throw slipper
-
‘మీరు ఒలింపిక్స్‌లోట్రై చేయొచ్చు కదా..?!’
-
‘మీరు ఒలింపిక్స్‌లోట్రై చేయొచ్చు కదా..?!’
చిన్నప్పుడు ఇంట్లో అల్లరి పనులు చేయడం.. తర్వాత అమ్మ చేతిలో తన్నులు తినడం దాదాపు అందిరి జీవితాల్లో జరిగే చాలా సాధరణ సంఘటన. దెబ్బల నుంచి తప్పించుకోవడం కోసం వీధుల వెంబడి పరిగెత్తిన వారు కూడా ఉంటారు. మన దగ్గర ఏమో కానీ పంజాబీ తల్లులు మాత్రం పిల్లలకు ఇలా పరిగెత్తే చాన్స్ ఇవ్వరు. తప్పించుకోవడం కోసం పరిగెత్తే పిల్లల్ని ఆపడానికి వారి మీదకు చెప్పునో, షూనో విసిరేస్తారు. దరిద్రం కొద్ది చెప్పు తగిలి కింద పడ్డారా.. అప్పుడుంటది ఇక.. వీపు విమానం మోత మోగాల్సిందే. చిన్నప్పుడు ఇలా దెబ్బలు తినడం ఓకే కానీ టీనేజ్‌కొచ్చాక కూడా ఇలాంటి పరిస్థితి వస్తే.. ఎలా ఉంటుంది. ఈ వీడియోలో చూపినట్లు ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఓ తల్లి తప్పించుకు పారిపోతున్న కూతుర్ని ఆపడానికి పంజాబీ తల్లులు చేసే ప్రయోగం చేసింది. మెక్సికోలో జరిగింది ఈ సంఘటన. తల్లీకూతులిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. కోపంతో ఉన్న తల్లి కూతుర్ని కొట్ట బోయింది. కానీ కూతరు తప్పించుకోవడం కోసం రోడ్డు మీద పరిగెత్తింది. దాంతో విచక్షణ కోల్పోయిన తల్లి చెప్పు తీసుకుని కూతురి మీదకు విసిరేసింది. అది కూడా 30 మీటర్ల దూరంలో ఉండగా. ఆశ్చర్య ఆ చెప్పు సరిగ్గా వెళ్లి ఆ అమ్మాయికి తగిలడం.. కింద పడిపోవడం క్షణాల్లో జరిగాయి. గురి తప్పకుండా చెప్పు విసిరిన ఆమె కోపాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ట్రై చేస్తే రికార్డలన్నీ మీవే అంటూ కామెంట్ చేస్తున్నారు. -
ముఖ్యమంత్రిని కొట్టబోయిన నితీశ్‌కుమార్!
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. 'జనతా కా దర్బార్' కార్యక్రమం నిర్వహిస్తుండగా ఓ యువకుడు సీఎం నితీశ్‌ను చెప్పుతో కొట్టబోయాడు. దీంతో పోలీసులు అతన్ని అడ్డుకొని వెంటనే అరెస్టు చేశారు. యాదృచ్ఛికంగా ఆ యువకుడి పేరు కూడా నితీశ్‌కుమారే. ఆర్వాల్ జిల్లాకు చెందిన అతను సీఎంను కలిసి, తన వినతిపత్రం ఇచ్చేందుకు 'జనతా కా దర్బార్'కు వచ్చాడు. సీఎం దగ్గరికి వెళ్లగానే అతడు ముందుకువంగి తన చెప్పును తీయబోయాడు. అతన్ని భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. అతన్ని అరెస్టు చేసి, ప్రశ్నించేందుకు సచివాలయ పోలీసు స్టేషన్‌కు తరలించినట్టు సీనియర్ ఎస్పీ మను మహారాజ్ తెలిపారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించి.. వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తన అధికారిక నివాసంలో 'జనతా కా దర్బార్మే ముఖ్యమంత్రి' కార్యక్రమాన్ని నితీశ్‌కుమార్ నిర్వహిస్తున్నారు. గతంలో అప్పటి డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీ 'జనతా కా దర్బార్' కార్యక్రమం నిర్వహించిన సందర్భంలోనూ ఈ యువకుడు రచ్చ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు.