పెరిగిన కరెంట్ కోతలు
మంచిర్యాల టౌన్ : ప్రభుత్వం విద్యుత్ కోతల డోస్ పెంచింది. తాజాగా కోతల సమయాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. మారిన వేళలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం మున్సిపాలిటీ, మండల, విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో 6 గంటలు ఉన్న కరెంటు కోతలను 8 గంటలకు పెంచింది. జిల్లా కేంద్రంలో ఉన్న 4 గంటల కోతలను 6 గంటలకు పొడిగించింది.
జిల్లా కేంద్రంలో ఉదయం 5 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, మున్సిపాలిటీ, మండల, సబ్స్టేషన్ హెడ్ క్వార్టర్ పరిధిలో ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు విద్యుత్ కోతలు అమలులో ఉంటాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ కోతలు అమలు ఉంటాయి. అలాగే వ్యవసాయ పరిధిలో నాలుగు కేటగిరీల్లో త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా ఉంటుంది.
ఏ కేటగిరీలో ఉదయం 3 నుంచి 8 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు, బీ కేటగిరీలో ఉదయం 9 నుంచి 2 గంటల వరకు, రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు, సీ కేటగిరీలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు, డీ కేటగిరీలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు త్రీఫేస్ సరఫరా ఉంటుంది. విద్యుత్ ఉత్పాదకత తక్కువగా ఉన్నందున విద్యుత్ కోతలు పెరిగాయని మంచిర్యాల ట్రాన్స్కో డీఈ వేణుమాధవ్, ఏడీఈ స్వామి తెలిపారు.