ట్రాక్టర్ దూసుకెళ్లి బాలుడి మృతి
కందుకూరు(రంగారెడ్డి జిల్లా): కందుకూరు మండలం తిప్పరపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన అంబటి జంగయ్య, చిట్టి దంపతులకు పండు(3) అనే కుమారుడు ఉన్నాడు. సోమవారం రాత్రి పండు ఇంటి ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన ట్రాక్టర్, రోడ్డుపై ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టింది. ఆ తరువాత ట్రాక్టర్ బాలుడిపై దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్మార్టంకు తరలించారు.