సాలూరు(విజయనగరం): విజయనగరం జిల్లా సాలూరులో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో నాలుగు పూరి ఇళ్లు కాలి బూడిద అయ్యాయి. సాలూరులోని జన్ని వీధిలో ఈ రోజు ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. తర్వాత చుట్టు పక్కల ఇళ్లకు అంటుకుని నాలుగు ఇళ్లు కాలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.