హరారే: లిటన్ దాస్ స్ఫూర్తిదాయక సెంచరీ (114 బంతుల్లో 102; 8 ఫోర్లు)కి బౌలింగ్‌లో షకీబుల్ హసన్ (5/30) ప్రదర్శన తోడవ్వడంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 155 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా జట్టు 1–0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 276 పరుగులు చేసింది. ఛేదనలో జింబాబ్వే 28.5 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. చకాబ్వ (54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. 200వ మ్యాచ్ ఆడుతోన్న జింబాబ్వే కెప్టెన్ బ్రెండన్ టేలర్ (24; 3 ఫోర్లు) వికెట్ తీయడం ద్వారా బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షకీబ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు మాజీ కెప్టెన్ మష్రఫె మొర్తజా (269 వికెట్లు) పేరిట ఉండేది. షకీబ్ ఇప్ప టి వరకు 213 వన్డేల్లో 274 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment