thief fraud
-
మాట్లాడే పని ఉంది రమ్మని చెప్పి...
రైల్వేగేట్ (వరంగల్): మాట్లాడే పని ఉందంటూ రమ్మని చెప్పి.. ఆతర్వాత బెదిరించి ఓ బంగారం షాపు గుమస్తా బ్యాగ్‌లోని రూ.14.38లక్షల నగదును దుండగులు అపహరించిన సంఘటన నగరంలోని వరంగల్ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు, వరంగల్ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం కథనం ప్రకారం... వరంగల్ ఆర్ఎన్టీ రోడ్‌లోని శ్రీకృష్ణా బులియన్ మర్చంట్స్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్న బేతి యుగేందర్ చెన్నైలో బంగారం నగలు కొనుగోలు చేసేందుకు శుక్రవారం రాత్రి 9గంటలకు వరంగల్ స్టేషన్‌కు వచ్చాడు.తమిళనాడు ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో రైలు ఎక్కాడు. గుర్తుతెలియని వ్యక్తి(30) వచ్చి ‘నీతో మా ట్లాడేది ఉంది.. సార్ పిలుస్తుండు.. స్టేషన్‌కు వెళ్లాలి.. రా...’ అన్నా డు. నిజమే అనుకుని అతడు రైలు దిగడంతో గుర్తుతెలియని ఆ వ్యక్తి బెదిరించాడు. మరో ఇద్దరు వచ్చి యుగేందర్ బ్యాగ్‌లోని రూ. 14,38,800 నగదు అపహరించారు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. షాపు ఓనర్ సురేష్‌కుమార్ దాలియాకు సమాచారం ఇచ్చా డు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా కనిపించారు. దీంతో పోలీసులు ఆ ముఠా కోసం గాలిస్తున్నారు. అలాగే శ్రీకృష్ణా బులియన్ మర్చం ట్స్ దుకాణం యజమాని సురేష్‌కుమార్ దాలి యా వరంగల్ జీఆర్పీలో ఫిర్యాదు చేశారు. -
పోలీసులకే దిమ్మతిరిగే దొంగతనం
సాక్షి, న్యూఢిల్లీ : అతి తెలివి తేటలతో దొంగలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డట్లు వారి పనైంది. సాధారణంగా దొంగలు పెట్రోల్ చోరికి పాల్పడటం అరుదు. అలాంటివి జరిగినా ఏ బైక్‌ల నుంచో లేదంటే ఎవరూ లేని సమయంలో బంక్‌ల నుంచో దొంగతనం చేసిన సందర్బాలుంటాయి. కానీ, ఢిల్లీలో మాత్రం కొందరు దొంగలు ఏకంగా భూగర్భాన వెళుతున్న అతిపెద్ద పెట్రోల్ పైపు నుంచి పెట్రోల్ తోడేద్దామనుకున్నారు. చిన్నసొరంగంలాంటిదాన్ని తవ్వి పైపుకు కన్నం చేసి ఆయిల్ తీసే క్రమంలో కాస్త బాంబు పేలుడిలాంటి శబ్దంతో బద్దలైంది. వారి గుట్టుచప్పుడుకాకుండా చేద్దామనుకున్న పనికాస్త రట్టయింది. వివరాల్లోకి వెళితే.. నైరుతి ఢిల్లీలోని కక్రోలాలో జూబీర్ అనే వ్యక్తి అయిల్ దొంగతరం చేయడానికి కొంతమందితో కలిసి ప్లాన్ చేసుకున్నాడు. ఇండియన్ అయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) కు చెందిన అండర్ గ్రౌండ్ పైపు లైన్‌ను తమ దొంగతనానికి ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలోనే ఓ గది తీసుకొని అందులో నుంచి పైపులైన్‌కు సొరంగం లాంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయిల్ పైప్ లైన్‌కు గ్యాస్ కట్టర్ సహాయంతో పైప్‌లైన్‌కు రంధ్రం చేసి, పెట్రోలు దొంగిలించడం మొదలుపెట్టారు. అయితే, ఇది పెద్ద పైపులైన్ కావడం, అందులో నుంచి తీవ్ర ఘాడత గల వాయువులు బయటకు రావడంవంటివి జరుగుతున్న క్రమంలో మంగళవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటన జరగడంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు అసలు విషయం అర్థమైంది. అలాగే, దానికి దగ్గర్లో కొంత మేర ఇంధనం నింపిన ట్రక్‌ని కూడా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
హవ్వ..‘పెద్ద’ మోసం
నోట్లు మార్పిస్తానని దుండుగుడి పరారు ఎస్బీఐ వద్ద కన్నీటి పర్యంతమైన వృద్ధురాలు ధర్మవరంటౌన్ : పెద్దనోట్ల మార్పిడి వృద్ధులకు తీరని వేదనను మిగుల్చుతోంది. వృద్ధాప్యంలో ఆదరువు ఉంటుందని దాచుకున్న పెద్ద నోట్లను మార్చుకుందామని బ్యాంకు వద్దకు వెళితే ఓ అవ్వను ఏమార్చి రూ.2 వేలు ఎత్తుకెళ్లాడు ఓ ప్రబుద్ధుడు. వివరాలు.. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన వృద్ధురాలు సుబ్బమ్మ వద్ద రూ.2వేల పింఛన్ సొమ్ము (రూ.500 నోట్లు 2, రూ.1000 నోటు 1)ఉంది. ఆ పెద్ద నోట్లను మార్చుకునేందుకు శుక్రవారం ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఎస్బీఐ బ్రాంచి వద్దకు చేరుకుంది. పెద్ద నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియక బ్యాంక్ ఆవరణలో తికమక పడుతోంది. ఇది గమనించిన ఓ వ్యక్తి ‘అవ్వా.. నోట్లు మార్చుకునేందుకు వచ్చావా..? క్యూలైన్ చాలా ఉంది. నీవు నిలబడ లేవు. ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వు నగదు మార్చుకుని కొత్త నోట్లు ఇస్తా’నని అన్నాడు. అతడి మాయమాటలను నమ్మిన వృద్ధురాలు డబ్బు, ఆధార్ జిరాక్స్ అతని చేతికి ఇచ్చింది. గంట, రెండు గంటలు గడిచినా అతను రాలేదు. అనుమానం వచ్చి బ్యాంక్ సిబ్బందికి చెబితే ఎవ్వరూ పట్టించుకోలేదు. బ్యాంకు ఆవరణలో కూర్చుని కంటతడి పెట్టింది. వృద్ధులను ఇన్ని అగచాట్లు పెడుతున్న ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోసింది. ఇంత రద్దీగా ఉండే బ్యాంక్‌లో కనీసం పోలీసులు మచ్చుకైనా కానరాకపోవడంతో ఆమె గోడు వినే నాథుడే లేకుండాపోయారు. అధికారులు స్పందించి వృద్ధులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్ పెట్టి పోలీసుల నిఘా పెంచితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.