం జానకీపురం ఎన్కౌంటర్లో తమకు చెందిన వారు చనిపోయారని, దానికి బదులు తీర్చుకుంటామని ఎస్కార్ట్ వాహనంలో కూడా పోలీసులతో గొడవపడ్డారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దూషించారని తెలుస్తోంది.