though
-
వికారాబాద్‌లో మహిళ దారుణ హత్య
వికారాబాద్ మండలం అంతగిరిపల్లె సమీపంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు మహిళను బాగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది. మృతురాలు తాండూరుకు చెందిన వరలక్ష్మి(36)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరీ చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ బృందంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానంతో అమానుషం
బండరాయితో మోది భార్యను చంపిన భర్త నేరేడ్మెట్: అనుమానం పెనుభూతమైంది. వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించి భార్యను అతిదారుణంగా అంతం చేశాడో భర్త. నేరేడ్మెట్ డీఐ అశోక్‌కుమార్ కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తి గ్రామానికి చెందిన బెజవాడ గణేష్, అదే జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి (34)లకు 2001లో పెళ్లైంది. వీరికి శిరీష (14), సందీప్ (12) సంతానం. జీవనోపాధి కోసం 2005లో నగరానికి వచ్చారు. ప్రగతినగర్‌లో నివాసముంటూ గణేష్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వరలక్ష్మికి కొన్ని రోజుల క్రితం కాకినాడకు చెందిన వెంకటేష్‌తో పరి చయం ఏర్పడింది. గత నవంబర్‌లో లక్ష్మి కాకినాడకు వెళ్లి అక్కడే ఉండిపోయింది. ఈ నెల 20న తిరిగి ప్రగతినగర్‌లోని తన భర్త వద్దకు వచ్చింది. మంగళవారం అర్దరాత్రి తిరిగి కాకినాడ వెళ్తానని భర్తతో అనడం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన గణేష్ భార్యను ఇంట్లో నుంచి జుట్టు పట్టుకుని బయటకు లాక్కొచ్చి.. ఇంటి ముందు ఉన్న సీసీ రోడ్డుకు తలను బలంగా కొట్టాడు. అంతటితో ఆగకకుండా పక్కనే ఉన్న బండరాయితో వరలక్ష్మి తలపై మోది హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నిందితుడు గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కుటుంబ సభ్యులపై కానిస్టేబుల్ కాల్పులు
బావమరిది మృతి భార్య పరిస్థితి విషమం బళ్లారి (తోరణగల్లు) : కట్టుకున్న భార్య, ఆమె సోదరుడిపై ఓ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బావమరిది మరణించాడు. భార్య చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే... మాజీ ఎంపీ శాంత వద్ద గన్‌మన్‌గా బళ్లారికి చెందిన ప్రసాద్ (25) పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన ఇతను నిత్యం మద్యం మత్తులో కప్పగల్లులోని ఇంటికి చేరుకుని భార్యను వేధిస్తుండేవాడు. గురువారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి చేరుకుని అర్ధరాత్రి 12 గంటల వరకు భార్య వరలక్ష్మి(20)తో గొడవ పడ్డాడు. అనంతరం ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటి తలుపు వేసుకున్నాడు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తన అన్న నాగరాజు(30)కు వరలక్ష్మి తెలిపి, సాయం చేయాలని కోరింది. ఆ సమయంలో చెల్లెలు ఇంటి వద్దకు నాగరాజు చేరుకుని ప్రసాద్‌ను నిలదీశాడు. ఈ క్రమంలో నాగరాజుపై ప్రసాద్ దాడికి తెగబడ్డాడు. ఇక చేసేదేమీ లేక తన చెల్లెలిని ఇంటికి పిలుచుకెళ్లేందుకు సిద్ధమై బైక్ స్టార్ట్ చేస్తుండగా ప్రసాద్ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బులెట్ నాగరాజు ఎదలో దూసుకెళ్లింది. మరో బులెట్ వరలక్ష్మి కడుపులో నుంచి అవతలకు వెళ్లిపోయింది. కాల్పుల శబ్ధం విన్న స్థానికులు అక్కడకు చేరుకుంటుండగా ప్రసాద్ పారిపోయాడు. క్షతగాత్రులను వెంటనే విమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ నాగరాజు మరణించాడు. వరలక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, పరారీలో ఉన్న నిందితుడిని శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.