చిన్నేరు నిర్వాసితుల ఆందోళన
తంబళ్లపల్లె(చిత్తూరు జిల్లా)-- చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె తహశీల్దార్ కార్యాలయం వద్ద చిన్నేరు ప్రాజెక్టు నిర్వాసితులు మంగళవారం ఉదయం ధర్నా చేశారు. చిన్నేరు ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ గ్రామం మునిగిపోతుందని, తమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుతూ వారు ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు.