రారండోయ్‌  | THANA 22nd Meetings Held In Washington DC | Sakshi
Sakshi News home page

రారండోయ్‌ 

Published Mon, Jul 1 2019 3:08 AM | Last Updated on Mon, Jul 1 2019 3:08 AM

THANA 22nd Meetings Held In Washington DC - Sakshi

  •  ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) నవలల పోటీ – 2019లో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’ రెండు లక్షల రూపాయల బహుమతి గెలుచుకుందని పోటీ కార్యనిర్వాహకులు జంపాల చౌదరి తెలియజేస్తున్నారు. తానా నవలల పోటీల్లో ఇలా పూర్తి బహుమతి అందుకుంటున్న తొలి నవల ఇది. జూలై 4, 5, 6 తేదీల్లో వాషింగ్టన్‌ డి.సి. నగరంలో తానా 22వ మహాసభలు జరగనున్నాయి.
  •   చంద్రశేఖర్‌ ఇండ్ల ‘రంగుల చీకటి కథలు’ పుస్తకావిష్కరణ జూలై 7 సా.6 గం.కు హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌లో జరుగుతుంది. సభాధ్యక్షత కవి సిద్ధార్థ్ధ, ఆవిష్కరణ: కె.శ్రీనివాస్‌
  •  డాక్టర్‌ శాంతి నారాయణ నవల – నాలుగు అస్తిత్వాలు, నాలుగు నవలికలు, కాలమ్‌ కథలు–నాగలి కట్ట సుద్దులు ఆవిష్కరణ సభ జూలై 5న సా.6 గం.కు రవీంద్రభారతిలో జరగనుంది. ఆవిష్కర్త: కె.రామచంద్రమూర్తి. నిర్వహణ: పాలపిట్ట బుక్స్‌
  •   ఢిల్లీలో లాల్‌దర్వాజ మహంకాళి దేవాలయ 5వ వార్షికోత్సవ సందర్భంగా న్యూఢిల్లీ తెలంగాణ భవన్‌లో జూలై 3న సా. 6 గంటలకు కవిసమ్మేళనం జరగనుంది. చింతపట్ల సుదర్శన్‌ నవల పగలే వెన్నెల ఆవిష్కరణ, సి.ఎస్‌.రాంబాబు పుస్తక పరిచయం ఉంటాయి. సమన్వయం: కె.హరనాథ్‌.
  •  చిగురుమళ్ల శ్రీనివాస్‌ నాన్న శతకము ఆవిష్కరణ జూలై 7న ఉ.10:30కు విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ గ్రంథాలయం పైన జరగనుంది. ఆవిష్కర్త: సోమేపల్లి వెంకట సుబ్బయ్య. నిర్వహణ: రమ్యభారతి సాహిత్య వేదిక.
  • మాయకుంట్ల నారాయణరెడ్డి నానీల పయనం ఆవిష్కరణ జూలై 5న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో జరగనుంది. ముఖ్య అతిథి: ఎన్‌.గోపి. నిర్వహణ: తేజ ఆర్ట్‌ క్రియేషన్స్‌.
  • విశాఖ రసజ్ఞ వేదిక పురస్కారాన్ని జూలై 7న సా.6 కు చింతకింది శ్రీనివాసరావుకు ప్రదానం చేయ నున్నారు. పురస్కార ప్రదానం ఎన్‌.రామకృష్ణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement