thimmappa
-
సమాచార శాఖ ఇన్చార్జ్ ఏడీ తిమ్మప్ప బదిలీ
అనంతపురం అర్బన్ : సమాచార, పౌర సంబంధాల శాఖ ఇన్చార్జ్ ఏడీ తిమ్మప్పకి ఏడీగా పదోన్నతి కల్పిస్తూ తిరుపతికి బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. తిమ్మప్ప స్థానంలో డీపీఆర్ఓ జయమ్మకి ఏడీ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. -
బావిలో పూడిక తీస్తూ ముగ్గురు మృతి
సిరుగుప్ప : సిరుగుప్ప తాలూకాలోని నాడంగ గ్రామంలో తాగునీటి కోసం బావిలోని పూడికను తీయడానికి దిగిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన సిరుగుప్ప పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. నాడంగ గ్రామంలోని బారిక రామణ్ణ కుమారులైన నాగరాజు(35), తిమ్మప్ప(32), బి.ఈరన్న కుమారుడు బి.బసవరాజు కూలీ పనుల నిమిత్తం బావిలోని పూడికను తీసేందుకు బావిలోకి దిగారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఊపిరాడక మృతి చెందినట్లు గ్రామస్తులు గుర్తించారు. సంఘటన స్థలానికి సిరుగుప్ప పోలీసులు చేరుకొని శవాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. -
కుప్పంలో వ్యక్తిపై కాల్పులు
చిత్తూరు(కుప్పం): చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ఓ అడవికి సమీపంలో తిమ్మప్ప అనే వ్యక్తిపై గుర్తుతెలియని వేటగాళ్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. రాత్రి కావటంతో కాల్పులు జరిపింది ఎవరో తెలియరాలేదు. బాధితుడు చికిత్స నిమిత్తం పీఈఎస్ ఆసుపత్రిలో చేరాడు. సమాచారం అందుకున్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.