therapy dog
-
శరీరాన్ని తూట్లు పొడిచారు.. బతికింది.. శభాష్ అనిపించుకుంటోంది
బీరూట్: ప్రాణం లేని వస్తువనుకున్నారో ఏమో.. ఆ క్రూరులు అభంశుభం తెలియని ఆ శునకాన్ని దారుణంగా హింసించారు. దాన్ని గన్ ఫైరింగ్‌కు లక్ష్యంగా మార్చి ప్రాణాలతో చెలగాటం ఆడారు. కళ్లు, ఓ చెవి పోగోట్టుకుంది, ఎముకలు విరగొట్టుకుంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అది అదృష్టం బాగుండి బతికింది. మంచి మనుషుల తోడుతో నేడు ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదిగింది. తనకు హాని చేసిన మనషులకు సేవ చేస్తోంది. వివరాలు.. లెబనాన్‌కు చెందిన మ్యాగీ అనే కుక్కపై దాని మాజీ యజమానులు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. గన్‌ఫైరింగ్ ప్రాక్టీస్ చేయటానికి దాన్నో లక్ష్యంగా వాడుకున్నారు. కాళ్లు కట్టేసి పెల్లెట్స్(డూప్లికేట్ గన్‌కు సంబంధించిన బుల్లెట్ లాంటి గుళ్లు)తో కాల్పులు జరిపారు. దాని ఒంటినిండా పెల్లెట్స్‌తో తూట్లు పెట్టారు. పాపం అరిచి, మొత్తుకున్నా విడవలేదు. దాని ముక్కు, రొమ్ము, భుజాలు ఇతర శరీర భాగాల్లో దాదాపు 200 గుళ్లు దింపారు. ముఖ్యంగా దాని ముఖంపై కాల్చటంతో కంటి చూపుకోల్పోయింది. అంతేకాదు, దాని దవడ విరిగింది.. ఓ చెవిని కూడా కోల్పోయింది. ప్రాణాల కోసం పోరాడుతున్న దాన్ని తీసుకుపోయి దూరంగా పడేశారు. చావు బతుకులతో పోరాడుతున్న దాన్ని గుర్తించిన ‘‘ వైల్డ్ యాట్ హార్ట్ ఫౌండేషన్’’ అనే జంతు సంరక్షణా సంస్థ రక్షించింది. అనంతరం మ్యాగీ కథ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బ్రిగ్టన్కు చెందిన క్యాసీ చార్లీన్ అనే మహిళ దాన్ని దత్తత తీసుకుంది. దానికి శిక్షణ ఇచ్చి థెరపీ డాగ్‌గా తీర్చిదిద్దింది. (చదవండి: ‘మా ఇంటి రాజసం.. మా బంగారు శునకం’) 2019లో మ్యాగీ పూర్తి స్థాయి థెరపీ డాగ్‌గా మారింది. డిమెన్షియా(మతి మరుపు వ్యాధి)తో బాధపడుతున్న వారికి సహాయం చేస్తోంది. అంతేకాదు స్కూళు పిల్లలు, పోలీస్, ఫైర్ ఫైటర్స్‌కు తోడుగా ఉంటోంది. 2020లో కరోనా సమయంలోనూ సేవలను అందించింది. దేశంలో కరోనా తగ్గు ముఖం పట్టడంతో పలు ఆంక్షలు ఎత్తేశారు. దీంతో చాలా నెలల తర్వాత తను ఉంటున్న కేర్ హోమ్‌కు మ్యాగీ చేరుకుంది. అక్కడ ఉంటున్న తన కిష్టమైన వ్యక్తి యానీని కలుసుకుంది. (చదవండి: షాపింగ్ చేస్తోన్న కుక్క.. నెటిజనులు ఫిదా) యానీని కలుసుకోక సంవత్సరం కావస్తున్నా.. ఆమెను మ్యాగీ ఏ మాత్రం మర్చిపోలేదు. కేర్ హోమ్‌లోకి అడుగుపెట్టగానే నేరుగా యానీ రూమ్ దగ్గరకు వెళ్లిపోయింది. ఆ తర్వాతే మిగితా వ్యక్తుల్ని కలుసుకుంది. ప్రస్తుతం మ్యాగీ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మ్యాగీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గతంతో దాన్ని దత్తత తీసుకోవటానికి ఎవ్వరూ రాలేదు. కానీ, ఇప్పుడు లక్షల మంది దాన్ని పెంచుకుంటామంటున్నారు. చదవండి: ఒక్క రూపాయి అయినా పంపండి ప్లీజ్: యాంకర్ రష్మీ -
బతికుండగానే విగ్రహం! ఎందుకంటే..
ఏదో గొప్ప పనులు చేయడమో.. లేదంటే జనాలకు బాగా దగ్గర అయినవాళ్లు విగ్రహాలను రోడ్ల మీద చూస్తుంటాం. అలాంటిది ఓ కుక్కకు.. అదీ బతికుండగానే కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు వాయవ్య ఇంగ్లండ్‌లో. ఎందుకంటారా?.. లండన్: పదమూడేళ్ల మ్యాక్స్.. ఒక థెరపీ డాగ్. కుంబ్రియాలోని కెస్విక్లో అది జనాల ఆదరణ చురగొంటోంది. లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా అది పదివేల మందికి ప్రశాంతతను అందించింది. ఇందుకుగానూ ఈ ఫిబ్రవరిలో దానికి మెరిట్ సర్టిఫికెట్ కూడా అందించారు. ఇక ఇప్పుడు ఏకంగా విగ్రహం పెట్టించారు. ది మిరకిల్ డాగ్ అనే బిరుదును దీనికి ఇచ్చారు. ఆ ట్యాగ్ లైన్‌కు తగ్గట్లే మ్యాక్స్ అద్భుతాలు చేస్తుంది. పుట్టినరోజులకు గ్రీటింగ్స్ అందజేయడం, ఛారిటీ వాక్స్‌లో పాల్గొనడం, స్కూల్ పిల్లలతో సరదాగా ఆడుకోవడం, ఒంటరితనం భరించలేనివాళ్లతో కాసేపు గడపడం.. ఇలా అందరిలో ఆనందాన్ని నింపుతోంది. అంతేకాదు ఛారిటీల ద్వారా అది ఏకంగా మూడు లక్షల పౌండ్లు వసూలు చేయడం విశేషం. ఇక హోప్ పార్క్ బయట దాని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బహుశా బతికుండగానే ఈ గౌరవం అందుకున్న మొదటి మూగ జీవి ఇదేనేమోనని అక్కడి అధికారులు చెప్తున్నారు. రోడ్డు మీద నుంచి.. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో దానిని ఎవరో రోడ్డు మీద వదిలేశారు. 2008లో కెర్రీ ఇర్వింగ్ దానిని దత్తత తీసుకుని పెంచుకున్నాడు. 2016 నుంచి దానికి థెరపీ డాగ్ ట్రైనింగ్ ఇప్పించాడు కెర్రీ. కాగా, మ్యాక్స్ విగ్రహాన క్రిస్టీ అనే కళాకారుడు తయారు చేయగా.. సోఫి అనే పన్నెండేళ్ల చిన్నారి చేత మ్యాక్స్గాడి విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. చదవండి: ఎక్కడ చూసినా వేడి.. ఉక్కపోత! ఎందుకో తెలుసా? -
రోతపుట్టించే కుక్కకు అబ్బురపడే అవార్డు
లండన్: ప్రపంచంలోనే అత్యంత రోతపుట్టించే మగ్లీ అనే కుక్క అరుదైన అవార్డును దక్కించుకుంది. గత ఆరేళ్లుగా చేస్తున్న సామాజిక సేవకు గుర్తింపుగా ఇంగ్లాండ్ నుంచి 'సూపర్ హీరో అవార్డు'కు ఎంపికైంది. చైనా బ్రీడ్ కు చెందిన మగ్లీ అనే ఈ పన్నేండేళ్ల కుక్కకు 2012లో ప్రపంచంలోనే రోత కుక్కగా అవార్డును దక్కించుకుంది. అంతకుముందు 2005లో బ్రిటన్‌లో అగ్లియెస్ట్ డాగ్ గా నిలిచింది. ఇది గత ఆరేళ్లుగా ఓ స్వచ్ఛంద సంస్థ తరుపున వైకల్యంగలవారికి, పెద్దలకు ఓ థెరపీ పెట్ యానిమల్గా పనిచేస్తోంది. దీంతో గతవారం జరిగిన జాతీయ పెంపుడు జంతువుల ప్రదర్శన కార్యక్రమంలో మగ్లీని ఈ ఏడాది సూపర్ డాగ్ అవార్డుకు ఎంపికచేస్తున్నట్లు ప్రకటించారు.