
అమ్జద్ కవితా సంపుటి తొలకరి చినుకులు, కథా సంపుటి పూలచాదర్ ఆవిష్కరణ సభ అక్టోబర్ 16న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఆవిష్కర్తలు: కె.శివారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి. నిర్వహణ: కవిసంగమం, పాలపిట్ట బుక్స్.డాక్టర్ నందిని సిధారెడ్డి ‘నూరు పూలు’ ముందుమాటల ఆవిష్కరణ సభ అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: కె.శివారెడ్డి. గ్రంథ సంపాదకులు: డాక్టర్ బెల్లంకొండ సంపత్‌కుమార్. నిర్వహణ: తెలంగాణ రచయితల సంఘం
శేషేంద్ర శర్మ 92వ జయంతి సభ అక్టోబర్ 20న సా. 6 గంటలకు త్యాగరాయ గానసభలో జరగనుంది. కీలకోపన్యాసం: శ్రీరామకవచం సాగర్. నిర్వహణ: గుండ్లకమ్మ రచయితల సంఘం. అక్టోబర్ 20న ఉదయం 9:30కు శ్రీకాకుళం జిల్లా రాజాంలోని విద్యానికేతన్ పాఠశాలలో జరిగే రాజాం రచయితల వేదిక సమావేశంలో సాహిత్యోద్యానంలో పద్య పరిమళాలు అంశంపై చెళ్లపిళ్ల సన్యాసిరావు ప్రసంగిస్తారు. ముఖ్య అతిథి: ముయిద ఆనందరావు.
పిల్లల్లో తెలుగు మీద గౌరవం, ఆసక్తి పెంచడం కోసం దాసుభాషితం.కామ్ ‘సి.పి.బ్రౌన్ వార్షిక పాఠశాలల తెలుగు పోటీ 2019’ నిర్వహిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల పదో తరగతి విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు, వారి పాఠశాలలు ఇందులో పాల్గొనవచ్చు. పిల్లలు ఉమ్మడిగా రూ.40 వేలు, ఉపాధ్యాయులు రూ.10 వేలు గెలవొచ్చు. రెండు రాష్ట్రాలకూ కలిపి బహుమతుల మొత్తం లక్ష రూపాయలు. ప్రదానం హైదరా బాద్‌లో డిసెంబర్ రెండవ వారంలో జరుగు తుంది. రిజిస్టర్ చేసుకునేందుకు ఞ్టౌ్ఛ్ఛ2019 అని 9952029498 వాట్సాప్ నంబరుకు సందేశం పంపాలి. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అమరావతి సాహితీ మిత్రులు, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అవినీతి వ్యతిరేక కవితల పోటీ నిర్వహిస్తున్నాయి. బహుమతులు వరుసగా 5 వేలు, 3 వేలు, 2 వేలు. నవంబర్ 20లోగా ‘రావి రంగారావు, 101, శంఖచక్ర నివాస్, అన్నపూర్ణనగర్, 5వ లైన్, తూర్పు గోరంట్ల, గుంటూరు–522034’ చిరునామాకు చేరాలి.
Comments
Please login to add a commentAdd a comment