Thyagaraja Temple
-
వైభవంగా టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024
టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 అమెరికాలో వైభవంగా జరిగింది. అలెన్‌లోని రాధా కృష్ణ టెంపుల్లో జరిగిన ఆరాధన కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు, గురువులు, విద్యార్థులు పాల్గొని త్యాగరాజ కీర్తనలను ఆలపించారు. సంగీత విద్వాంసులు కలిసి త్యాగరాజ స్వామి రచించిన ఘన రాగ పంచరత్న కృతులను, గాత్రం, వేణువు, వీణ, వయోలిన్, మృదంగం వంటి వాద్య సహకారంతో కీర్తిస్తూ మనసులను రంజింప చేశారు. పంతుల రమ త్యాగరాజ స్వామికి గళార్చన చేసి.. తన గ్రాతంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. ఎఎస్ఎన్ మూర్తి, పత్రి సతీష్ కుమార్, గురువులు, విద్యార్థులచే వయోలిన్, గాత్ర కచేరీ కార్యక్రమం వీనులవిందుగా కొనసాగింది. సంగీతాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. టెక్సాస్ త్యాగరాజ ఆరాధన 2024 కార్యక్రమం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని సంగీత అభిమానులు కొనియాడారు. త్యాగరాజ కీర్తనలు భక్తి పారవశ్యంలో ఓలలాడించాయి అని తెలిపారు. టెక్సాస్‌లోని ఇండియన్ ఆక్టేవ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!) -
ఆగిన పెళ్లి
తిరువొత్తియూరు: తాళి కట్టే సమయానికి వధువు వివాహానికి తిరస్కరించడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన తిరుపోరూరులో చోటుచేసుకుంది. కేళంబాక్కం, మాంబాకంకు చెందిన వనిత. ఈమెకు నావలూర్ సమీపంలో ఉన్న తాళంపూరుకు చెందిన ప్రభుత్వ బస్సు కండక్టర్‌తో ఆదివారం వివాహం జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం తిరుపోరూరు నార్త్ మాడ వీధిలో ఉన్న వివాహ మండపంలో వధువు ఆహ్వాన కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో వనిత తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిపింది. ఈ మాటలను ఆమె తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ముహూర్త సమయం దగ్గరపడుతున్న సమయంలో పెళ్లి పీఠలపై వరుడు కూర్చొని ఉన్నాడు. వధువును తీసుకుని రావడానికి బంధువులు, స్నేహితులు పెళ్లి కుమార్తె గదికి వెళ్లారు. కాని అక్కడ నుంచి పెండ్లి పీఠలపైకి వచ్చి కూర్చోవడానికి వనిత తిరస్కరించింది. తనకు వివాహం వద్దని ఏడ్చింది. ఈ సంగతి తెలుసుకున్న పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, బంధువులు వనితతో రెండు గంటలు సమయం మాట్లాడి సమాధానం చేసినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వివాహానికి చేసిన ఖర్చు మొత్తం ఇవ్వడానికి వధువు పెద్దలు అంగీకరించారు.