Tightrope
-
గాల్లో తాడుపై నడిచాడు.. ఇది మామూలు రికార్డు కాదు!
ఇది మామూలు రికార్డా.. ఇప్పటివరకూ ఎవరూ సాహసించనిది.. చూస్తున్నారుగా.. మైలు కన్నా ఎక్కువ ఎత్తులో.. రెండు హాట్ఎయిర్ బెలూన్ల మధ్య ఎలాంటి ఆధారం లేకుండా.. తాడుపై నడవడమంటే మాటలా మరి.. బ్రెజిల్‌కు చెందిన 34 ఏళ్ల రాఫెల్ జుగ్నోబ్రిడి ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. (చదవండి: చరిత్ర సృష్టించిన పాలకొల్లు అమ్మాయి) బ్రెజిల్లో 6,131 అడుగుల ఎత్తులో అంగుళం వెడల్పున్న తాడుపై నడిచి.. సరికొత్త ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫా కంటే రెట్టింపు ఎత్తులో చెప్పులు లేకుండా నడిచి టైట్రోప్ వాక్‌లో వరల్డ్ రికార్డు సృష్టించాడు. చాలెంజ్లంటే తనకెంతో ఇష్టమని.. చిన్న తప్పు జరిగినా.. ఇక అంతే అని తెలిసినప్పటికీ.. ఏకాగ్రతతో దీన్ని సాధించానని రాఫెల్ చెప్పాడు. (చదవండి: 15 సెకన్లలో ఏమైతది.. బస్సు రైలైతది.. అదెలా?) -
భూమి నుంచి 46 అడుగుల ఎత్తులో...
బెర్లిన్ : ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహమనేది ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి క్షణాలను రొటీన్‌గా కాకుండా సమ్‌థింగ్ స్పెషల్‌గా చేసుకోవాలని కొందరు కోరుకుంటుంటారు. తూర్పు జర్మనీకి చెందిన నికోల్ బెకాస్, జెన్స్ నార్లు ఆ కోవకు చెందినవాళ్లే. అందుకే తమ వివాహాన్ని వెరైటీగా ఫ్లాన్ చేశారు. అనుకున్నదే తడవుగా.. టైట్రోప్ ఆర్టిస్ట్‌ను సంప్రదించి తమ ఆలోచనను పంచుకున్నారు. అతడి సాయం, ఆలోచనతో భూమి నుంచి 46 అడుగుల ఎత్తులో ఒక్కటయ్యారు. ఓ తాడుపై టైట్రోప్ ఆర్టిస్ట్ మోటార్ సైకిల్ నడుపుతుంటే.. దానికి కట్టిన తాడుకు కింద ఓ ఊయల కట్టారు. అందులో కూర్చున్న వాళ్లు ఉంగరాలు మార్చుకున్నారు. భూమి- ఆకాశాల మధ్య వివాహ బంధంతో ఒక్కటై అందరి దృష్టిని ఆకర్షించారు. విశేషమేమిటంటే పాస్టర్ కూడా నిచ్చెన సాయంతో గాల్లో నిలబడి వీరితో పెళ్లి ప్రమాణాలు చేయించారు. ఇలా తమకు నచ్చిన రీతిలో పెళ్లి చేసుకున్న నికోల్ బెకాస్, జెన్స్ నార్లు...ఆ మధుర ఙ్ఞాపకాలను ‘లైఫ్ ఆల్బం’లో పొందుపరచుకున్నారు. 3 వేల మంది ఈ వేడుకకు హాజరయినట్లు తెలుస్తోంది. -
ఉత్కంఠ రేపిన 'రోప్ వాక్' వెడ్డింగ్!
ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి అంటూ పెళ్ళిళ్ళు అట్టహాసంగా చేసేవారిని వర్ణిస్తుంటాం. అలాగే అందరికీ భిన్నంగా, కాస్తంత వెరైటీగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని తహతహలాడేవారినీ చూస్తాం. కానీ జీవనాధారం కోసం ప్రాణాలతో చెలగాటమాడే సర్కస్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అదే సర్కస్ ఫీట్ తో పెళ్ళి చేసుకోవడం ఇప్పుడు చరిత్రను సృష్టించింది. ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో.. తాడుపై నడిచే రోప్ వాక్ ఫీట్ చేస్తూ.. పెళ్లి చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాదు.. ఆ రోప్ వాక్ వెడ్డింగ్ అతిథుల్లో ఉత్కంఠను కూడా రేపింది. సర్కస్ లో రోప్ వాక్ చేస్తూనే... వినూత్నంగా వివాహ వేడుకను నిర్వహించుకున్నారు హోస్టన్ కు చెందిన ముస్తాఫా డాంగ్విర్, అన్నా లెబెదేవాలు. ప్రపంచ ప్రఖ్యాత సర్కస్ రింగ్లింగ్ బ్రోస్ లో పనిచేసే ఆ ఇద్దరూ భూమి నుంచి 30 అడుగుల ఎత్తులో గట్టిగా కట్టిన తాడుపై నడుస్తూ దంపతులయ్యారు. 1884 లో అమెరికాలో మొత్తం ఏడుగురు రింగ్లింగ్ సోదరుల్లో ఐదుగురితో ప్రారంభమైన ఈ ప్రముఖ సర్కస్.. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ షో గా ప్రఖ్యాతి పొందింది. అటువంటి రింగ్లింగ్ బ్రోస్, బార్నమ్ అండ్ బైలీ స్థానిక ఎన్ఆర్జీ స్టేడియంలో సంయుక్తంగా నిర్వహించిన సర్కస్ షోలో.. అందులోనే పనిచేచే ముస్తాఫా డాంగ్విర్, అన్నా లెబెదేవాలు తమ వివాహాన్నినిర్వహించుకోవడం ఇప్పుడు సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. వైట్ టెక్సిడో కోట్ ధరించి, ఒంటెపై ఊరేగుతూ వివాహ వేదికకు వచ్చిన వరుడు.. పక్కనే ఉన్న నిచ్చెన మీదుగా అప్పటికే సిద్ధంగా ఉన్న సర్కస్ వాక్ రోప్ మీదకు చేరుకున్నాడు. తెల్లని ఆకట్టుకునే అందమైన పెళ్ళి గౌను, హైహీల్స్ వేసుకొని గుర్రంపై వచ్చిన వధువు.. సైతం సర్కస్ రోప్ పైకి చేరుకున్న అనంతరం.. రోప్ మధ్య భాగంలో కూర్చొని వధూవరులు ఉంగరాలు మార్చుకొని, అతిథుల ఆనందోత్సాహాలు, హర్షధ్వానాలమధ్య ఒక్కటయ్యారు. పెళ్ళికి హాజరైనవారిని చిరుమందహాసంతో పలుకరిస్తూ ఏడడుగులూ నడిచారు.