Thinner
-
కరోనా: ఎక్కువ మరణాలకు కారణం..
లండన్: ప్రాణాంతకమైన కరోనా వైరస్ ఊపిరి తిత్తుల్లోకి చొచ్చుకుపోయి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీయడం వల్ల ఊపిరాడక రోగులు చచ్చిపోతారని మొన్నటి వరకు డాక్టర్లు భావించారు. కానీ కరోనా రోగులు గుండెపోటుకు గురై చనిపోతున్నారని తెలిసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కరోనా రోగులు ఎందుకు గుండెపోటుకు గురవుతున్నారో తెలుసుకునేందుకు డాక్టర్లు పరిశీలించాక ఆశ్చర్యకరమైన అంశం వెలుగులోకి వచ్చింది. గతంలో ఊపిరి తిత్తుల కణాల్లోకి జొరబడుతుందనుకున్న కరోనా వైరస్ రోగుల రక్త నాళాల్లోకి జొరబడుతోందని, పర్యవసానంగా గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోవడం వల్ల రోగులు చనిపోతున్నారని లండన్ డాక్టర్లు గుర్తించారు. ముందు జాగ్రత్తగా కరోనా రోగులకు రక్తాన్ని పలుచగా చేసే ‘బ్లడ్ థిన్నర్స్’ను వాడినప్పటికీ లాభం లేక పోతోందని, అట్లాంటలోని ఎమోరి యూనివర్శిటీ ఆస్పత్రిలో చేరిన కరోనా రోగుల్లో 20 నుంచి 40 శాతం మంది బ్లడ్ థిన్నర్స్ వాడినప్పటికీ రక్తం గడ్డకట్టి గుండెపోటులో మరణించారని డాక్టర్ క్రేగ్ కూపర్స్మిత్ తెలియజేశారు. కరోనా రోగుల్లో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం వారిలో రక్తం గడ్డకట్టుకు పోవడమే కారణమై ఉంటుందని బ్రూక్లిన్ హార్ట్ సర్జన్ ఒకరు తెలియజేశారు. ఆస్పత్రుల నుంచి ఇంటికి వెళ్లిక కరోనా బాధితులు మరణించడానికి ఈ క్లాట్స్ కారణమై ఉంటాయని ఆయన చెప్పారు. పెద్ద రక్తనాళాల్లోనే కాకుండా అతి సూక్ష్మ నాళాల్లో కూడా కరోనా వైరస్ కారణంగా బ్లడ్ క్లాడ్స్ ఏర్పడుతున్నాయని, వీటి తీవ్రతను బట్టి రోగికి ప్రాణాపాయం ఉంటుందని మెయిమోనైడ్స్ మెడికల్ సెంటర్ ఫిజిషియన్ డాక్టర్ పాల్ సాండర్స్ తెలియజేస్తున్నారు. ఆస్పత్రుల్లో నర్సుల తైతక్కలేమిటీ? -
సన్నగా ఉంటే దీర్ఘాయువు
బోస్టన్: సన్నగా ఉన్నవాళ్లు ఎక్కువకాలం జీవిస్తారని అమెరికాలోని హార్వర్డ్, టఫ్ట్స్ వర్సిటీల అధ్యయనంలో తేలింది. చిన్నతనం నుంచి మధ్య వయస్సు వరకు ఎక్కువగా బరువు పెరిగినవారు త్వరగా చనిపోయే అవకాశాలుంటాయని పరిశోధకులు చెప్పారు. శరీర పరిణామక్రమం, మరణాల మధ్య సంబంధంపై వారు పరిశోధనలు చేశారు. వీటిలో 80,266 మంది మహిళలు, 36,622 మంది పురుషులు పాల్గొన్నారు. వారంతా 5, 10, 20,30,40 ఏళ్లప్పుడు వారి శరీరాకృతులు ఎలా ఉండేవో చెప్పారు. 50 ఏళ్లప్పుడు వారి శరీర ద్రవ్యరాశి సూచిక(బీఎంఐ)ను నమోదు చేశారు. 60 ఏళ్ల తర్వాత వారిపై పరిశీలన ను కొనసాగించారు. 60 దాటిన తర్వాత మరో 15 ఏళ్లలోపు చనిపోయే అవకాశం సన్నగా ఉన్న మహిళల్లో 11 శాతం, పురుషుల్లో 20.3 శాతం. అదే లావుగా ఉన్నవారిలో ఇది పెరిగి మహిళల్లో 19.7 శాతం, పురుషుల్లో 24.1 శాతంగా నమోదైంది.