Third draw
-
హారిక ఖాతాలో మూడో ‘డ్రా’
న్యూఢిల్లీ: అబుదాబి అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో ‘డ్రా’ నమోదు చేసింది. శుక్రవారం విశ్రాంతి దినం తర్వాత శనివారం ఒకే రోజు ఐదు, ఆరో రౌండ్ గేమ్‌లు జరిగాయి. ఇషా కరవాడే (భారత్)తో జరిగిన ఐదో గేమ్‌ను హారిక 16 ఎత్తుల్లో... ఆంటోనియో పజోస్ (స్పెయిన్)తో జరిగిన ఆరో గేమ్‌ను 20 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
హరికృష్ణకు మూడో ‘డ్రా’
న్యూఢిల్లీ: జిబ్రాల్టర్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. బ్రుజోన్ బాటిస్టా లాజరో (క్యూబా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఏడో రౌండ్ తర్వా త హరికృష్ణ 5.5 పాయింట్లతో మరో 15 మందితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరోగ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ఖాతాలో కూడా మూడో ‘డ్రా’ చేరింది. లారెంట్ ఫ్రాసినెట్ (ఫ్రాన్స్)తో జరిగిన గేమ్‌ను హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు రెండో ఓటమి ఎదురైంది. బెంజమిన్ గ్లెడూరా (హంగేరి)తో జరిగిన గేమ్‌లో ఆనంద్ 48 ఎత్తుల్లో ఓడిపోయాడు.