thacted houses
-
కరెంటు తీగలు ఒకదానికొకటి రాసుకుని..
పరిగి(రంగారెడ్డి జిల్లా): వేలాడుతున్న కరెంటు తీగలు ఒకదానికొకటి రాసుకోవడంతో నిప్పు రవ్వలు చెలరేగి ఓ గుడిసె దగ్దమయ్యింది. ఈ సంఘటన దోమ మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల వద్ద ఆదివారం మద్యాహ్నం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. దోమ మండలానికి చెందిన బోయిని నర్సింహులు తమ పొలం వద్ద గుడిసె కట్టుకుని అందులోనే తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. కాగా ఆ గుడిసెకు సమీపం నుంచే కరెంటు వైర్లు ఉండటంతో పాటు అవి కిందకు వేలాడుతున్నాయి. మద్యాహ్నం కాస్తా గాలి ఎక్కువగా రావటంతో వేలాడుతున్న రెండు వైర్లు ఒకటికొకటి రాసుకున్నాయి. దీంతో నిప్పు రవ్వలు చెలరేగి గుడిసె తగలబడింది. పొలంలో పనులు చేసుకుంటున్న కుటుంబీకులు వచ్చి ఆర్పే ప్రయత్నం చేసే లోపు గుడిసె తగలబడింది. గుడిసెలో ఉన్న ఆరు ఉల్లిగడ్డ సంచులు, ఇతర వంట సామాగ్రి, బట్టలు, వ్యవసాయ సామాగ్రి తగలబడి పోయాయని బాధితు రైతు పేర్కొన్నాడు. సుమారుగా రూ. 40 వేల ఆస్తి నష్టం జరిగినట్లు అతను పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. -
అగ్నిప్రమాదంలో రూ. 3 లక్షల ఆస్తి నష్టం
రెడ్డిగూడెం(కృష్ణా): ప్రమాదవశాత్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి రెండు పూరిళ్లు ఇళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో ఇంటిలో ఉన్న రూ. 62 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో.. మంటలు ఎగిసిపడి రెండు పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు వ్యాపించకుండా.. అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రూ. మూడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు సమాచారం. -
సాలూరులో అగ్ని ప్రమాదం
సాలూరు(విజయనగరం): విజయనగరం జిల్లా సాలూరులో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో నాలుగు పూరి ఇళ్లు కాలి బూడిద అయ్యాయి. సాలూరులోని జన్ని వీధిలో ఈ రోజు ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. తర్వాత చుట్టు పక్కల ఇళ్లకు అంటుకుని నాలుగు ఇళ్లు కాలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
15 పూరిళ్లు దగ్థం, రూ.10 లక్షల ఆస్తినష్టం
విజయనగరం: విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలం గదపువలసలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 15 పూరిళ్లు దగ్థమైయ్యాయి. అంతేకాక 10 లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.