క్లూస్ టీమ్ పరిశీలన
భువనగిరి : ఆలేరు శివారులో జాతీయ రహదారిపై జరిగిన ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని క్లూస్ టీములు సందర్శించాయి. పలు కోణాల్లో పరిశీలన చేశాయి. ఎన్‌కౌంటర్‌లో తీవ్రవాది వికారుద్దీన్, మరో నలుగురు మృతి చెందిన నేపథ్యంలో కేసును అన్నికోణాల్లో పరిశీలన చేపట్టారు. ప్రధానం గా ఎన్‌కౌంటర్ జరిగిన వాహనంతోపాటు, రక్తం మరకలను, వాహనం నుంచి విడిపోయిన భాగాలను, పలుచోట్ల పడిన బుల్లెట్ల విడిభాగాలను సేకరించారు. రక్తంలో ఉన్న బుల్లెట్‌ను జనం గుర్తించి పోలీసులకు అప్పగించారు. క్లూస్ టీం సభ్యులు రోడ్డుపై పడిన రక్తపు మరకలు పడిన డాం బర్‌ను తవ్వి తీసుకెళ్లారు.
ఐరన్ రాడ్, గాజు ముక్కలను సేకరించారు. పంచనామా కోసం ఆ ప్రాంతం ఏ సర్వేనంబర్, ఏ గ్రామం పరిధి అన్న వివరాలతోపాటు అక్కడి రైతుల పేర్లను నమోదు చేసుకున్నారు. పోలీసులపై అజమాయిషీ చేసే తత్వం ఆలేరు సమీపంలో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వికారుద్దీన్ ఎప్పుడూ పోలీసులతో దురుసుగా వ్యవహరిస్తూ అజమాయిషీ చేసే వాడని ఘటనస్థలంలో పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా బిర్యానీ కోసం ఎక్కువగా తగువుపడేవాడని చెప్పారు. రెండు రోజుల క్రితం మోత్కూరు మండలం జానకీపురం ఎన్‌కౌంటర్‌లో తమకు చెందిన వారు చనిపోయారని, దానికి బదులు తీర్చుకుంటామని ఎస్కార్ట్ వాహనంలో కూడా పోలీసులతో గొడవపడ్డారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దూషించారని తెలుస్తోంది.