పెరిగిన కరెంట్ కోతలు | Increased current cuts | Sakshi
Sakshi News home page

పెరిగిన కరెంట్ కోతలు

Published Tue, Aug 5 2014 2:07 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

Increased current cuts

 మంచిర్యాల టౌన్ : ప్రభుత్వం విద్యుత్ కోతల డోస్ పెంచింది. తాజాగా కోతల సమయాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. మారిన వేళలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం మున్సిపాలిటీ, మండల, విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో 6 గంటలు ఉన్న కరెంటు కోతలను 8 గంటలకు పెంచింది. జిల్లా కేంద్రంలో ఉన్న 4 గంటల కోతలను 6 గంటలకు పొడిగించింది.

 జిల్లా కేంద్రంలో ఉదయం 5 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, మున్సిపాలిటీ, మండల, సబ్‌స్టేషన్ హెడ్ క్వార్టర్ పరిధిలో ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు విద్యుత్ కోతలు అమలులో ఉంటాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ కోతలు అమలు ఉంటాయి. అలాగే వ్యవసాయ పరిధిలో నాలుగు కేటగిరీల్లో త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా ఉంటుంది.

 ఏ కేటగిరీలో ఉదయం 3 నుంచి 8 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు, బీ కేటగిరీలో ఉదయం 9 నుంచి 2 గంటల వరకు, రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు, సీ కేటగిరీలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు, డీ కేటగిరీలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు త్రీఫేస్ సరఫరా ఉంటుంది. విద్యుత్ ఉత్పాదకత తక్కువగా ఉన్నందున విద్యుత్ కోతలు పెరిగాయని  మంచిర్యాల ట్రాన్స్‌కో డీఈ వేణుమాధవ్, ఏడీఈ స్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement