తిరుపతమ్మ మహత్యం నాటక ప్రదర్శన
తెనాలి: కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మూడురోజుల భక్తిరస పౌరాణిక నాటకోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఇక్కడి మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. పట్టణానికి చెందిన శ్రీవిజయలక్ష్మీ శ్రీనివాస నాట్యమండలి ఆధ్వర్యంలో తొలిరోజున శ్రీతిరుపతమ్మ మహాత్మ్యం నాటకాన్ని ప్రదర్శించారు. తొలుత స్థానిక సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రజ్వలిత వ్యవస్థాపకుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ప్రముఖ హార్మోనిస్టు, నాటక సమాజం ఆర్గనైజరు దీపాల సుబ్రహ్మణ్యం, జి.బుల్లెబ్బాయి, ఆర్సీ శేఖర్, కొండలరావు, చెన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.