కేవీకేకు ముగ్గురు నూతన శాస్త్రవేత్తలు
కళ్యాణదుర్గం: స్థానిక కృషి విజ్ఞాన కేంద్రానికి ముగ్గురు నూతన రెగ్యులర్ శాస్త్రవేత్తలను ప్రభుత్వం నియమించింది. వీరంతా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కేవీకే సేవలను రైతులకు మరింత విస్తరింపజేయడానికి అవకాశం ఏర్పడిందని కోఆర్డినేటర్ సుధీర్ తెలిపారు. ఉద్యానవన శాస్త్రవేత్తగా డాక్టర్ లక్ష్మీదుర్గ, హోంసైన్సు శాస్త్రవేత్తగా మంజులత, విస్తరణ విభాగం శాస్త్రవేత్తగా ఉషా బాధ్యతలు చేపట్టారు. రైతులకు అందుబాటులో ఉండి మంచి దిగుబడులు సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. శాస్త్రవేత్తల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.