tiff
-
టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అనురాగ్ కశ్యప్ మూవీ
‘మల్లేశం’దర్శకుడు రాజ్ రాచకొండ... బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కలిసి నిర్మించిన మలయాళం సినిమా ‘పాక’. తెలుగులో ‘మల్లేశం’ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్ రాచకొండ ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి ‘పాక - ది రివర్ అఫ్ బ్లడ్’ అనే మలయాళ చిత్రాన్ని నిర్మించారు. మల్లేశం చిత్రానికి సౌండ్ డిజైనర్‌గా పనిచేసిన నితిన్ కోసి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించటానికి ఎన్నికవ్వడం విశేషం. ఈ సందర్బంగా నిర్మాత రాజ్ రాచకొండ మాట్లాడుతూ.. ‘మల్లేశం చిత్రానికి నా టీం చాలా సహాయం చేసింది. నా టీంతో ఒక చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నాను. వాళ్ళు చేసిన నాలుగు కథలలో నాకు పాక కథ బాగా నచ్చింది. ప్రేమ, క్రూరత్వం గురించి భావోద్వేగాలను ప్రదర్శించే లోతైన కథ. తరచూ గొడవలుపడే రెండు కుటుంబాలలోంచి పుట్టుకొచ్చిన ఒక ప్రేమ జంట కథే పాక. మా చిత్రాన్ని ఉత్తర కేరళలోని వయనాడ్‌లో చిత్రీకరించాము. బేసిల్ పౌలోస్, వినీత కోశాయ్, జోస్ కిజక్కన్, అత్తుల్ జాన్, నితిన్ జార్జ్, జోసెఫ్ మాణికల్ వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోచించారు. సెప్టెంబర్ 13న 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF)లో ప్రదర్శింపబడుతోంది’ఆయన తెలిపారు. -
మహిళా సంఘం నేత దారుణ హత్య
మహారాష్ట్రలొ మహిళా సంఘం నేత హత్యోదంతం కలకలం రేపింది. స్వల్ప వివాదం కారణంగానే మహిళ ఎన్‌సిపి కార్యకర్త, స్థానికంగా మహిళా హక్కులకోసం పనిచేస్తున్న మహిళా సంఘం నేత రేఖ భూసాహెబ్ జారేపై సోమవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎటాక్ చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం బాధితురాలు రేఖ పూణే నుంచి అహ్మద్‌నగర్‌కు కారులో వెళుతున్నారు. ఆమెతోపాటు, తల్లి, కొడుకు, స్నేహితుడు కూడా కారులో ఉన్నారు. ఈ క్రమంలో ఒక బైక్‌ను క్రాస్ చేసిన ముందుకెళ్లడమే ఆమె చేసిన నేరం. ఆగ్రహంతో రగిలిపోయిన ఇద్దరు నిందితులు తమ బైక్‌వేగం పెంచి కారుకంటే ముందుకు దూసుకెళ్లారు. రోడ్డు మధ్యలో బైక్ నిలిపి ఈమెను అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. కారులోని ఇతర కుటుంబ సభ్యులు జోక్యం చేసుకొని, సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఇంతలోనే ఒక దుండగులు అకస్మాత్తుగా కత్తి దూసి, రేఖ గొంతు కోసి అక్కడినుంచి ఉడాయించారు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. హుటాహుటిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా ఈ ఘటనలో అహ్మద్‌నగర్ సుపా పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదైందని, ఈ దాడి వెనుక ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు అధికారి వెల్లడించారు. -
అవన్నీ చెత్త వార్తలు: హృతిక్ రోషన్
ముంబై: సల్మాన్ ఖాన్ తో తనకు విభేదాలున్నాయని వచ్చిన వార్తలను హృతిక్ రోషన్ తోసిపుచ్చాడు. తమకు తగాదాలున్నట్టు రాసిన వార్తల్లో వాస్తవం లేదన్నాడు. మాడ్రిడ్ లో జరిగిన ఇంటర్నేషనల్ అవార్డుల ప్రదానోత్సంలో సల్మాన్, హృతిక మధ్య విభేదాలు తలెత్తినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో తన పక్కన డాన్స్ చేసేందుకు మహిళా డాన్సర్ అవసరమైంది. తన స్నేహితురాలు, నటి డైసీ షాను పేరును సల్మాన్ సూచించగా, హృతిక్ తిరస్కరించాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇందులో ఏమాత్రం నిజం లేదని హృతిక్ తెలిపాడు. ‘మా గురించి రాసిందంతా అబద్దం. ఇవన్నీ చెత్తరాతలు. సల్మాన్, నేను నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటామ’ని హృతిక్ చెప్పాడు. తన కోసం సల్మాన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ’సుల్తాన్’ సినిమా షో చూడాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. విదేశాల్లో ఉండడం వల్ల ‘సుల్తాన్’ సినిమా చూడలేకపోయానని తెలిపాడు. దీంతో తన కోసం సల్మాన్ ఖాన్ ప్రత్యేక షో ఏర్పాటు చేశాడని చెప్పాడు.