Test series draw
-
తొలి ఆసియా దేశంగా
ఇమ్రాన్ ఖాన్, వసీం ఆక్రమ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని వంటి మహామహుల సారథ్యాలలోని జట్లు ఈ మైదానంలో విజయాన్ని సాధించలేకపోయాయి. టెస్ట్ ప్రారంభానికి ముందు ట్యాంపరింగ్ ఉదంతం.. కెప్టెన్ చండిమాల్‌పై వేటు.. ఒత్తిడిలో లంక యువ జట్టు.. సురంగ లక్మల్‌కు సారథ్య బాధ్యతలు.. సిరీస్‌లో వెనుకంజ.. టెస్టులో పలుమార్లు వర్షం అంతరాయం. ఇవన్నీ శ్రీలంక విజయానికి అడ్డంకి కాలేదు. ఆసియా జట్లకు కలగా ఉండే కింగ్స్టన్ ఓవల్ మైదానంలో గెలిచి శ్రీలంక చరిత్ర సృష్టించింది. బ్రిడ్జిటౌన్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. పేస్‌కు స్వర్గధామమైన కింగ్స్టన్ ఓవల్ మైదానంలో గెలిచిన తొలి ఆసియా దేశంగా శ్రీలంక చరిత్ర సృష్టించింది. చివరి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సిరీస్‌లో విశేషంగా రాణించిన విండీస్ కీపర్ షేన్ డౌరిచ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ డేనైట్ టెస్టులో చివరకు విజయం లంకనే వరించింది. 144 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకను హోల్డర్ దెబ్బతీశాడు, వరుసగా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచాడు. దీంతో ప్రధాన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ దశలో శ్రీలంక 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో డి పెరీరా (23 నాటౌట్), కుశాల్ పెరీరా (28 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు విజయాన్నందించారు. రెండో ఇన్నింగ్స్‌లో హోల్డర్ ఐదు వికెట్లు సాధించగా, కీమర్ రోచ్‌కు ఒక్క వికెట్ దక్కింది. చివరి టెస్టులో ఇరజట్ల స్కోర్ వివరాలు వెస్టిండీస్ : 204 & 93 శ్రీలంక : 154 & 144/6 -
ఇష్ పోరాటం.. అద్భుత విజయం
క్రైస్ట్‌చర్చ్: ఏడుగురు ఫీల్డర్లను దగ్గరగా మొహరించినా మొండిగా పోరాడాడు. అడ్డుగోడలా నిలిచి జట్టుకు చిరస్మరనీయమైన విజయాన్ని అందించాడు. ఇష్ సోధీ ఒంటరి పోరాటం చేయటంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌ను న్యూజిలాండ్ డ్రాగా ముగించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో న్యూజిలాండ్ గెలుచుకుంది. ఇప్పటికే ఆక్లాండ్‌లో జరిగిన తొలి టెస్ట్‌ను కివీస్ గెలిచిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌ను కివీస్ చేజిక్కించుకుంది. గతంలో 1983-84లో జరిగిన టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్ గెలిచింది. రెండో టెస్ట్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలనుకున్న ఇంగ్లండ్‌కు పలుమార్లు వాతావరణం అడ్డంకిగా నిలిచింది. వికెట్ నష్టపోకుండా 42 పరుగులతో ఐదో రోజు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, స్కోర్ బోర్డ్‌లో ఒక్క పరుగు చేరకముందే కివీస్ బ్యాట్స్‌మన్ రావల్(17).. బ్రాడ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ వారి ముందు నిలువలేకపోయారు. ఓ వైపు లాథమ్(82) ఒంటరి పోరాటం చేసినా సహచరులు నుంచి సహకారం అందలేదు. లాథమ్ వెనుదిరిగాక ఇష్ సోధీ (56; 200 బంతులు, 9ఫోర్లు) ఒంటరి పోరాటం చేసి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకోవడంతో రెండో టెస్ట్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి ఆకట్టుకున్నకివీస్ బౌలర్ టిమ్ సౌథికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, సిరీస్‌లో నిలకడగా రాణించిన ట్రెంట్ బౌల్ట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డ్లు లభింబాయి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ : 307 ఆలౌట్, 352/9 డిక్లేర్డ్ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 278 ఆలౌట్, 256/8 -
'టీమిండియాకు ఇదే మంచి ఛాన్స్'
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టుపై దిగ్గజ ఆటగాడు ఎరపల్లి ప్రసన్న ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఇప్పటివరకూ చూసిన భారత జట్ల పరంగా చూస్తే ప్రస్తుత విరాట్ కోహ్లి నేతృత్వంలోని జట్టే అత్యంత పటిష్టంగా ఉందంటూ కొనియాడాడు. గత 60-70 ఏళ్లలో చూస్తే బౌలింగ్ విభాగంలో ఇప్పటి భారత జట్టు చాలా మెరుగైందంటూ కితాబిచ్చాడు. ప్రపంచ క్రికెట్లో భారత జట్టు ఒక ఎటాకింగ్ జట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతకుముందు ఎప్పుడూ ఇంత పటిష్టంగా ఉన్న భారత జట్టును నేను చూడలేదు. అయితే తుది జట్టుతో సఫారీలతో పోరుకు సిద్దమయ్యేటప్పుడు ఐదు బౌలర్లతో దిగితేనే మంచిది. మ్యాచ్‌ను గెలవాలంటే ఐదుగురి బౌలర్ల ఫార్ములా అవసరం. అదే సమయంలో అదనపు బ్యాట్స్‌మన్ కూడా ఉంటే బాగుంటుంది. దక్షిణాఫ్రికా గడ్డపై మొదటిసారి సిరీస్‌ను సాధించడానికి భారత్‌కు ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు. అంతటి సమతుల్యం భారత జట్టులో కనబడుతోంది. ఆటగాళ్లు కూడా సానుకూల ధోరణితో ఉన్నారు. ఇందుకు టీమిండియా ఆడిన గత సిరీస్‌లే ఉదాహరణ. సఫారీలపై తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్మన్లు 350 పరుగులు చేస్తే సగం మ్యాచ్‌ను గెలిచినట్లే' అని ప్రసన్న విశ్లేషించాడు. శుక్రవారం కేప్‌టౌన్‌లో తొలి టెస్టు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. -
శ్రీలంకతో ఉత్కంఠభరిత ‘డ్రా’
టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా దక్షిణాఫ్రికా కొలంబో: శ్రీలంక గడ్డపై 21 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు టెస్టు సిరీస్ గెల్చుకుంది. సోమవారం ఇక్కడ చివరి బంతి వరకు ఆసక్తికరంగా సాగిన రెండో టెస్టును దక్షిణాఫ్రికా ‘డ్రా’ చేసుకోగలిగింది. విజయం కోసం చివరి రోజు 331 పరుగులు చేయాల్సిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కష్ట సాధ్యమైన విజయలక్ష్యం కావడంతో సఫారీ బ్యాట్స్‌మెన్ తొలి బంతినుంచే డ్రా కోసం ఆడారు. ఆమ్లా (159 బంతుల్లో 25), డివిలియర్స్ (67 బంతుల్లో 12), డుమిని (65 బంతుల్లో 3) జట్టును రక్షించే ప్రయత్నం చేశారు. వీరందరూ వెనుదిరిగినా చివర్లో ఫిలాండర్ (98 బంతుల్లో 27 నాటౌట్) పోరాడి దక్షిణాఫ్రికాను గట్టెక్కించాడు. రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించినా... లంక ఆఖరి రోజు 94 ఓవర్లు బౌలింగ్ చేసి కూడా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది. స్పిన్నర్ హెరాత్ (5/40) శ్రమ వృథా అయింది. తొలి టెస్టు నెగ్గిన దక్షిణాఫ్రికా 1-0తో సిరీస్ సొంతం చేసుకుంది. తాజా ఫలితంతో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి మరో సారి టెస్టుల్లో నంబర్‌వన్ స్థానాన్ని అందుకుంది.