Three-match series
-
IND W vs AUS W 3rd T20: సిరీస్ ఎవరిదో?
నవీ ముంబై: మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్, ఆ్రస్టేలియా మహిళా జట్లు చెరొకటి గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇప్పుడు సిరీస్‌ను గెలుచుకునేందుకు ఫైనల్ లాంటి పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన భారత అమ్మాయిలు ఇప్పుడు టి20 సిరీస్‌ను కోల్పోడానికి సిద్ధంగా లేరు. ఆఖరి పోరులో ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం బరిలోకి దిగుతోంది. తద్వారా కొత్త ఏడాదిలో క్లీన్‌స్వీప్ పరాభవాన్ని మరిచేలా ఈ టి20 సిరీస్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నెగ్గినట్లే ఈ ఆఖరి పోరులోనూ దాన్ని పునరావృతం చేస్తే సిరీస్ కష్టం కానేకాదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమాలు రాణిస్తే తొలి మ్యాచ్‌ను గెలుచుకున్నంత సులభంగా సిరీస్‌నూ గెలుచుకోవచ్చు. గత మ్యాచ్‌లో వీరి వైఫల్యమే జట్టును దెబ్బ తీసింది. దీంతో పాటు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ వరుస వైఫల్యాలు జట్టుకు ప్రతికూలంగా మారాయి. ఈ నలుగురు కీలకమైన చివరి మ్యాచ్‌లో రాణిస్తే మాత్రం మన మహిళా జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్ నిలకడగా రాణిస్తున్నారు. ఆసీస్‌తో పోల్చుకుంటే భారత ఫీల్డింగ్ సాధారణంగా ఉంది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్మెంట్కు ఫీల్డింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముంది. మరోవైపు ఏకైక టెస్టు మ్యాచ్ ఓడాక అలీసా హీలీ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు దెబ్బతిన్న పులిలా వన్డేల్లో పంజా విసిరింది. తాజా టి20 సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడినా... రెండో మ్యాచ్‌లో బదులు తీర్చుకుంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో భారత గడ్డపై రెండో సిరీస్ విజయంపై కన్నేసింది. -
WI Vs BAN, 3rd T20: పూరన్ ధనాధన్
జార్జిటౌన్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 2–0తో సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దయింది. కెప్టెన్ నికోలస్ పూరన్ (39 బంతుల్లో 74 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మూడో టి20 మ్యాచ్‌లో విండీస్ 10 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. అఫీఫ్ హుస్సేన్ (38 బంతుల్లో 50; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), లిటన్ దాస్ (41 బంతుల్లో 49; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం విండీస్ 18.2 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసి విజయం సాధించింది. కైల్ మేయర్స్ (38 బంతుల్లో 55; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. మేయర్స్, పూరన్ నాలుగో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరుగుతుంది. -
20 ఏళ్ల తర్వాత ఆసీస్‌పై వన్డే సిరీస్ సొంతం
కెప్టెన్ బాబర్ ఆజమ్ (105 నాటౌట్; 12 ఫోర్లు), ఇమామ్ (89 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో... ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో నెగ్గింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను పాక్ 2–1తో సొంతం చేసుకుంది. 2002 తర్వాత ఆస్ట్రేలియాపై పాక్ తొలిసారి వన్డే సిరీస్ దక్కించుకుంది. ముందుగా ఆసీస్ 41.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్‌కాగా... పాక్ 37.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది. -
దక్షిణాఫ్రికాదే టి20 సిరీస్
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 42 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. తొలుత సఫారీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (44 బంతుల్లో 75 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. ఛేజింగ్‌లో ఐర్లాండ్ 19.3 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. షమ్సీ, బోర్న్ ఫోర్టీన్ చెరో మూడు వికెట్లు సాధించి ప్రత్యర్థిని కట్టడి చేశారు. -
మెరిసిన లిటన్, షకీబ్
హరారే: లిటన్ దాస్ స్ఫూర్తిదాయక సెంచరీ (114 బంతుల్లో 102; 8 ఫోర్లు)కి బౌలింగ్‌లో షకీబుల్ హసన్ (5/30) ప్రదర్శన తోడవ్వడంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 155 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా జట్టు 1–0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 276 పరుగులు చేసింది. ఛేదనలో జింబాబ్వే 28.5 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. చకాబ్వ (54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. 200వ మ్యాచ్ ఆడుతోన్న జింబాబ్వే కెప్టెన్ బ్రెండన్ టేలర్ (24; 3 ఫోర్లు) వికెట్ తీయడం ద్వారా బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షకీబ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు మాజీ కెప్టెన్ మష్రఫె మొర్తజా (269 వికెట్లు) పేరిట ఉండేది. షకీబ్ ఇప్ప టి వరకు 213 వన్డేల్లో 274 వికెట్లు తీశాడు. -
నేడు భారత్, ఇంగ్లండ్ మహిళల తొలి టి20
నార్తాంప్టన్: భారత మహిళల క్రికెట్ జట్టు ఇక టి20ల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేడు భారత్,ఇంగ్లండ్‌ల మధ్య తొలిటి20 జరుగనుంది. వన్డేల్లాగే ఈ ఫార్మాట్లోనూ ప్రత్యర్థి జట్టు మనకంటే బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఫామ్‌లో లేని కెప్టెన్ హర్మన్‌పైనే తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఇచ్చే ఆరంభంపై భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. స్నేహ్ రాణా, రిచా ఘోష్‌లతో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. మరో వైపు స్టార్ ప్లేయర్ డానీ వ్యాట్ పునరాగమనంతో ఇంగ్లండ్ మరింత పటిష్టంగా తయారైంది. -
ఇంగ్లండ్ శుభారంభం
కార్డిఫ్: శ్రీలంకతో ఆరంభమైన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ శుభారంభం చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి టి20లో ఇంగ్లండ్ 8 వికెట్లతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. దసున్ శనక (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ కుశాల్ పెరీరా (26 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్యామ్ కరన్, ఆదిల్ రషీద్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలుపొందింది. జోస్ బట్లర్ (55 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ రాయ్ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. డేవిడ్ మలాన్ (7) త్వరగా అవుటైనా... బెయిర్‌స్టో (13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి బట్లర్ మ్యాచ్‌ను పూర్తి చేశాడు. బట్లర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు లభించింది. -
న్యూజిలాండ్‌దే విజయం
వెల్లింగ్టన్: పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు విజయంతో ఆరంభించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హెన్రీ నికోల్స్ (82; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో పాటు టెయిలెండర్ల అద్భుత బ్యాటింగ్‌తో సోమవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ జట్టు పాక్‌పై 70 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 280 పరుగులు చేసింది. అనంతరం పాక్ 46 ఓవర్లలో 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ (62; 6 ఫోర్లు) మాత్రమే మెరుగ్గా ఆడారు. బౌల్ట్‌కు నాలుగు, ఇలియట్కు మూడు వికెట్లు దక్కాయి. -
రికార్డుల మోత
సెంచరీలతో చెలరేగిన రామ్‌దిన్, బ్రేవో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ బస్సేటెర్రె (సెయింట్ కిట్స్): దినేశ్ రామ్‌దిన్ (121 బంతుల్లో 169; 8 ఫోర్లు, 11 సిక్సర్లు), డారెన్ బ్రేవో (127 బంతుల్లో 124, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ చేసింది. బస్సేటెర్రెలో సోమవారం జరిగిన మూడో వన్డేలో 91 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిం ది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 338 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేయగలిగింది.