చిన్నారిపై అత్యాచారం కేసులో కీచక ఎస్సైలు అరెస్ట్
12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపిన ముగ్గురు ఖాకీ కీచకులను అరెస్ట్ చేసినట్లు షిల్లాంగ్ జిల్లా ఎస్పీ ముఖేష్ సింగ్ శనివారం ఇక్కడ వెల్లడించారు. మేఘాలయాలోని పశ్చిమ గారో పర్వత ప్రాంతంలో ఆ ముగ్గురు నిందితులను నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపరచగా నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని చెప్పారు. కాగా నిందితులు ఒకరు ఎస్ఐలుగా విధులు నిర్వర్తిస్తుండగా, మరో ఇద్దరు ప్రొబిహిషన్ పిరియడ్లో ఉన్నారని తెలిపారు.
అయితే ఆ ముగ్గురు నిందితులను విధుల నుంచి ఇప్పటికే తొలగించినట్లు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... గతేడాది డిసెంబర్ 28వ తేదీన 12 ఏళ్ల చిన్నారి తన మేనమామతో కలసి షాపుకు వెళ్లి వస్తుంది. ఆ క్రమంలో మేనమామపై దాడి చేసి తాము తీవ్రవాదులమని చెప్పి, ఆ బాలికపై ఆటో రిక్షాలో అత్యాచారం చేశారు. అనంతరవారిని తురాలోని చాంద్మరి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.
కొన్ని తెల్లపేపర్లపై బాధితులు ఇద్దరి వద్ద నుంచి సంతకాలు తీసుకుని, ఆ విషయం ఎక్కడైనా చెబితే చంపెస్తామని బెదిరించారు. దాంతో బాధితురాలు తన తల్లితండ్రులను ఆశ్రయించారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై అత్యాచార ఘటనపై మహిళ పోలీసులు ఉన్నతాధికారితో విచారణ జరిపిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ముఖేష్ సింగ్ వివరించారు.