విద్యార్థులతో చెలగాటం! | Games with students | Sakshi
Sakshi News home page

విద్యార్థులతో చెలగాటం!

Published Sat, Mar 4 2017 3:29 AM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

విద్యార్థులతో చెలగాటం!

విద్యార్థులతో చెలగాటం!

మొన్న బీఎడ్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ విషయంలో పట్టు
ఇప్పుడు ఎంసెట్, ఐసెట్, లాసెట్‌ దరఖాస్తుల అంశంలోనూ అదే తీరు
సర్వీసు ప్రొవైడర్‌ ఎంపికలో వివాదాలు
ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించేలా ఒత్తిళ్లతోనే జాప్యం?
సకాలంలో నిర్ణయం తీసుకోక దరఖాస్తుల స్వీకరణ వాయిదా
ఆందోళనలో విద్యార్థులు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు అంశాల్లో పట్టుదలకు పోయి ప్రవేశాల ప్రక్రియల్లో జాప్యం కావడానికి కారణమవు తోందనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. మొన్నటికి మొన్న బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) రెండో దశ కౌన్సెలింగ్‌ విషయంలో పట్టుదలతో వ్యవహరించిన ఉన్నత విద్యా శాఖ.. ఇప్పుడు ఎంసెట్, ఐసెట్, లాసెట్‌ తదితర ఉమ్మడి ప్రవేశపరీక్షలను ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ చేసే సర్వీసు ప్రొవైడర్‌ ఎంపికలో మొండిగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. అందువల్లే ఈనెల 3 నుంచి చేపట్టాల్సిన ఐసెట్‌ దరఖాస్తుల స్వీకరణ ఆగిపోయిందని, ఎంసెట్‌ ప్రక్రియ మొదలే కాలేదని చెబుతున్నారు. ఇక 4వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన లాసెట్‌ దరఖాస్తుల స్వీకరణనూ అధికారులు నిలిపివేశారు. మిగతా ప్రవేశపరీక్షలదీ ఇదే పరిస్థితి.

సర్వీసు ప్రొవైడర్‌ సమస్యతో..
ప్రవేశ పరీక్షలకు సర్వీస్‌ ప్రొవైడర్‌ ఎంపిక అంశంపై వివాదం కొనసాగుతోంది. ఉన్నత విద్యా మండలి కొందరు సర్వీసు ప్రొవైడర్లను పిలిచి పని అప్పగించాలని నిర్ణయించింది. అయితే దీనిపై తమకు కొందరు సర్వీసు ప్రొవైడర్లు ఫిర్యాదు చేశారని, అసలు ఎలా సర్వీసు ప్రొవైడర్‌ను ఎంపిక చేస్తున్నారని సెట్స్‌ కన్వీనర్ల కమిటీ, ఉన్నత విద్యా మండలిలను ఉన్నత విద్యాశాఖ ప్రశ్నించింది. దీంతో తాము పాత పద్ధతినే అనుసరిస్తున్నామని, కాన్ఫిడెన్షియల్‌ వర్క్‌ కావడం, విద్యార్థులతో ముడిపడిన అంశమైనందున నమ్మకమైన వారిని, నిబంధనల ప్రకారమే ఎంపిక చేస్తున్నామని ఉన్నత విద్యా మండలి వివరణ ఇచ్చింది.

అయినా ఈ అంశంలో ఏం చేయమంటారో తేల్చాలని కోరుతూ ఉన్నత విద్యా శాఖకు లేఖ రాసింది. ఇది గడిచి వారం దాటుతున్నా ఉన్నత విద్యా శాఖ ఏమీ తేల్చలేదు. పైగా దీనిపై ఐటీ శాఖ అభిప్రాయం కోరింది. అయితే అప్పటికే ఐసెట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. ఎంసెట్‌ నోటిఫికేషన్‌ జారీకి తేదీని కూడా ప్రకటించారు. ఈ రెండింటికి మార్చి 3వ తేదీ నుంచి, లాసెట్‌కు 4వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉందన్న అంశం తెలిసినా కూడా ఉన్నత విద్యాశాఖ త్వరగా తేల్చలేదు. దాంతో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకాక విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. త్వరగా తేల్చకపోతే మే 12న ఎంసెట్, 18న ఐసెట్‌ నిర్వహణ తేదీలపైనా ప్రభావం పడే అవకాశముంది.

టీఎస్‌ ఆన్‌లైన్‌ ఒత్తిడి మేరకేనా?
ప్రభుత్వపరంగా ఆన్‌లైన్‌ సర్వీసులను అందించేందుకు టీఎస్‌ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్‌ సంస్థలు ఉన్నాయి. టీఎస్‌ ఆన్‌లైన్‌ ఈ పనులను తీసుకుని 5 శాతం కమీషన్‌పై మరో ప్రైవేటు సంస్థకు అప్పగిస్తుందన్నది బహిరంగ రహస్యమే. అయితే ఈసారి సెట్స్‌కన్వీనర్ల కమిటీ మరో సర్వీసు ప్రొవైడర్‌ను ఎంపిక చేసింది. దాంతో తాము ఇచ్చే ప్రైవేటు సంస్థకు పనులను అప్పగించాలంటూ ఉన్నత విద్యాశాఖపై టీఎస్‌ ఆన్‌లైన్‌ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆ ప్రైవేటు సంస్థ ఒక్కో విద్యార్థికి సంబంధించిన వివరాలు ప్రాసెస్‌ చేసేందుకు రూ.320 అడిగితే.. కన్వీనర్ల కమిటీ ఎంపిక చేసిన సర్వీసు ప్రొవైడర్‌ ఒక్కో విద్యార్థికి సంబంధించిన ప్రాసెస్‌ సేవలను రూ.250కే అందజేసేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అధిక ధర కోట్‌ చేసిన ప్రైవేటు సంస్థకు సెట్స్‌ పనులు దక్కేలా చేసేందుకే.. సర్వీసు ప్రొవైడర్‌ ఎంపిక విషయాన్ని వివాదంగా మార్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో అధికారుల తీరు ఎలా ఉన్నా విద్యార్థులు మాత్రం ఆందోళనలో మునిగిపోయే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ వర్గాలే విమర్శిస్తుండడం గమనార్హం.

త్వరగానే తేల్చుతాం: పాపిరెడ్డి
సర్వీసు ప్రొవైడర్‌ ఎంపిక విషయాన్ని త్వరగా తేల్చుతామని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్యతో చర్చించి నిర్ణయం తీసు కుంటామని తెలిపారు. ముందుగా ప్రకటిం చిన పరీక్ష తేదీలను మార్చే అవసరం రాకుండా ప్రయత్నిస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement