పోలీసుల బాహాబాహీ.. వీడియో వైరల్ | Railway Policeman and UP Police beat each other | Sakshi
Sakshi News home page

పోలీసుల ముష్టియుద్ధం.. వీడియో వైరల్

Published Fri, May 19 2017 11:57 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

పోలీసుల బాహాబాహీ.. వీడియో వైరల్ - Sakshi

పోలీసుల బాహాబాహీ.. వీడియో వైరల్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండు విభాగాలకు చెందిన ఇద్దరు పోలీసులు గొడవపడి పరస్పరం ముష్టిఘాతాలతో చెలరేగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే గొడవకు కారణం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.ఈ ఘటన గురువారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లోని మౌ రైల్వేష్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. జాతీయ మీడియా ఏజెన్సీ వివరాల ప్రకారం.. ఓ రైలులో ఉత్తరప్రదేశ్ పోలీసు, రైల్వే పోలీసు ప్రయాణిస్తున్నారు. వీళ్లు ఓ ఖైదీని వారణాసి నుంచి రైలులో తీసుకొస్తున్నారు. రైలు మౌ స్టేషన్ సమీపానికి రాగానే ఆ కంపార్ట్‌మెంట్లో గందరగోళం నెలకొంది.

ఆ ఖైదీ తప్పించుకునేందుకు పోలీసుల కళ్లుగప్పి రైలు దిగాడు. వెంటనే యూపీ పోలీసు ఖైదీని పట్టుకునేందుకు బయలుదేరుతున్న రైల్లోంచి దూకే యత్నం చేశాడు. ఇంతలోనే రైల్వే పోలీసు జనరల్ పోలీసును అడ్డుకుని వద్దని వారించాడు. క్షణాల్లో రైల్వే పోలీసు జనరల్ పోలీసును కొట్టడం మొదలుపెట్టాడు. ఆపై యూపీ పోలీసు తిరగబడి రైల్వే పోలీసు దాడిని అడ్డుకుని అతడిని కొట్టాడు. ఇంతలో ఓ వ్యక్తి చైన్ లాగేసరికి రైలు ఆగింది. అక్కడే ఉన్న ఓవ్యక్తి సెల్‌ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి విషయం వెళ్లి సీరియస్ అయ్యారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఖైదీ విషయంలో గొడవపడ్డట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement