THUMMALA papireddi
-
ఈసెట్–2019 షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ల్యాటరల్ ఎంట్రీ ద్వారా బీఈ/బీటెక్/బీఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్–2019 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 5న నోటిఫికేషన్ విడుదల కానుంది. శనివారం జేఎన్టీయూలో సెట్ కమిటీ సమావేశం జరిగింది. టీఎస్సీహెచ్ఈ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, సెట్ కన్వీనర్ గోవర్ధన్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈసెట్‌ను సీబీటీ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసెట్ రిజిస్ట్రేషన్‌ను టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా చేసుకోవాలన్నారు. ఈసెట్ షెడ్యూల్... నోటిఫికేషన్ విడుదల తేదీ: మార్చి 05 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలు మార్చి 06 దరఖాస్తుల స్వీకరణ గడువు ఏప్రిల్ 08 దరఖాస్తులో తప్పుల సవరణ ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 ఫీజు వివరాలు: ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ.800 రూ.500 అపరాధ రుసుముతో గడువు ఏప్రిల్ 15 రూ.1,000 అపరాధ రుసుముతో గడువు ఏప్రిల్ 22 రూ.5,000 అపరాధ రుసుముతో గడువు ఏప్రిల్ 29 రూ.10,000 అపరాధ రుసుముతో గడువు మే 06 హాల్‌టికెట్లు డౌన్లోడ్ గడువు మే 4 నుంచి 9వ తేదీ వరకు పరీక్ష తేదీ: మే 11న సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు -
ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూలు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఎంసెట్ ప్రవేశాల కమిటీ షెడ్యూలు ఖరారు చేసింది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన సెట్ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశంలో మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ పాల్గొన్నారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను ఈనెల 24న https://tseamcet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. 2017లో ఏ ర్యాంకు వారికి ఏయే కాలేజీల్లో సీట్లు వచ్చాయో తెలుసుకునేందుకు, తల్లిదండ్రులు విద్యార్థుల అంచనా కోసం సంబంధిత వివరాలను www.tsche.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ వివరాలతో పాటు కాలేజీల వారీగా ఉన్న సీట్ల వివరాలను ఈనెల 24న వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సీబీఎస్ఈ విద్యార్థులకు 25 తర్వాతే ర్యాంకులు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్ స్కూళ్లలో 12వ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఈ నెల 25 తర్వాతే ఇంజనీరింగ్ ప్రవేశాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. వారికి ఈ నెల 19న ఎంసెట్ ర్యాంకులు ప్రకటించట్లేదని తెలిపింది. వారి ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఫలితాలొచ్చాక 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంసెట్ కమిటీకి తమ మార్కుల మెమోలు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత వారి మార్కులకు వెయిటేజీ ఇచ్చి, జేఎన్టీయూ ర్యాంకు ఖరారు చేస్తుంది. వారి ర్యాంకులు ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి వచ్చాక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్ ప్రవేశాలను మూడు దశల్లో చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఇప్పటివరకు రెండు దశల్లో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్న సాంకేతిక విద్యా శాఖ ఈసారి మూడో దశను కూడా నిర్వహించనుంది. జేఈఈ ప్రవేశాలు పూర్తయ్యాక మిగిలిపోయే విద్యార్థులను పరిగణనలోకి తీసుకునేందుకు మూడో దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించనుంది. ఈసారి ఇంటర్నల్ స్లైడింగ్‌ను కూడా ప్రవేశాల కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించనుంది. విద్యార్థులకు సీట్లు వచ్చిన కాలేజీల్లోనే బ్రాంచీ మార్చుకునే అవకాశాన్ని కల్పించనుంది. విద్యార్థులకు ప్రత్యేకంగా ఆప్షన్లకు అవకాశం కల్పించి సంబంధిత కాలేజీల్లో విద్యార్థులు కోరుకునే బ్రాంచీల్లో సీట్లు ఉంటే వాటిని కేటాయించనుంది. గతంలో కాలేజీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ ఉన్నా ఆ ప్రక్రియను కాలేజీలే చేసేవి. అయితే అలా బ్రాంచి మారిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది కాదు. ప్రవేశాల కౌన్సెలింగ్ ఫీజు ఈసారి స్వల్పంగా పెంచింది. గతేడాది ఎస్సీ, ఎస్టీలకు రూ. 500 ఉంటే ఈసారి రూ.600 చేసింది. ఇతర విద్యార్థులకు గతేడాది రూ.1000 ఉంటే ఈసారి రూ.1200కు పెంచింది. ఇదీ ప్రవేశాల షెడ్యూలు 25–5–2018 నుంచి 2–6–2018 వరకు: ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు 28–5–2018 నుంచి 3–6–2018 వరకు: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 28–5–2018 నుంచి 5–6–2018 వరకు: వెబ్ ఆప్షన్లకు అవకాశం 5–6–2018: వెబ్ ఆప్షన్ల గడువు పూర్తి 8–6–2018: మొదటి దశ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ 8–6–2018 నుంచి 12–6–2018 వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ రిపోర్టింగ్ -
విద్యార్థులతో చెలగాటం!
⇒ మొన్న బీఎడ్ రెండో దశ కౌన్సెలింగ్ విషయంలో పట్టు ⇒ ఇప్పుడు ఎంసెట్, ఐసెట్, లాసెట్ దరఖాస్తుల అంశంలోనూ అదే తీరు ⇒ సర్వీసు ప్రొవైడర్ ఎంపికలో వివాదాలు ⇒ ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించేలా ఒత్తిళ్లతోనే జాప్యం? ⇒ సకాలంలో నిర్ణయం తీసుకోక దరఖాస్తుల స్వీకరణ వాయిదా ⇒ ఆందోళనలో విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు అంశాల్లో పట్టుదలకు పోయి ప్రవేశాల ప్రక్రియల్లో జాప్యం కావడానికి కారణమవు తోందనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. మొన్నటికి మొన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) రెండో దశ కౌన్సెలింగ్ విషయంలో పట్టుదలతో వ్యవహరించిన ఉన్నత విద్యా శాఖ.. ఇప్పుడు ఎంసెట్, ఐసెట్, లాసెట్ తదితర ఉమ్మడి ప్రవేశపరీక్షలను ఆన్లైన్ ప్రాసెస్ చేసే సర్వీసు ప్రొవైడర్ ఎంపికలో మొండిగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. అందువల్లే ఈనెల 3 నుంచి చేపట్టాల్సిన ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ ఆగిపోయిందని, ఎంసెట్ ప్రక్రియ మొదలే కాలేదని చెబుతున్నారు. ఇక 4వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన లాసెట్ దరఖాస్తుల స్వీకరణనూ అధికారులు నిలిపివేశారు. మిగతా ప్రవేశపరీక్షలదీ ఇదే పరిస్థితి. సర్వీసు ప్రొవైడర్ సమస్యతో.. ప్రవేశ పరీక్షలకు సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక అంశంపై వివాదం కొనసాగుతోంది. ఉన్నత విద్యా మండలి కొందరు సర్వీసు ప్రొవైడర్లను పిలిచి పని అప్పగించాలని నిర్ణయించింది. అయితే దీనిపై తమకు కొందరు సర్వీసు ప్రొవైడర్లు ఫిర్యాదు చేశారని, అసలు ఎలా సర్వీసు ప్రొవైడర్‌ను ఎంపిక చేస్తున్నారని సెట్స్ కన్వీనర్ల కమిటీ, ఉన్నత విద్యా మండలిలను ఉన్నత విద్యాశాఖ ప్రశ్నించింది. దీంతో తాము పాత పద్ధతినే అనుసరిస్తున్నామని, కాన్ఫిడెన్షియల్ వర్క్ కావడం, విద్యార్థులతో ముడిపడిన అంశమైనందున నమ్మకమైన వారిని, నిబంధనల ప్రకారమే ఎంపిక చేస్తున్నామని ఉన్నత విద్యా మండలి వివరణ ఇచ్చింది. అయినా ఈ అంశంలో ఏం చేయమంటారో తేల్చాలని కోరుతూ ఉన్నత విద్యా శాఖకు లేఖ రాసింది. ఇది గడిచి వారం దాటుతున్నా ఉన్నత విద్యా శాఖ ఏమీ తేల్చలేదు. పైగా దీనిపై ఐటీ శాఖ అభిప్రాయం కోరింది. అయితే అప్పటికే ఐసెట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఎంసెట్ నోటిఫికేషన్ జారీకి తేదీని కూడా ప్రకటించారు. ఈ రెండింటికి మార్చి 3వ తేదీ నుంచి, లాసెట్‌కు 4వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉందన్న అంశం తెలిసినా కూడా ఉన్నత విద్యాశాఖ త్వరగా తేల్చలేదు. దాంతో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకాక విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. త్వరగా తేల్చకపోతే మే 12న ఎంసెట్, 18న ఐసెట్ నిర్వహణ తేదీలపైనా ప్రభావం పడే అవకాశముంది. టీఎస్ ఆన్లైన్ ఒత్తిడి మేరకేనా? ప్రభుత్వపరంగా ఆన్లైన్ సర్వీసులను అందించేందుకు టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ సంస్థలు ఉన్నాయి. టీఎస్ ఆన్లైన్ ఈ పనులను తీసుకుని 5 శాతం కమీషన్‌పై మరో ప్రైవేటు సంస్థకు అప్పగిస్తుందన్నది బహిరంగ రహస్యమే. అయితే ఈసారి సెట్స్కన్వీనర్ల కమిటీ మరో సర్వీసు ప్రొవైడర్‌ను ఎంపిక చేసింది. దాంతో తాము ఇచ్చే ప్రైవేటు సంస్థకు పనులను అప్పగించాలంటూ ఉన్నత విద్యాశాఖపై టీఎస్ ఆన్లైన్ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆ ప్రైవేటు సంస్థ ఒక్కో విద్యార్థికి సంబంధించిన వివరాలు ప్రాసెస్ చేసేందుకు రూ.320 అడిగితే.. కన్వీనర్ల కమిటీ ఎంపిక చేసిన సర్వీసు ప్రొవైడర్ ఒక్కో విద్యార్థికి సంబంధించిన ప్రాసెస్ సేవలను రూ.250కే అందజేసేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అధిక ధర కోట్ చేసిన ప్రైవేటు సంస్థకు సెట్స్ పనులు దక్కేలా చేసేందుకే.. సర్వీసు ప్రొవైడర్ ఎంపిక విషయాన్ని వివాదంగా మార్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో అధికారుల తీరు ఎలా ఉన్నా విద్యార్థులు మాత్రం ఆందోళనలో మునిగిపోయే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ వర్గాలే విమర్శిస్తుండడం గమనార్హం. త్వరగానే తేల్చుతాం: పాపిరెడ్డి సర్వీసు ప్రొవైడర్ ఎంపిక విషయాన్ని త్వరగా తేల్చుతామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యతో చర్చించి నిర్ణయం తీసు కుంటామని తెలిపారు. ముందుగా ప్రకటిం చిన పరీక్ష తేదీలను మార్చే అవసరం రాకుండా ప్రయత్నిస్తామని వెల్లడించారు. -
ఎంసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
ఈ నెల 30 వరకు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ దరఖాస్తుల గడువును రెండ్రోజుల పాటు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఈ నెల 28తో ఆలస్య రుసుము లేకుండా చేసుకునే దరఖాస్తుల గడువు ముగిసిందని, అయితే విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. ప్రస్తుత మార్పు నేపథ్యంలో రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువును ఈ నెల 31 నుంచి అమలు చేస్తామన్నారు. 2.36 లక్షలు దాటిన దరఖాస్తులు సోమవారం వరకు 2,36,654 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ కోసం 1,37,635 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం 97,077 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది కంటే ఈసారి అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇందులో తెలంగాణ నుంచి 63,878 మంది దరఖాస్తు చేసుకోగా, ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి 33,199 మంది దరఖాస్తు చేసుకున్నారు. గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి శేషుకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.