ఫెన్సింగ్ చాంపియన్ను రైల్లోంచి తోసి.. | Fencing Champion Dies After Allegedly Being Thrown Off Train by Railway Police | Sakshi
Sakshi News home page

ఫెన్సింగ్ చాంపియన్ను రైల్లోంచి తోసి..

Published Fri, Jul 24 2015 8:44 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

ఫెన్సింగ్ చాంపియన్ను రైల్లోంచి తోసి.. - Sakshi

ఫెన్సింగ్ చాంపియన్ను రైల్లోంచి తోసి..

న్యూఢిల్లీ: రైల్వే పోలీసు కక్కుర్తి ఓ జాతీయ అథ్లెట్ ప్రాణాలు తీసింది. లంఛం ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉత్తరప్రదేశ్కు చెందిన ఫెన్సింగ్ చాంపియన్ హోషియార్ సింగ్ను రైల్వే పోలీసు కదులుతున్న రైళ్లో నుంచి తోసివేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. కాగా, పోలీసులు మాత్రం మంచినీళ్ల కోసం కిందికి దిగి కదులుతున్న రైల్లోంచి ఎక్కే ప్రయత్నం చేస్తుండటంతో కాలు జారి కిందపడి మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలుకోల్పోయాడని ఆరోపిస్తున్నారు.

కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం మధుర వెళ్లి హోషియార్ సింగ్ తన సొంతగ్రామం కాస్ గంజ్ తల్లి భార్యతో తిరిగొస్తుండగా వారిద్దరిని లేడీస్ కోచ్లో కూర్చొబెట్టి తాను వేరే బోగిలో కూర్చున్నాడు. మధ్యలో తన భార్యకు ఒంట్లో బాగాలేదని చెప్పడంతో లేడీస్ బోగీలోకి వచ్చాడు. అదే సమయంలో అందులోకి వచ్చిన ఆర్టీఎఫ్ పోలీసు రూ.200 ఇస్తేనే బోగిలో ఉండేందుకు అనుమతిస్తానన్నాడు. కానీ, అందుకు అతడు నిరాకరించడంతో బలవంతంగా కిందికి దింపేందుకు ప్రయత్నించి వచ్చేస్టేషన్ వరకు కూడా ఎదురుచూడకుండా తోసేశాడు. దీంతో హోషియార్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement