థర్మాస్ ఫ్లాస్క్
థర్మాస్ ఫ్లాస్క్‌లో పోసిన కాఫీ, టీ, పాలు, వేడినీళ్లు వంటివి కొన్ని గంటలపాటు వేడిగా ఉంటాయని, అలాగే చల్లటి నీళ్లు, ఐసు వంటివి చల్లగా ఉంటాయని మనకు తెలుసు. మామూలు పాత్రలో పోసిన కాసేపటికే కాఫీ, టీలు చల్లబడి పోతాయి. అలాగే పాత్రలో ఉంచిన ఎంత చల్లటి నీరయినా సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచితే, కొద్దిసేపటికే మామూలుగా మారిపోవడం మనకు తెలుసు. థర్మాస్ ఫ్లాస్క్‌లో పోస్తే మాత్రం కనీసం కొన్ని గంటలపాటు ఢోకా ఉండదు.
సర్ జేమ్స్ డీవార్ అనే శాస్త్రవేత్త 1892లో థర్మాస్ ఫ్లాస్క్ కనిపెట్టాడు. అందువల్ల మొదట్లో దీనిని డీవార్ ఫ్లాస్క్ అని కూడా పిలిచేవారు. ఇంతకీ థర్మాస్ ఫ్లాస్క్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రెండు గోడలు లేదా పొరలుగా ఉండే గాజు సీసా ఇది. దీని గోడలకు లోపలివైపున సిల్వర్ పూత పూసి ఉంటుంది. ఈ రెండు గోడల మధ్య గల ఖాళీ స్థలంలో వాక్యూమ్ పంప్ అమర్చి, సీల్ చేసి ఉంటుంది. ఈ గాజు సీసా పగలకుండా ఒక లోహపు కేసులో ఉంటుంది. దీనిమూతికి ఒక కార్క్ బిగించి ఉంటుంది. వేడివాటిని వేడిగా, చల్లటి వాటిని చల్లగా ఉంచడానికి ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం. థర్మాస్ ఫ్లాస్క్ ఏం చేస్తుందంటే వెచ్చదనాన్ని లోపలికి రానివ్వదు, బయటికి పోనివ్వదు.
అలాగే చల్లదనాన్ని కూడా! ఏదైనా ఒక ఘనపదార్థాన్ని వేడి చేసినప్పుడు మొదట అది ద్రవ చూపంలోనూ, తర్వాత ఆవిరి రూపంలోనూ మారి, ఆ తర్వాత దాని వెచ్చదనాన్ని కోల్పోతుందని మనకు తెలుసు. థర్మాస్ ఫ్లాస్క్ ఈ మూడు విధాలుగానూ వేడిని బయటికి పోనివ్వకుండా నిరోధిస్తుంది. ఫ్లాస్క్ అనేది వేడిని ఏమాత్ర ం భరించలేదు కదా, అందుకే ఈ రెండు గాజుగోడలకూ మధ్యలో వాక్యూమ్‌ను ఉంచుతారు. గాజు పాత్ర లోపలివైపున సిల్వర్ పూత పూయడం వల్ల రేడియేషన్ మూలంగా వెచ్చదనం పోకుండా ఉంటుంది. చల్లటి నీటి విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.