Textbook prices
-
పెరిగిన పాఠ్య పుస్తకాల ధరలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల్లోని 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సేల్ పాఠ్య పుస్తకాల ధరలు పెరిగాయి. పుస్తకాల ముద్రణకు వినియోగించే పేపరు ధరలు పెరగడంతోనే పుస్తకాల ధరలు పెంచాల్సి వచ్చిందని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సేల్ పుస్తకాల ముద్రణ ప్రారంభమైందని, వచ్చే నెల 21 నుంచి పైతరగతుల బోధన ప్రారంభమవనున్న నేపథ్యంలో ఈ నెల 15 లోగా మార్కెట్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గతేడాది ముద్రించిన పుస్తకాల్లో 9 లక్షల వరకు మిగిలిపోవడంతో, సోషల్ స్టడీస్ (ఈసారి సోషల్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని పాఠాలు, భౌగోళిక స్వరూపాలు మార్పు చేశారు) మినహా మిగతా పాఠ్య పుస్తకాలను విక్రయించేందుకు విద్యా శాఖ అనుమతిచ్చినట్లు తెలిసింది. -
ఇక పాఠ్య పుస్తకాలు చౌక
వచ్చే విద్యా సంవత్సరంలో 30 శాతం తగ్గనున్న ధరలు ♦ టెండర్ల ఖరారుకు ప్రభుత్వ చర్యలు... గతేడాది ఒక్కో పేజీకి 29.50 పైసలు ♦ ఈసారి ఒక్కో పేజీకి 20.50 పైసలకు ఎల్1 టెండర్ ♦ అదే రేటుతో చేసేందుకు అంగీకరించిన మిగతా ప్రింటర్లు, పబ్లిషర్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు కొనుగోలు చేసే పాఠ్య పుస్తకాల ధరలు తగ్గనున్నాయి. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 1.15 కోట్ల పుస్తకాలను తక్కువ ధర కు ముద్రించి, విద్యార్థులకు మార్కెట్లో పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు ప్రింటర్లు, పబ్లిషర్లు అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. 1.15 కోట్ల పుస్తకాల ముద్రణ, పంపిణీ అంచనాలతో విద్యాశాఖ పిలిచిన టెండర్లలో 12 మంది పెద్ద ప్రింటర్లు, పబ్లిషర్లు టెండర్లు వేశారు. అందులో ఎల్1 సంస్థ పుస్తకాల్లోని ఒక్కో పేజీని 20.50 పైసలకు ముద్రించి, పుస్తకాలను అందించేందుకు టెండర్లు వేసింది. అయితే 2015-16 విద్యా సంవత్సరంలో సేల్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసేందుకు ఒక్కో పేజీకి 29.50 పైసలతో టెండర్లు ఖరారు చేసింది. 2015-16 విద్యా సంవత్సరంతో పోల్చుకుంటే 2016-17 విద్యా సంవత్సరంలో పుస్తకాలను అందించేందుకు తక్కువ ధరను కోట్ చేశారు. దీంతో సేల్ పుస్తకాల ధరలు 30 శాతం వరకు తగ్గుతాయని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎల్1 సంస్థ కోట్ చేసిన రేటుకే (20.50 పైసలకు ఒక పేజీ) మిగతా సంస్థలు పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసేందుకు బుధవారం ప్రింటర్లు, పబ్లిషర్లతో నిర్వహించిన సమావేశంలో అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే టెండర్లను ఖరారు చేయనున్నారు. మొత్తానికి వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల లెక్కల ప్రకారం టెండర్లు పిలిచారు. ఈసారి పుస్తకాల సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉంది. పెరగనున్న పుస్తకాల సంఖ్య! ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు చాలా వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకే ప్రభుత్వం నిర్ణయించిన పాఠ్య పుస్తకాలను వినియోగిస్తున్నాయి. ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలు తమకు ఇష్టమైన సిలబస్ కలిగిన పాఠ్య పుస్తకాలను వినియోగిస్తున్నాయి. అయితే 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలల్లోనూ విద్యాశాఖ నిర్ణయించి, రూపొందించిన పాఠ్య పుస్తకాలనే వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రైవేటు పాఠ శాలలు దీనిని అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. మరోవైపు ఎల్కేజీ, యూకేజీకి కూడా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సిలబస్‌ను రూపొందించి పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. దీంతో ఈసారి సేల్ పుస్తకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
ప్రియమైన పాఠ్యపుస్తకం..
- భారీగా పెరిగిన టెక్స్ట్‌బుక్‌ల ధరలు - ప్రైవేటు విద్యార్థులకు అదనపు భారం - జిల్లాలో ఆ మొత్తం రూ.2.5 కోట్లకు పైనే.. రాయవరం, న్యూస్‌లైన్ : పిల్లలకు.. దీపావళి నాడు పొద్దు గుంకేసరికి కూడా బాణసంచా ఇంటికి రాకపోతే ఎంత వెలితిగా ఉంటుందో, బడులు తెరిచి, కొత్త తరగతిలోకి వెళ్లేసరికి కొత్త పాఠ్యపుస్తకాలు చేతికి రాకపోయినా అంతే వెలితిగా ఉంటుంది. కొత్త పుస్తకాల నుంచి వెలువడే ఓ విధమైన సుగంధం.. వారికి చదువుల తల్లి నిశ్వాసలా ఉంటుంది. వాటికి అట్టలు వేసుకోవడం, రంగురంగుల, బొమ్మల స్టిక్కర్లు అంటించి, పేర్లు రాసుకోవడం లేదా అమ్మానాన్నలతో రాయించుకోవడం అదో పండగ సందడే వారికి. అయితే తమ పిల్లల ఈ సరదాను తీర్చడం ఈసారి తల్లిదండ్రులకు భారం కానుంది. కారణం-2014-15 విద్యా సంవత్సరం నుంచి బోధించనున్న కొత్త పాఠ్యపుస్తకాల ధరలను ప్రభుత్వం భారీగా పెంచడమే. పాఠ్యపుస్తకాల ధరలు గతేడాదితో పోల్చితే 80 నుంచి 100 శాతం వరకు పెరిగాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల సెట్ ధరల పెరుగుదల రూ.48 నుంచి రూ.242 వరకు ఉంది. ప్రభుత్వం మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగానే పాఠ్యపుస్తకాలను అందిస్తుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ పాఠ్యపుస్తకాలను విధిగా బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిందే.పదో తరగతి సిలబస్ ఈ ఏడాది నుంచి పూర్తిగా మారిపోయింది. కొత్త సిలబస్‌లో పాఠ్యపుస్తకాలు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలయ్యాయి. వీటి ధర గతేడాది కంటే రూ.242 అధికంగా ఉంది. ఇప్పటికే తొమ్మిదో తరగతి వరకూ అమల్లో ఉన్న సీసీఈ విధానంలో కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందించారు. జిల్లాలో 8.12 లక్షల మంది విద్యార్థులు జిల్లాలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల్లో 4.46 లక్షల మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 3.66 లక్షల మంది విద్యార్థులు చదవనున్నట్టు అంచనా. పాఠ్య పుస్తకాల ధరలు పెరగడంతో ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లితండ్రులపై సుమారు రూ.2.5 కోట్ల అదనపు భారం పడనున్నట్టు అంచనా. జిల్లాలో అనేక ప్రైవేటు పాఠశాలలు జూన్ మొదటి వారంలో పునఃప్రారంభం కానున్నాయి. దీంతో ఆ పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాల కోసం పుస్తక విక్రయ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ఇండెంట్లు ఇచ్చిన వారు వచ్చిన పుస్తకాలను తెచ్చుకునే పనిలో పడ్డారు. అయితే పూర్తి స్థాయిలో పుస్తకాలు బుక్‌షాపులకు చేరుకోలేదని, జూన్ మొదటి వారానికి గానీ వచ్చే అవకాశం లేదని పలువురు పాఠశాల యజమానులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కాగా పెంచిన పాఠ్యపుస్తకాల ధరలను తగ్గించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.