tiger fighting
-
రెండు పులులు కొట్లాట.. వీడియో వైరల్
సాక్షి, బెంగళూరు : జంతువులను వెంటాడి చంపి చీల్చుకొని తినడం పులుల నైజం. ఇలాంటి వీడియోలను మనం ఎన్నో చూశాం కూడా. కానీ ఒకేజాతికి చెందిన రెండు పులులు కొట్లాడటం ఎప్పుడైనా చూశారా? బహుశా ఎవరూ చూసి ఉండరు అనుకుంటా. అలాంటి అరుదైన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని బన్నర్‌ఘట్ట బయోలాజికల్ పార్క్‌లో రెండు పులులు ఒకదానిపూ ఒకటి దాడికి దిగాయి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా ట్విటర్లో షేర్ చేస్తూ.. 'ఈ ప్రపంచంలో మానవ సంబంధం ఈ కంచె వలె బలంగా ఉంటే'..అనే శీర్షికను జోడించారు. 45 సెకండ్లపాటు నడిచే ఈ వీడియోలో కంచెకు ఇరువైపుల ఉన్న సఫారీ టైగర్, వైల్డ్ టైగర్ పెద్దగా గాండ్రిస్తూ దాడికి దిగాయి. ఈ వీడియో మొదటిసారి 2019లో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీన్ని మరలా సుశాంత్ షేర్ చేయగా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
రెండు పులులు కొట్లాట.. వీడియో వైరల్
-
ఆడపులి కోసం భీకర పోరు
మాములుగా ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చూసుంటాం. కానీ రెండు మగ పులులు(అందులో అవి సోదరులు).. ఒక ఆడ పులి కోసం భీకర పోరుకు దిగిడం ఎప్పుడైనా చూశారా?. ఇలాంటి ఘటనే రాజస్తాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్క్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రణతంబోర్ షర్మిలి అనే అడపులికి సింగ్‌స్థ్(టీ57), రాకీ (టీ58) అనే రెండు మగ పులులు జన్మించాయి. అయితే ఇటీవల ఈ రెండు క్రూరంగా ఒకదానిపై ఒకటి దాడికి పాల్పడ్డాయి. వాటి మధ్య గొడవ ప్రారంభం అవగానే ఓ ఆడపులి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. అయితే ఈ రెండు పులులు మాత్రం ఒకదానిపై మరోకటి తీవ్రంగా దాడి చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ బుధవారం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో.. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారని చెప్పాలంటూ ప్రవీణ్‌ను కోరారు. దీనిపై స్పందించిన ప్రవీణ్.. ‘ఈ యుద్ధంలో టీ57 గెలిచింది. ఈ యుద్ధంలో రెండింటికి కూడా ప్రమాదకర గాయాలు కాలేదు. అవి రెండు నూర్(టీ39) అనే ఆడపులి కోసం గొడవకు దిగాయి. రెండు మగ పులలు మధ్య గొడవ ప్రారంభం అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆడపులే నూర్’ అని తెలిపారు. -
ఆడపులి కోసం మగ పులుల భీకర పోరు
-
సంతానం ఇస్తుందనుకుంటే... చంపేసింది!!
సంతాన భాగ్యం కల్పిస్తుందని ఎక్కడినుంచో తీసుకొచ్చిన ఓ మగపులి.. ఢిల్లీ జూలోని ఓ ఆడపులిని చంపేసింది. మైసూరు జూ నుంచి ఢిల్లీ జూలో ఉన్న ఆడ పులుల కోసం తీసుకొచ్చిన మగపులి ఈ దారుణానికి పాల్పడింది. జిన్జిన్ అనే పదేళ్ల వయసున్న రాయల్ బెంగాల్ పులిని ఇది చంపేసింది. ఈ రెండింటినీ కలిపి అధికారులు ఒక ఎన్‌క్లోజర్‌లోకి పంపారు. తీరా అక్కడికెళ్లిన తర్వాత ఈ మగపులి సరసానికి బదులు పోరాటానికి దిగింది. జూ సిబ్బంది ఈ విషయాన్ని గమనించి, ఈ రెండింటి మధ్య పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నించారు గానీ ఫలితం లేకపోయింది. ఎలాగోలా జిన్జిన్ను దొరకపట్టుకుని చంపేసింది. దీంతో ఇక ఢిల్లీ జూలో ఐదు పులులు మాత్రమే మిగిలాయని జిమ్ క్యూరేటర్ రియాజ్ ఖాన్ తెలిపారు. అడవుల్లో ఇలాంటి సంఘటనలు మామూలేనని, పులుల మధ్య పోరాటాలు జరుగుతాయని, కానీ జూలలో మాత్రం ఇలా జరగడం ఇదే మొదలని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ జూలో రెండు ఆడ, మూడు మగ రాయల్ బెంగాల్ పులులున్నాయి. ఇవి కాక మరో ఆరు తెల్ల పులులు ఉన్నాయి. ఇటీవలే జూల మధ్య జంతువుల బదిలీ కార్యక్రమంలో భాగంగా ఓ ఆడ తెల్ల పులిని, మరికొన్ని జంతువులను తిరువనంతపురం జూకు పంపారు.