Thomas Cook India Ltd
-
థామస్ కుక్‌లో ప్రమోటర్ వాటా అప్
ముంబై: ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్(మారిషస్).. తాజాగా వాటాను పెంచుకున్నట్లు ఓమ్ని చానల్ ట్రావెల్ కంపెనీ థామస్ కుక్ (ఇండియా) పేర్కొంది. దీంతో ఫెయిర్‌బ్రిడ్జ్ వాటా 70.58 శాతం నుంచి 72.34 శాతానికి బలపడినట్లు వెల్లడించింది. మిగిలిపోయిన దాదాపు రూ. 133 కోట్ల విలువైన ఐచ్చిక మార్పిడికి వీలు కల్పించే క్యుమిలేటివ్ రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లకు బోర్డు సబ్‌కమిటీ ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. తద్వారా 2.8 కోట్ల ఈక్విటీ షేర్లను ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ తాజాగా పొందినట్లు తెలియజేసింది. దీంతో షేరుకి రూ. 47.3 ధరలో మొత్తం రూ. 436 కోట్ల విలువైన రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు 9.2 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్పు చెందినట్లు వెల్లడించింది. వెరసి ప్రమోటర్ల వాటా 72.34 శాతానికి చేరినట్లు వివరించింది. ట్రావెల్, తత్సంబంధ సర్వీసుల విభాగాలలో కనిపిస్తున్న వేగవంత వృద్ధిపట్ల ప్రమోటర్లకున్న విశ్వాసాన్ని ఇది ప్రతిఫలిస్తున్నట్లు థామస్ కుక్ (ఇండియా) ఎండీ మాధవన్ మీనన్ పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో థామస్ కుక్(ఇండియా) షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 56 దిగువన ముగిసింది. -
విసిగిపోయాం..సొంత పేరు పెట్టుకుంటాం!
సాక్షి. న్యూఢిల్లీ: బ్రిటన్ ట్రావెల్ దిగ్గజం థామస్‌కుక్ దివాలా తీయడం దేశీయంగా సేవలు నిర్వహిస్తున్న థామస్‌కుక్ ఇండియాకు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 2012 నుంచి దేశీయంగా స్వతంత్ర సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న థామస్ కుక్ ఇండియా పేరు మార్చుకోవాలని యోచిస్తోంది. ఎందుకంటే దివాలా తీసిన బ్రిటిన్ సంస్థకు చెందిన 22వేల ఉద్యోగాలు (ప్రపంచవ్యాప్తంగా) ప్రమాదంలో పడనున్నాయి. అలాగే అకస్మాత్తుగా పలు విమానల సర్వీసులను నిలిపి వేయడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడిక్కడ చిక్కుక పోయారన్న వార్త ఆందోళనకు దారితీసింది. స్టాక్మార్కెట్లో ఈ కౌంటర్లో అమ్మకాల వెల్లువ ఈ రోజు (మంగళవారం) కూడా కొనసాగుతోంది. దీంతో ఈ పరిణామాంలపై స్పందించిన థామస్‌కుక్ (ఇండియా) లిమిటెడ్ (బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ)కి యుకెసంస్థతో ఎటువంటి సంబంధం లేదని పునరుద్ఘాటించింది. అలాగే తమకు, ప్రస్తుత సంక్షోభానికి ఎలాంటి సంబంధమూ లేదని ప్రకటించింది. నిర్వహణ, లాభాల పరంగా తాము చాలా పటిష్టంగా ఉన్నామని స్పష్టం చేసింది. 2012 నాటికి ఒప్పందం ప్రకారం 2024 వరకు 'థామస్ కుక్' బ్రాండ్ పేరును ఉపయోగించుకునే హక్కు కంపెనీకి ఉందని కంపెనీ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ మీనన్ వెల్లడించారు. అయితే సంస్థ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున సంస్థలో సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున రాబోయే రోజుల్లో కూడా దీనిని సమీక్షించే అవకాశం ఉందనీ, దాదాపు రెండు వారాల్లో వివరణాత్మక పరివర్తన ప్రణాళిక అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. . కాగా థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్‌లో మేజర్ వాటాను(77 శాతం) ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 2012లో కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ (మారిషస్) లిమిటెడ్ - ఫెయిర్‌ఫాక్స్ కంపెనీ దాదాపు 67 శాతం వాటాను కలిగి ఉంది. చదవండి: కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో చదవండి : ‘థామస్ కుక్’ దివాలా... -
థామస్ కుక్-స్టెర్లింగ్ హాలిడేస్ విలీనం
ముంబై: పర్యాటక సేవలు అందించే థామస్ కుక్ (ఇండియా), స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్స్ ఇండియా విలీనం కాబోతున్నాయి. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 870 కోట్లు ఉంటుందని, ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి పూర్తి కాగలదని థామస్ కుక్ (టీసీఐఎల్) సంస్థ వెల్లడించింది. కొంత నగదుగాను, మరికొంత మేర షేర్ల రూపంలోనూ దశలవారీగా ఈ డీల్ ఉంటుందని పేర్కొంది. తొలిదశలో స్టెర్లింగ్ మేనేజ్మెంట్ టీమ్ సహా ప్రస్తుత షేర్‌హోల్డర్ల నుంచి సుమారు 23 శాతాన్ని థామస్ కుక్ రూ. 176 కోట్లకు కొనుగోలు చేస్తుంది. ఈ షేర్హోల్డర్లలో స్టెర్లింగ్ చైర్మన్ సిద్ధార్థ మెహతా, ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కూడా ఉన్నారు. అలాగే, ప్రిఫరెన్షియల్ షేర్ల అలాట్మెంట్ కోసం రూ.187 కోట్లు, ఓపెన్ ఆఫర్ కోసం మరో రూ. 230 కోట్లు టీసీఐఎల్ వెచ్చిస్తుంది. మొత్తం మీద టీసీఐఎల్కి చెందిన ప్రతి 120 షేర్లకు.. స్టెర్లింగ్ సంస్థకి చెందిన 100 షేర్లు లభిస్తాయి. ఈ పరిణామాల దరిమిలా రెండు సంస్థల సగటు విలువ రూ.3,000 కోట్ల పైచిలుకు ఉంటుందని టీసీఐఎల్ ఎండీ మాధవన్ మీనన్ తెలిపారు. విలీనం తర్వాత స్టెర్లింగ్ సంస్థ కనుమరుగైనా బ్రాండ్ మాత్రం కొనసాగుతుందని వివరించారు. ఈ డీల్‌తో దేశవ్యాప్తంగా తమకున్న రిసార్ట్స్.. థామస్ కుక్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని మీనన్ పేర్కొన్నారు. థామస్ కుక్ కొన్నాళ్ల క్రితమే బెంగళూరుకు చెందిన ఐక్య అనే సంస్థలో 74 శాతం వాటాలను రూ. 256 కోట్లకు కొనుగోలు చేసింది. థామస్ కుక్ మాతృ సంస్థ ఫెయిర్‌ఫ్యాక్స్ హోల్డింగ్స్. దీని చైర్మన్ అయిన ప్రేమ్ వత్స హైదరాబాదీ కావడం గమనార్హం. సుమారు నెలన్నర రోజులుగా ఈ డీల్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే ప్రేమ్ వత్స భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగానే స్టెర్లింగ్‌తో ఒప్పందం ఖరారై ఉంటుందని సమాచారం. మరోవైపు, స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్స్ 1987లో ఏర్పాటైంది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 19 ప్రాంతాల్లోని రిసార్ట్స్‌లో 1,512 గదులు ఉన్నాయి.