Thrown Off Train
-
షాకింగ్ ఘటన: దొంగతనం చేశాడని..కదులుతున్న రైలు నుంచి తోసేసి..
దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి..కదులుతున్న ట్రైయిన్ నుంచి తోసేశారు. ఈ ఘటన అయోధ్య- ఢీల్లీ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఒక గుర్తు తెలియని 20 ఏళ్ల వ్యక్తి షాజహాన్‌పూర్‌లోని తిల్హర్ రైల్వే స్టేషన్ పట్టాలపై మృతి చెంది ఉన్నాడు. సదరు వ్యక్తి రైల్వే పట్టాల వద్ద ఉండే ఓవర్‌హెడ్ లైన్ పోల్కి తల ఢీకొట్టడంతో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఐతే మృతుడికి సబంధించిన ఒక వైరల్ వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. ఆ వీడియోలో ఒక జనరల్ కంపార్ట్మెంట్ బోగిలో 40 ఏళ్ల నరేంద్ర దూబే అనే వ్యక్తి బాధితుడిని ఫోన్ దొంగలించినందుకు క్రూరంగా కొడుతున్నట్లు కనిపించింది. పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు నవ్వుతూ కనిపించాడు. ఆ తర్వాత బాధితుడిని పనిష్మెంట్ కింద కదులుతున్న ట్రైయిన్ నుంచి తోసేస్తున్నట్లు..సదరు బాధితుడు భయంతో అరుస్తున్న కేకలు ఆ వీడియోలో వినిపించాయి. దీంతో పోలీసులు సదరు ప్రయాణికుడు నరేంద్ర దూబేని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ఒక మహిళన తన మొబైల్ ఫోన్ షాజహాన్‌పూర్ రైల్వేస్టేషన్లో పోయిందని ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. వాస్తవానికి బాధితుడు ఫోన్ దొంగలించి లక్నోలో ట్రైయిన్ ఎక్కినట్లు తేలింది. అయితే అక్కడ జనరల్ కంపార్ట్మెంట్లోని ఒక సముహం అతని వద్ద ఈ ఫోన్‌ని గుర్తించి దాడి చేసి రైలులోంచి తోసేశారని పోలీసలు చెబుతున్నారు. దొంగలించిన అరగంటలోనే బాధితుడు రైల్వే పట్టాలపై విగతజీవిగా పడిఉన్నట్లు తెలిపారు. A man suspected to have stolen a mobile phone in Ayodhya Delhi express was thrashed mercilessly and thrown off the running train. He died after his head hit against a pole near Tilhar railway station in Shahjahanpur Uttar Pradesh. pic.twitter.com/bCrREOD51o — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) December 18, 2022 (చదవండి: మరొకరితో సంబంధం.. ఏకంగా భర్త ఇంట్లోనే కాపురం.. మహిళను చెట్టుకు కట్టి) -
Viral Video: రైలులో గొడవ.. యువకుడ్ని కిందకు తోసేసిన తోటి ప్రయాణికుడు
-
రైలులో గొడవ.. యువకుడ్ని కిందకు తోసేసిన తోటి ప్రయాణికుడు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడ్ని తోటి ప్యాసెంజర్ కదులుతున్న రైలులోనుంచి కిందకు తోసేశాడు. ఇద్దరు గొడవపడిన అనంతరం ఆగ్రహంతో ఈ పని చేశాడు. అయితే యువకుడు రైలు నుంచి కిందపడిపోయినా అతడ్ని తోసేసిన వ్యక్తి ఏమాత్రం పశ్చాతాపం, ఆందోళన లేకుండా యథావిధిగా వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. హౌరా-మాల్డా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధిత యువకుడ్ని సజల్ షేక్‌గా గుర్తించారు. ఘటన అనంతరం ట్రాక్ పక్కన గాయాలతో స్పృహ కోల్పోయి పడి ఉన్న సజల్ షేక్‌ను గవర్నమెంట్ రైల్వే పోలీసులు చూసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒక్కరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే యువకుడు తోటి ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించాడని, సీటుపై కాలు పెట్టినట్లు తెలుస్తోంది. మహిళలతో దురుసుగా మాట్లాడాడని ఆ కంపార్ట్మెంట్లోని తోటి ప్రయాణికులు కొందరు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు షేక్ తమను బెదిరించాడని కూడా వారు ఆరోపించారని చెప్పారు. బాధిత యువకుడి స్టేట్మెంట్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. కాంపార్ట్‌మెంట్‌లో ఓ గుంపు గట్టిగా మాట్లాడుతూ, అరుస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టిందని, పక్కన ఫ్యామిలీలు ఉన్నా పట్టించుకోకుండా అలాగే ప్రవర్తించారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే వాళ్లతో తాను గొడవపడినట్లు చెప్పాడు. ఓ ప్రయాణికుడ్ని బెదిరించేందుకు తన వద్ద ఉన్న బ్లేడు తీసినట్లు ఒప్పుకున్నాడు. అయితే గొడవ జరిగినప్పుడు అవతలి వ్యక్తి తనను రైలు నుంచి కిందకు తోసేస్తాడని ఊహించలేదని, క్షణాల్లోనే అంతా జరిగిపోయిందని చెప్పాడు. కిందపడ్డాక షాక్‌లో తాను స్పృహ కోల్పోయానని పేర్కొన్నాడు. చదవండి: కేదార్‌నాథ్‌లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు దుర్మరణం -
గర్భిణిని కదులుతున్న ట్రైన్ నుంచి తోసేశారు
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు బిహార్ యువకులు నాలుగు నెలల గర్భిణిని నడుస్తున్న ట్రైన్లో నుంచి కిందకు తోసేశారు. జిల్లాలోని ఏలూరు పవర్‌పేట స్టేషన్ వద్ద ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యను కిందకు తోసేయడంతో ఆమె భర్త కూడా ట్రైన్లో నుంచి బయటకు దూకారు. కిందపడి తలకి గాయాలైన భార్యను ఆమె భర్త స్థానికుల సహాయంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలి భర్త మాట్లాడుతూ.. తాము సికింద్రాబాద్ నుంచి పశ్చిమబెంగాల్ వెళ్తున్నట్టు పేర్కొన్నారు. తన భార్యను వేధించిన బిహార్ యువకులు ఆమెను ట్రైన్లో నుంచి తోసివేసినట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫెన్సింగ్ చాంపియన్‌ను రైల్లోంచి తోసి..
న్యూఢిల్లీ: రైల్వే పోలీసు కక్కుర్తి ఓ జాతీయ అథ్లెట్ ప్రాణాలు తీసింది. లంఛం ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫెన్సింగ్ చాంపియన్ హోషియార్ సింగ్‌ను రైల్వే పోలీసు కదులుతున్న రైళ్లో నుంచి తోసివేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. కాగా, పోలీసులు మాత్రం మంచినీళ్ల కోసం కిందికి దిగి కదులుతున్న రైల్లోంచి ఎక్కే ప్రయత్నం చేస్తుండటంతో కాలు జారి కిందపడి మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలుకోల్పోయాడని ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం మధుర వెళ్లి హోషియార్ సింగ్ తన సొంతగ్రామం కాస్ గంజ్ తల్లి భార్యతో తిరిగొస్తుండగా వారిద్దరిని లేడీస్ కోచ్‌లో కూర్చొబెట్టి తాను వేరే బోగిలో కూర్చున్నాడు. మధ్యలో తన భార్యకు ఒంట్లో బాగాలేదని చెప్పడంతో లేడీస్ బోగీలోకి వచ్చాడు. అదే సమయంలో అందులోకి వచ్చిన ఆర్టీఎఫ్ పోలీసు రూ.200 ఇస్తేనే బోగిలో ఉండేందుకు అనుమతిస్తానన్నాడు. కానీ, అందుకు అతడు నిరాకరించడంతో బలవంతంగా కిందికి దింపేందుకు ప్రయత్నించి వచ్చేస్టేషన్ వరకు కూడా ఎదురుచూడకుండా తోసేశాడు. దీంతో హోషియార్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.