వరంగల్ రీజియన్ మూడు ముక్కలు
మార్కెటింగ్ శాఖలో విభజన
నూతన రీజియన్లకు జేడీఎంలు
రూ.10కోట్ల ఆదాయం దాటితే డీఎంఓలు
వరంగల్ సిటీ : నూతన జిల్లాల ఏర్పాటుతో మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ మూడు ముక్కలు కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ ఐదు ల్లాలతో హైదరాబాద్ రీజియ న్, మరో 5 జిల్లాలతో వరంగల్ రీజియన్‌గా కొనసాగుతోంది. దసరా నుంచి మరో 17 జిల్లాలు నూతనంగా ఏర్పడుతున్నందు న మార్కెటింగ్ శాఖను 4 రీజియన్లుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరంగల్ రీజియన్ పరిధిలో ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. నూతన జి ల్లాల ఏర్పాటుతో వరంగల్, కరీంనగర్ రెండు జిల్లాలు ఒక రీజి యన్‌గా, ఖమ్మం, నల్గొండ జిల్లాలు మరో రీజియన్‌గా, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు ఇంకో రీజియన్‌గా ఏర్పాటు కాబోతున్నాయి.హైదరాబాద్ రీజియన్ యథావిధిగా కొనసాగనుంది.
నలుగురు జేడీఎంలు
నాలుగు రీజియన్లు ఏర్పడుతున్నందున మార్కెటింగ్ శాఖలో నలుగురు జేడీఎంలు విధులు నిర్వర్తించాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ జేడీఎంగా రవికుమార్, వరంగల్ రీజియన్ జేడీఎంగా సామ్యేల్‌రాజ్ ఇంచార్జీ అధికారిగా ఉన్నారు. దసరా నుం చి నూతన జిల్లా పాలన ప్రారంభం కానున్నందున నలుగురు జేడీఎంలు అవసరం ఉండగా, ప్రస్తుతం వరంగల్ రీజియన్ జేడీఎం సామ్యేల్రాజును వరంగల్‌లోనే పర్మనెంట్ పోస్టింగ్ ఇస్తారా, లేదంటే నూతన రీజియన్‌కు బదిలీ చేస్తారా సందిగ్దం నెలకొంది. కాగా ప్రస్తుతం జేడీఎంల తర్వాత సీనియార్టీ ప్రకారం 3వ స్థానంలో నర్సంపేట మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎర్రం అశోక్, 4వ స్థానంలో ప్రస్తుతం వరంగల్ రీజియన్ మార్కెట్ డీడీఎంగా విధులు నిర్వర్తిస్తున్న ఉప్పుల శ్రీనివాస్, 5వ స్థానంలో మల్లేశం, 6వ స్థానంలో ఎల్లయ్య ఉన్నారు. కాగా ఇందులో మూడో స్థానంలో ఉన్న అశోక్ అనారోగ్యంతో బాధపడుతుండగా జేడీఎంగా బాధ్యతలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజధానికి తరలనున్న 18 మంది డీడీఎంలు
రాష్ట్రవ్యాప్తంగా రెండు రీజియన్లల్లో ప్రస్తుతం 18 మంది డీడీఎం(డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్)లు మార్కెటింగ్‌శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 13మంది డీడీఎంలు వరంగల్ రీజియన్ పరిధిలో పనిచేస్తుండగా, 5గురు డీడీఎంలు హైదరాబాద్ రీజియన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వీరందరినీ హైదరాబాద్ హెడ్ ఆఫీస్‌కు తరలించి, విజిలెన్స్ అధికారులుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది.
ముగ్గురికే డీఎంఓలుగా అవకాశం
మార్కెటింగ్ శాఖలో ప్రస్తుతం జిల్లా స్థాయి మార్కెటింగ్ అధికారిగా డీఎంఓ (డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్)లను నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు జిల్లా స్థాయి అధికారిగా ఏడీ(అసిస్టెంట్ డైరెక్టర్) విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా డీఎంలను నియమిస్తే ఇంతకు ముందు డీడీఈఎంలుగా పనిచేసిన అధికారులే తిరిగి డీఎంలుగా బాధ్యతలు స్వీకరిస్తారు. దీంతో కొత్తేమీ లేదనే కోణంలో మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఆలోచించి, రూ.10కోట్లు ఆదాయం దాటిన మార్కెట్లకే డీఎంలను నియమించాలని, రూ.10కోట్ల ఆదాయం లోపు ఉన్న మార్కెట్లలో ఏడీలే అధికారులు విధులు నిర్వర్తించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రూ.10కోట్ల ఆదాయం దాటిన మార్కెట్లు వరంగల్‌తోపాటు ఖమ్మం, నిజామాబాద్ మార్కెట్లు మాత్రమే ఉన్నాయి. అంటే నాలుగు రీజియన్లతో నూతన జిల్లాలు ఏర్పాౖటెతే ముగ్గురు డీఎంలు బాధ్యతలు స్వీకరిస్తారు. అంటే మరో 15మంది డీడీఎంలు హెడ్ ఆఫీస్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. గత 5 రోజులుగా మార్కెటింగ్ శాఖలో మార్పుల కోసం ఉన్నతాధికారులతో ముమ్మరంగా సమావేశాలు, చర్చలు కొనసాగుతున్నాయి. ఈనెల 20వ తేదీ వరకు ఎన్ని రీజియన్లు, ఎంత మంది డీఎంలు, జేడీఎంల వివరాలు పూర్తిగా వెల్లడికానున్నాయి.