రెండు పులులు కొట్లాట.. వీడియో వైరల్‌ | Watch: A Fight Between A Wild Tiger And A Safari Tiger In Karnataka | Sakshi
Sakshi News home page

రెండు పులులు కొట్లాట.. వీడియో వైరల్‌

Published Wed, Aug 5 2020 6:19 PM | Last Updated on Thu, Mar 21 2024 4:35 PM

సాక్షి, బెంగళూరు : జంతువుల‌ను వెంటాడి చంపి చీల్చుకొని తిన‌డం పులు‌ల నైజం. ఇలాంటి వీడియోలను మనం ఎన్నో చూశాం కూడా. కానీ ఒకేజాతికి చెందిన రెండు పులులు కొట్లాడటం ఎప్పుడైనా చూశారా? బహుశా ఎవరూ చూసి ఉండరు అనుకుంటా. అలాంటి అరుదైన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కర్ణాట‌క‌లోని బ‌న్న‌ర్‌ఘ‌ట్ట బ‌యోలాజిక‌ల్ పార్క్‌లో రెండు పులులు ఒకదానిపూ ఒకటి దాడికి దిగాయి. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్‌ చేస్తూ.. 'ఈ ప్ర‌పంచంలో మాన‌వ సంబంధం ఈ కంచె వ‌లె బ‌లంగా ఉంటే'..అనే శీర్షిక‌ను జోడించారు. 45 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో కంచెకు ఇరువైపుల ఉన్న  సఫారీ టైగర్‌, వైల్డ్ టైగర్ పెద్దగా గాండ్రిస్తూ దాడికి దిగాయి. ఈ వీడియో మొద‌టిసారి 2019లో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా, దీన్ని మ‌ర‌లా సుశాంత్ షేర్ చేయ‌గా మరోసారి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement