విశ్వాస పరీక్షలో మే గెలుపు
లండన్: బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన తొలి విశ్వాస పరీక్షలో గట్టెక్కారు. గురువారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో థెరిసాకు అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 309 ఓట్లు పడ్డాయి. మైనారిటీ ప్రభుత్వ అధినేతగా ఆమె ఎదుర్కొన్న తొలి పెద్ద పరీక్ష ఇదే. డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ) మద్దతుతోనే ఆమె విజయం సాధ్యమైందని భావిస్తున్నారు. రాణి ప్రసంగంలో పొందుపర్చాల్సిన పార్లమెంటరీ ఎజెండాపై ఈ విశ్వాస పరీక్ష జరిగింది.