నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : తనకు విడాకులు ఇవ్వకుండా మూడో పెళ్లి చేసుకున్నాడని రెండో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ నిత్యపెళ్లి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నా యి. డిచ్‌పల్లి మండలం సిర్నాపల్లికి చెందిన కమ్మరి లలిత వివాహం నిజామాబాద్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన అర్గుల్ శేఖర్‌తో 2009 ఆగస్టులో జరిగింది. వివాహమైన కొన్ని రోజులకే శేఖర్ భార్యను అదనపు కట్నం కోసం వేధించటం మొదలుపెట్టాడు.దీంతో లలిత తల్లిదండ్రులు పలుమార్లు కుల పంచాయితీ పెట్టి భర్తతో ఆమెను కాపురానికి పంపారు. అయినా భర్తలో మార్పు రాకపోవడం తో లలిత కొంతకాలంగా పుట్టింటి వద్ద నే ఉంటోంది. ఈ క్రమంలో శేఖర్ పది హేను రోజుల క్రితం రెంజల్ మండ లం దూపల్లికి చెందిన నిరోషను వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న లలిత కుటుంబసభ్యులు బంధువులతో కలిసి శుక్రవారం మంచిప్పలోని భర్త శేఖర్ ఇంటికి వెళ్లి భర్తను నిలదీసింది.
ఈ సందర్భంగా ఇరువు రు మధ్య వాగ్వాదం చోటుకుంది. దీం తో తనకు న్యాయం చేయాలని లలి త గ్రామస్తులను వేడుకుంది. గ్రామస్తులు ఆమెకు మద్దతు తెలుపగా శేఖర్‌పై నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా శేఖర్‌కు ఈ రెండు వివాహాల కంటె ముందే మాక్లూర్ మండలం డీకంపల్లికి చెందిన యువతి తో మొద టి వివాహమైంది. శేఖర్ వేధింపులు భరించలేక ఆ యువతి వివాహమైన మూడు నెలలకే విడాకులు తీసుకుం ది. మొదటి వివాహం గురించి గోప్యం గా ఉంచి శేఖర్ తనను వివాహం చేసుకున్నాడని లలిత పోలీ సులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొం ది.తనకు కొడుకు పుట్టినా వచ్చి చూడలేదంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల అదుపులో నిత్యపెళ్లి కొడుకు
Published Sat, Aug 31 2013 3:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement
Advertisement