third maariage
-
మూడో పెళ్లికి సిద్ధం.. ఇద్దరు పెళ్లాల యుద్ధం
సాక్షి, చెన్నై: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు ఆ నిత్యపెళ్లి కొడుకు. అయితే దురదృష్టం కొద్ది ఇద్దరు భార్యల చేతికి చిక్కాడు. చితక్కొట్టుడుకు గురైనాడు. వివరాలు. కోయంబత్తూరు జల్లా సూలూరు నెహ్రూనగర్‌కు చెందిన సౌందరరాజన్ కుమారుడు అరంగ అరవింద్ దినేష్ (26). ఇతను రాశీపాలయంలోని ఒక ప్రయివేటు సంస్థలో ప్యాట్రన్‌మేకర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి తిరుప్పూరు గణపతిపాళయం చెందిన ప్రియదర్శిని అనే యువతితో 2016లో వివాహమైంది. పెళ్లయిన 15 రోజుల్లోనే వేధింపులకు గురిచేయడంతో కొన్నాళ్లపాటూ భరించిన ప్రియదర్శిని ఆ తరువాత తన పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు పెళ్లయి మొదటి భార్య ఉన్న విషయాన్ని దాచిపెట్టి కల్యాణ వేదిక వెబ్సైట్ల ద్వారా వధువు వేట మొదలెట్టి కరూరు జిల్లా పశుపతి పాళయంకు చెందిన అనుప్రియ (23)ను ఈఏడాది ఏప్రిల్ 10వ తేదీన వివాహమాడాడు. అనుప్రియకు గతంలో పెళ్లయి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడని తెలిసే అతడు పెళ్లిచేసుకున్నాడు. మొదటి భార్యతో ప్రవర్తించినట్లుగానే రెండో భార్యను సైతం వేధింపులకు గురిచేయడంతో ఆమె కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా మూడోపెళ్లికి సిద్దమైన ఈ నిత్యపెళి్లకొడుకు దినేష్ మరలా వివాహ వెబ్సైట్లను వెతకడం ప్రారంభించాడు. ఈ సమాచారం అందుకున్న మొదటి భార్య ప్రియదర్శిని, రెండో భార్య అనుప్రియ మంగళవారం ఉదయం కోయంబత్తూరు జిల్లా సూలూరులోని అతని తండ్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. తండ్రి సౌందరరాజన్‌ను వెంటపెట్టుకుని దినేష పనిచేసే సంస్థ వద్ద ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న సూలూరు పోలీసులు దినేష్, ఇద్దరు భార్యలను పోలీసు స్టేషన్‌కు రావాలి్సందిగా చెప్పి వెళ్లిపోయారు. ఈ సమయంలో సంస్థ నుంచి బయటకు వచ్చిన దినేష్‌ను ఇద్దరు భార్యలు చుట్టుముట్టి చితకబాదారు. ఇద్దరు పెళ్లాలు, ముద్దుల మొగుడు వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. -
మాల్యా మూడో పెళ్లిపై నెటిజన్ల జోక్స్
సాక్షి, న్యూఢిల్లీ: ‘భారతీయ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా మూడో పెళ్లి వెనుక కుట్ర దాగి ఉంది. పింకీ లల్వాణీ మాల్యాని పెళ్లి చేసుకున్న తర్వాత.. తమ కుటుంబాన్ని కలిసేందుకు రమ్మని.. అతన్ని బలవంతపెడుతుంది. అప్పుడు మాల్యా భారత్ రాక తప్పదు. అప్పుడు అతన్ని పట్టుకోవచ్చని ఇంటలిజెన్స్ వర్గాలు ప్లాన్ చేశాయి. ఇది హనీ ట్రాప్.. పింకీని ఐబీయే రంగంలోకి దింపింది..’ అంటూ విజయ్ మాల్యా మూడో పెళ్లిపై ఓ నెటిజన్ వేసిన జోక్ ఇది.. ఎయిర్ హోస్టెస్ పింకీ లాల్వాణీని విజయ్ మాల్యా మూడో పెళ్లి చేసుకోబోతున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ మాల్యా మూడో పెళ్లి ట్విటర్లో ట్రెండింగ్‌గా మారిపోయింది. ఆయన వివాహంపై నెటిజన్లు జోకుల మీద జోకులు వేస్తున్నారు. విజయ్ మాల్యా పెళ్లి రోజున ఎస్బీఐ జాతీయ సెలవుదినంగా ప్రకటిస్తుందని ఒక నెటిజన్ చమత్కరించగా.. ఇది మాల్యాను పట్టుకునేందుకు ఐబీ పన్నిన హనీట్రాప్ అని మరొకరు సెటైర్ వేశారు. లండన్‌లో ఒంటరితనం అనుభవించలేక.. మాల్యా మూడో పెళ్లి చేసుకుంటున్నాడని, త్వరలోనే మరో ముగ్గురిని కూడా అతను చేసుకుంటాడని ఇంకొకరు ట్వీట్ చేశారు. There's a conspiracy theory that Vijay Mallya's marriage is actually a honey trap. The girl is planted by intelligence agencies. After marriage she will force Mallya to visit her family in India. And then police will arrest him. 😁🔫 — Nimit (@nimitarora1991) March 28, 2018 Vijay Mallya getting married again because he was feeling a loan. — InGenious (@Bees_Kut) March 28, 2018 *Normal zindagi* Son : Papa ek ladki hai jisse mai shaadi karna chahta hun *Mentos zindagi* Vijay Mallya : beta ek ladki hai jisse mai shaadi karna chahta hun — Pakchikpak Raja Babu (@HaramiParindey) March 28, 2018 -
పోలీసుల అదుపులో నిత్యపెళ్లి కొడుకు
నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : తనకు విడాకులు ఇవ్వకుండా మూడో పెళ్లి చేసుకున్నాడని రెండో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ నిత్యపెళ్లి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నా యి. డిచ్పల్లి మండలం సిర్నాపల్లికి చెందిన కమ్మరి లలిత వివాహం నిజామాబాద్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన అర్గుల్ శేఖర్‌తో 2009 ఆగస్టులో జరిగింది. వివాహమైన కొన్ని రోజులకే శేఖర్ భార్యను అదనపు కట్నం కోసం వేధించటం మొదలుపెట్టాడు.దీంతో లలిత తల్లిదండ్రులు పలుమార్లు కుల పంచాయితీ పెట్టి భర్తతో ఆమెను కాపురానికి పంపారు. అయినా భర్తలో మార్పు రాకపోవడం తో లలిత కొంతకాలంగా పుట్టింటి వద్ద నే ఉంటోంది. ఈ క్రమంలో శేఖర్ పది హేను రోజుల క్రితం రెంజల్ మండ లం దూపల్లికి చెందిన నిరోషను వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న లలిత కుటుంబసభ్యులు బంధువులతో కలిసి శుక్రవారం మంచిప్పలోని భర్త శేఖర్ ఇంటికి వెళ్లి భర్తను నిలదీసింది. ఈ సందర్భంగా ఇరువు రు మధ్య వాగ్వాదం చోటుకుంది. దీం తో తనకు న్యాయం చేయాలని లలి త గ్రామస్తులను వేడుకుంది. గ్రామస్తులు ఆమెకు మద్దతు తెలుపగా శేఖర్‌పై నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా శేఖర్‌కు ఈ రెండు వివాహాల కంటె ముందే మాక్లూర్ మండలం డీకంపల్లికి చెందిన యువతి తో మొద టి వివాహమైంది. శేఖర్ వేధింపులు భరించలేక ఆ యువతి వివాహమైన మూడు నెలలకే విడాకులు తీసుకుం ది. మొదటి వివాహం గురించి గోప్యం గా ఉంచి శేఖర్ తనను వివాహం చేసుకున్నాడని లలిత పోలీ సులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొం ది.తనకు కొడుకు పుట్టినా వచ్చి చూడలేదంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.