1 క్షణం.. ఆలోచించు
కథ, దర్శకత్వం: తగరం సంతోష్
సమస్యలు వచ్చి పోతుంటాయి.. వచ్చి పోయే సమస్యలకు భయపడి జీవితాన్ని అంతం చేసుకుంటే ఎలా? ప్రాణం పోతే తిరిగి రాదు కదా.. అంటూ జీవితం విలువను చాటి చెప్పే సందేశంతో తగరం సంతోష్ ఈ షార్ట్మూవీని రూపొందించారు. ఇందులో ఒక యువకుడు తనకు ఎదురైన సమస్యకు భయుపడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అలాంటి సమయంలో అతడికి దేవుడు కొన్ని ప్రశ్నలడుగుతాడు. వాటికి సమాధానం చెప్పలేక ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకుంటాడు. వచ్చి పోయే సమస్యలు శాశ్వతం కాదని జ్ఞానోదయం పొందిన ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా సాధిస్తాడనేదే ఇందులో కథ.