At a time
-
రెండు ఉద్యోగాలు సాధించిన నెమ్మికల్ వాసి
ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామానికి చెందిన మహిళ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో రెండు ఉద్యోగాలు సాధించి తన సత్తాచాటింది. గ్రామానికి చెందిన జటంగి సువర్ణ ఎంఎస్సీ, బీఈడీ చేసింది. అయితే గత ఏడాది జరిగిన గురుకుల సైన్స్ టీచర్, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు దరఖాస్తు చేసి పరీక్షలు రాసింది. అయితే ఆమె రాసిన రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడం గమనార్హం. ఈమె 1నుంచి 12వ తరగతి వరకు నెమ్మికల్లో, డిగ్రీ సూర్యాపేటలో, ఎంఎస్సీ, బీఈడీ ఉస్మానియా యూనివర్సిటీలో చేసింది. గ్రామానికి చెందిన సువర్ణ ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అనుమతులు ఆలస్యం చేస్తే.. జీతంలో కోత
నిర్ణీత సమయంలో పరిశ్రమలకు అనుమతులివ్వాల్సిందే ‘రైట్ టు సింగిల్ విండో క్లియరెన్స్’ విధానం పేరుతో అమలు హైదరాబాద్: వివిధ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు నిర్ణీత సమయంలోగా అనుమతులు మంజూరు చేయకపోతే.. ఇకపై అధికారుల నుంచి అపరాధ రుసుము వసూలు చేయనున్నారు. వారి జీతాల్లోంచి ఈ సొమ్ముకు కోత వేసి.. ఆ పరిశ్రమలకే అందజేయనున్నారు. ఇలాంటి పలు సరికొత్త అంశాలకు తమ పారిశ్రామిక విధానంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే మెగా పరిశ్రమలకు కంపెనీ వద్దకే వెళ్లి అన్ని అనుమతులు ఇచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం... ఇప్పుడు ‘రైట్ టు సింగిల్ విండో క్లియరెన్స్’ పేరుతో కొత్త విధానాన్ని అమలు చేయనుంది. దీని ప్రకారం.. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను పొందడం ఇకపై పారిశ్రామికవేత్తల హక్కు కానుంది. ఈ హక్కు దక్కకపోతే పైస్థాయిలో అప్పీలు చేసుకునే వెసులుబాటుతో పాటు, నిర్ణీత సమయంలోగా అనుమతులు ఇవ్వని అధికారులపై అపరాధ రుసుం విధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ మొత్తాన్ని సదరు అధికారి జీతం నుంచి వసూలు చేసి.. సదరు పరిశ్రమలకు అందజేయనున్నారు. ఈ ‘రైట్ టు సింగిల్ విండో క్లియరెన్స్’ విధానాన్ని త్వరలో ప్రకటించబోయే నూతన పారిశ్రామిక విధానంలో చేర్చనున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.