thana
-
తానా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మీటింగ్ కు అనూహ్య స్పందన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రతి రెండేళ్ళ ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే మహాసభలు ఈ ఏడాది జూలై 7,8,9 తేదీల్లో ఫిలడెల్ఫియాలోని కన్వెన్షన్ సెంటర్లో జరగనున్నాయి. ఈ మహాసభలకు ముందు జరిగే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా.. న్యూజెర్సీలో తానా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మీటింగ్ జరిగింది. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన కిక్ ఆఫ్ అండ్ ఫండ్ రైజింగ్ డిన్నర్ ఈవెంట్‌కి అనుహ్య స్పందన వచ్చింది. పెద్దలు, మహిళలు, పిల్లలతో ప్రాంగణం అంత కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ప్రదర్శించిన తానా సేవా కార్యక్రమాల వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగుతనం ఉట్టిపడేలా నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమనికి హాజరై, గొప్ప ఔన్నత్యంతో విరాళలు అందించిన పలువురు దాతలకు పుష్ప గుచ్చాలతో వేదిక మీదకి స్వాగతం పలికి గౌరవ మర్యాదలతో శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విచ్చేసిన తానా సభ్యులు ఇటీవలే శివైక్యం చెందిన సుప్రసిద్ధ చిత్ర దర్శకులు పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్, శ్రీమతి జయలక్ష్మి గార్లకి, సినీనటుడు నందమూరి తారక రత్నకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. విరాళాల సేకరణకు ముందుగా తానా అధ్యక్షలు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ తానా ప్రస్థానం, నిర్వహించిన, నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు, ప్రవాస తెలుగువారు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి తానా భరోసాగా నిలిచిన పలు సందర్భాల గురించి అక్కడికి విచ్చేసిన తానా సభ్యులకు వివరించారు. 23వ తానా మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి మాట్లాడుతూ జులై 7,8,9 తేదిలలో జరగబోయే ప్రతిష్టాత్మక తానా మహాసభల యొక్క విశిష్టతను వివరిస్తూ, ఈ మహత్కార్యానికి ముందుకు వచ్చిన స్వచ్చంధ సేవకులకు, దాతలందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరై 23వ తానా మహాసభలకు వారి సంఫీుభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, కార్యదర్శి సతీష్ తుమ్మల, డైరెక్టర్ వంశీ కోట, అడ్వైజర్ మహేందర్ ముసుకు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ కూకట్ల, తానా ఫౌండేషన్ ట్రస్టీలు విద్యా గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, సుమంత్ రామ్, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, కల్చరల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, తానా ప్రాంతీయ ప్రతినిధులు వంశి వాసిరెడ్డి, సునీల్ కోగంటి, శ్రీనివాస్ ఉయ్యురు, దిలీప్ ముసునూరు, తానా మహాసభల కల్చరల్ చైర్మన్స్వాతి అట్లూరి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతి మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ తదితర నాట్స్ కార్యవర్గ సభ్యులు, ఆటా బోర్డు అఫ్ డైరెక్టర్ విజయ్ కుందూరు, ఐటీ సర్వ్ అధ్యక్షులు వినయ్ మహాజన్, టిటిఏ డైరెక్టర్ శ్రీనివాస్ గనగోని తదితరులు అతిధులుగాహాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షులు మధు రాచకుళ్ల, సౌత్ జెర్సీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ కసిమహంతి, తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ డెలావేర్ వాలీ అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ తదితరులు పాల్గొని తానామహాసభలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. -
రారండోయ్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నవలల పోటీ – 2019లో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’ రెండు లక్షల రూపాయల బహుమతి గెలుచుకుందని పోటీ కార్యనిర్వాహకులు జంపాల చౌదరి తెలియజేస్తున్నారు. తానా నవలల పోటీల్లో ఇలా పూర్తి బహుమతి అందుకుంటున్న తొలి నవల ఇది. జూలై 4, 5, 6 తేదీల్లో వాషింగ్టన్ డి.సి. నగరంలో తానా 22వ మహాసభలు జరగనున్నాయి. చంద్రశేఖర్ ఇండ్ల ‘రంగుల చీకటి కథలు’ పుస్తకావిష్కరణ జూలై 7 సా.6 గం.కు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో జరుగుతుంది. సభాధ్యక్షత కవి సిద్ధార్థ్ధ, ఆవిష్కరణ: కె.శ్రీనివాస్ డాక్టర్ శాంతి నారాయణ నవల – నాలుగు అస్తిత్వాలు, నాలుగు నవలికలు, కాలమ్ కథలు–నాగలి కట్ట సుద్దులు ఆవిష్కరణ సభ జూలై 5న సా.6 గం.కు రవీంద్రభారతిలో జరగనుంది. ఆవిష్కర్త: కె.రామచంద్రమూర్తి. నిర్వహణ: పాలపిట్ట బుక్స్ ఢిల్లీలో లాల్‌దర్వాజ మహంకాళి దేవాలయ 5వ వార్షికోత్సవ సందర్భంగా న్యూఢిల్లీ తెలంగాణ భవన్లో జూలై 3న సా. 6 గంటలకు కవిసమ్మేళనం జరగనుంది. చింతపట్ల సుదర్శన్ నవల పగలే వెన్నెల ఆవిష్కరణ, సి.ఎస్.రాంబాబు పుస్తక పరిచయం ఉంటాయి. సమన్వయం: కె.హరనాథ్. చిగురుమళ్ల శ్రీనివాస్ నాన్న శతకము ఆవిష్కరణ జూలై 7న ఉ.10:30కు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయం పైన జరగనుంది. ఆవిష్కర్త: సోమేపల్లి వెంకట సుబ్బయ్య. నిర్వహణ: రమ్యభారతి సాహిత్య వేదిక. మాయకుంట్ల నారాయణరెడ్డి నానీల పయనం ఆవిష్కరణ జూలై 5న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో జరగనుంది. ముఖ్య అతిథి: ఎన్.గోపి. నిర్వహణ: తేజ ఆర్ట్ క్రియేషన్స్. విశాఖ రసజ్ఞ వేదిక పురస్కారాన్ని జూలై 7న సా.6 కు చింతకింది శ్రీనివాసరావుకు ప్రదానం చేయ నున్నారు. పురస్కార ప్రదానం ఎన్.రామకృష్ణ. -
ఠాణాల పునర్వ్యవస్థీకరణ
సుమారు లక్షన్నర జనాభా ఉన్న మంచిర్యాల పట్టణంలో ఉన్నది ఒక్కటే పోలీస్ స్టేషన్. జిల్లాలో అత్యధికంగా నేరాలు జరిగే ఈ పట్టణంలో ఒకే ఒక స్టేషన్ ఉండటంతో ఇక్కడ జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. జిల్లా ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్న ఇక్కడ అదనంగా టూటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలంగా డిమాండ్ ఉంది. చిన్న మండలమైన తాండూరులో రెండు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మండల కేంద్రంలో తాండూరు ఒకటి, ఐబీలో మాదారం పోలీస్ స్టేషన్ ఉంది. మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుమని 3వేల జనాభా కూడా లేదు. ఇక్కడ నమోదయ్యే కేసులు నామమాత్రమే. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో అవసరం లేనిచోట్ల పోలీస్ స్టేషన్లు ఉండటం, అవసరం ఉన్నచోట్ల ఠాణాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిక జనాభా ఉన్న పట్టణాల్లో శాంతిభద్రతలకు అవరోధాలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఆయా స్టేషన్లలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి పనిభారం పెరుగుతోంది. దీంతో కేసుల దర్యాప్తు కుంటుపడుతోంది. స్థానిక ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నడుం బిగించారు. పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. మూడు స్టేషన్లు మార్పులు జిల్లాలో 73 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్, శ్రీరాంపూర్లలో మహిళా పోలీస్ స్టేషన్లు ఉండగా, జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. స్టేషన్ల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతానికి మూడు స్టేషన్లను మార్చాలని నిర్ణయించారు. మాదారం పోలీస్‌స్టేషన్‌తోపాటు, శ్రీరాంపూర్, బెల్లంపల్లి స్టేషన్లను ఇతర చోట్లకు తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మూడింటిని మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్‌లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మూడు పట్టణాల్లో జనాభా పెరగడంతో ప్రస్తుతం ఉన్న స్టేషన్లు సరిపోవడం లేదు. ఈ మూడింటిని సర్దుబాటు చేయడం ద్వారా సమస్యను కొంత మేరకు పరిష్కరించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అదనపు పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేయాలంటే తీవ్ర ఆర్థిక భారంతో కూడుకుంటుంది. అలాగే ఈ స్టేషన్లలో సిబ్బంది కోసం అదనపు నియామకాలు చేట్టాలి. ఇలాంటి అవసరం లేకుండానే ఉన్న సిబ్బందితో సర్దుబాటు జరుగుతుండటంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి జాప్యం లేకుండానే అనుమతి లభించే అవకాశాలున్నాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అప్పటి అవసరాల మేరకు.. గతంలో తాండూరు మండల పరిధిలో సింగరేణికి చెందిన పది భూగర్భ గనులు, రెండు ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు ఉండేవి. వీటిలో పనిచేసే వేలాది మంది కార్మికులు మాదారం టౌన్షిప్లో నివాసముండేవారు. రెండు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో నిషేధిత సంస్థ సికాస కదలికలు బాగా ఉండేవి. తరచూ దాడులు జరగడం, మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణ కోసం అప్పట్లో మాదారంతోపాటు, శ్రీరాంపూర్, బెల్లంపల్లి స్టేషన్లను ఏర్పాటు చేశారు. తర్వాత క్రమంలో భూగర్భ గనులు మూతపడటంతో చాలా మట్టుకు సింగరేణి కార్మికులు అక్కడి నుంచి తరలిపోవడంతో ఈ స్టేషన్లలో పెద్దగా పనిలేకుండా పోయింది. దీంతో వీటిని అవసరమైన చోట్లకు మార్చాలని నిర్ణయించారు. అనుమతి రాగానే చర్యలు- గజరావు భూపాల్, ఎస్పీ పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు ఇటీవలే ప్రతిపాదనలు పంపాము. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ మూడు పోలీస్ స్టేషన్లను తరలించేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ స్టేషన్లను తరలించడం ద్వారా ప్రధాన పట్టణాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలకు అవకాశం ఉంటుంది. త్వరలోనే సర్కారు నుంచి అనుమతి మంజూరయ్యే అవకాశాలున్నాయి.