Thailand country
-
దేవుళ్ల పండగ అంటే తెలుసు..! మరి దెయ్యాల పండగ?
దేవుళ్లకు పండగలు చేసుకోవడం ఎక్కడైనా మామూలే! దయ్యాల పండగ మాత్రం థాయ్‌లాండ్‌కు మాత్రమే ప్రత్యేకం. ఏటా జూన్ నెలలో మూడు రోజుల పాటు జరిగే ఈ పండగలో జనాలు దయ్యాల బొమ్మలను చిత్రించిన ముసుగులను ధరించి, వీథుల్లోకి వచ్చి, సంప్రదాయ నృత్య గానాలతో భారీ ఊరేగింపులు జరుపుతారు. దయ్యాల ముసుగులను వెదురుతోను, పలచని కలపతోను తయారు చేస్తారు. పెద్దపెద్ద ముక్కులు, చెవులతో తయారుచేసే ఈ ముసుగులు వినోదభరితంగా ఉంటాయి.థాయ్‌లాండ్‌లోని లోయీ ప్రావిన్స్ డాన్సాయ్ పట్టణంలో ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ‘ఫి టా ఖోన్ ఘోస్ట్ ఫెస్టివల్’గా పిలుచుకునే ఈ మూడు రోజుల పండుగ మొత్తం కార్యక్రమాన్ని ‘బున్ లువాంగ్’ అంటారు. ఇందులో భాగంగా మున్ నది అవతారంగా భావించే బౌద్ధ సన్యాసి ఫ్రా ఉపాకుత్ ఆత్మశక్తిని ఆహ్వానించి, ప్రజల రక్షణ కోసం ప్రార్థనలు జరుపుతారు. ఈ ఏడాది జూన్ 7 నుంచి 9 వరకు డాన్సాయ్ పట్టణంలో ఈ దయ్యాల పండగ సంప్రదాయ రీతిలో అట్టహాసంగా జరుగుతోంది.‘ఫి టా ఖోన్’ పండగ నేపథ్యానికి సంబంధించిన గాథ బౌద్ధ జాతక కథల్లో ఉంది. దీనికి సంబంధించిన జాతక కథ ప్రకారం.. బుద్ధుడు తన ఒకానొక పూర్వ జన్మలో యువరాజుగా పుట్టాడట. ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకోవడానికి దేశాటనకు వెళ్లాడట. ఎన్నాళ్లు గడిచినా రాజధానికి తిరిగి రాకపోవడంతో అతడు మరణించి ఉంటాడని భావించిన రాజబంధువులు సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారట.ఆ యువరాజు ఆత్మను ఆహ్వానించడానికి ఈ వేడుకను జరుపుకోవడం అప్పటి నుంచి సంప్రదాయంగా మారిందట. మొదటిరోజు దయ్యాల ముసుగులు ధరించి ఊరేగింపులు జరిపే వేషదారులు సందర్శకులను కట్టెలతో భయపెడుతుంటారు. రెండోరోజు తారాజువ్వలను ఎగరేస్తారు. మూడోరోజు స్థానిక బౌద్ధ ఆలయానికి చేరుకుంటారు. ముగింపు కార్యక్రమంలో ఆలయంలోని బౌద్ధ సన్యాసులు శాంతి ప్రార్థనలు చేస్తారు.ఇవి చదవండి: పిల్లలూ గుర్తుందా!? వేసవి సెలవులు అయిపోవచ్చాయి..! -
తెలంగాణలో థాయ్‌లాండ్ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్ : థాయ్‌లాండ్‌కు భారత్‌కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మదాపూర్‌లో శనివారం ఇండియా-థాయ్‌లాండ్ మ్యాచింగ్ అండ్ నెట్వర్కింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి థాయ్‌లాండ్ నుంచి ఉప ప్రధాని జరీన్ లక్సనావిసిత్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. రబ్బర్ వుడ్ పరిశ్రమలో థాయ్ ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణతో థాయ్ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుని, పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ష్రం దేశ వృద్ధి రేటును మించి అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు గేట్వేగా తెలంగాణతో అనుసంధానం చేయాలని తెలిపారు. తెలంగాణలో వాణిజ్య రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని, థాయ్ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఫర్నిచర్ పర్క్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ థాయ్‌లాండ్ ఉప ప్రధానిని కోరారు. థాయ్‌లాండ్ ఉప ప్రధాని భారత్ పర్యటన పెట్టుబడులకు ఊతం ఇచ్చేలా ఉందన్నారు. తెలంగాణలో ఫుడ్ ప్రసెసింగ్‌కు సరిపడా నీటి వనరులు ఉన్నాయన్నారు. ఫర్నీచర్ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెడుతున్న థాయ్‌లాండ్.. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు పరిచయం చేయాలని సూచించారు. రబ్బర్ వుడ్, టింబర్ వుడ్ ఉత్పత్తుల రవాణా కోసం 400 కి. మీ దూరంలో కృష్ణపట్నం పోర్టు ఉందని, రవాణా సబ్సిడీలు కూడా అందిస్తామని తెలిపారు. బ్యాంకాక్-హైదరాబాద్ విమాన సర్వీసులు పెంచి పర్యాటకాన్ని అభివృద్ధి చెందేలా ప్రొత్సహించాలని అన్నారు. అనంతరం కేటీఆర్ జరీన్ లక్సనావిత్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. -
వంద దెయ్యాలు - వెయ్యి సందేహాలు!
హారర్ థాయ్‌లాండ్ దేశం పర్యాటక పరంగానే కాదు దెయ్యాల పరంగా కూడా చాలా ఫేమస్. టీవి వాళ్లు తమ రేటింగ్‌ను పెంచుకోవడానికి బుర్రలు బద్దలు కొట్టుకోనక్కర్లేదు. సింపుల్‌గా దెయ్యాల షో ఒకటి ప్లాన్ చేస్తే చాలు... రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది. థాయిలాండ్‌లోని ఒక టీవి ఛానల్లో ప్రసారమయ్యే ‘ది షోకు’కు లభిస్తున్న ఆదరణ అంతా ఇంత కాదు.తెల్లవారుజామున రెండు గంటలకు ఈ షో మొదలవుతుంది. తమకు ఎదురైన హారర్ అనుభవాలను ఈ షోలో పంచుకొని మరోసారి భయపడి, చాలామందిని భయపెడతారు దెయ్యం భయ బాధితులు. ఈ షోను నిర్వహించే కపోల్ సెలబ్రిటీ అయిపోయాడు. ఈ షోలో ‘ప్రశ్నా-జవాబు’ కార్యక్రమం కూడా ఉంది. దెయ్యాలకు సంబంధించిన ఏ సందేహం అడిగినా కపోల్ టక్కుమని జవాబు చెప్పేస్తాడు. ‘‘ఒకటి కాదు రెండు కాదు...థాయ్‌లాండ్‌లో వంద దెయ్యాలు ఉన్నాయి’’ అంటున్నాడు కపోల్. రకరకాల దెయ్యాల మనస్తత్వాలను విశ్లేషించడంలో ఆయనకు మంచి పేరు ఉంది. సన్నగా, పొడుగ్గా ఉండే లేటెస్ట్ దెయ్యం ‘పి పాబ్’ గురించి కావచ్చు, ప్రాచీన దెయ్యమైన ‘కిటికీ దెయ్యం’ కావచ్చు... రకరకాల దెయ్యాల గురించి కపోల్ నాటకీయంగా చెబుతున్నప్పుడు నికార్సయిన వణుకు పుట్టాల్సిందే!