Tipu Sultan birth anniversary Controversy
-
టిప్పు సుల్తాన్ జయంతి : కుమారస్వామి వర్సెస్ బీజేపీ
సాక్షి, బెంగళూర్ : టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలా..లేదా అనేది బీజేపీయే తేల్చుకోవాలని కర్నాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల గురించి తాను ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించలేదని, దేశంలో భిన్న వర్గాలు వారికిష్టమైన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాయని మాత్రమే వ్యాఖ్యానించానన్నారు. కాగా టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను ఈనెల 10న నిర్వహించాలన్న కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఖండించారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ తన రాజధాని శ్రీరంగపట్నాన్ని (మాండ్య) కాపాడుకునే క్రమంలో మరణించారు. కన్నడ భాషకు, హిందువులకు వ్యతిరేకంగా పనిచేసిన టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను నిర్వహించడాన్ని పలువురు బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. గత ఏడాది సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం నవంబర్ 10న టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలని నిర్ణయించింది. -
కోవింద్ వ్యాఖ్యలతో బీజేపీలో కాక
సాక్షి,బెంగళూర్: టిప్పు సుల్తాన్ను ద్రోహిగా బీజేపీ అభివర్ణిస్తున్నక్రమంలో రాజుకున్న వివాదం మరింత ముదురుతోంది. బ్రిటిష్ వారితో చారిత్రక పోరాటంలో టిప్పు సుల్తాన్ అసువులు బాశారని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. కర్నాటక విధాన సౌథ 60వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ బ్రిటిష్ వారితో తలపడుతూ టిప్పు సుల్తాన్ వీరోచితంగా మరణించారని అన్నారు. యుద్ధ రంగంలో మైసూరు రాకెట్ల ప్రయోగంలో ఆయన దిట్టని అన్నారు. బీజేపీ వైఖరితో కోవింద్ వ్యాఖ్యలు విభేదిస్తుండటంతో ఇది హాట్ టాపిక్ అయింది. కోవింద్ వైఖరితో టిప్పు సుల్తాన్ స్వాతంత్ర సమరయోధుడని చెబుతున్న కర్నాటక సర్కార్ వాదనకు బలం చేకూరుతుండటం బీజేపీ నేతలకు రుచించడం లేదు. టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలకు కర్నాటక ప్రభుత్వ ఆహ్వానాన్ని బీజేపీ తోసిపుచ్చుతూ ఈ కార్యక్రమం సిగ్గుచేటని వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. ఈ వేడుకులకు దూరంగా ఉండాలన్నది తమ పార్టీ వైఖరిగా బీజేపీ ఎమ్మెల్యే అశ్వంత్ నారాయణ్ చెప్పుకొచ్చారు. టిప్పు సుల్తాన్ మైసూర్ పాలకుడిగా వేలాది మంది హిందువులు, క్రిస్టియన్లను హతమార్చాడని,. బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడ్డాడని ఎమ్యెల్యే పేర్కొనడం పెను దుమారం రేపింది. మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కర్నాటక సర్కార్ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. టిప్పు సుల్తాన్ జయంతోత్సవ వేడుకలు రాజకీయ అంశం కాదని, టిప్పు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నాలుగు సార్లు యుద్ధం చేశారని సీఎం సిద్ధరామయ్య వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. -
'కట్టప్ప మృతి వెనుక ఆ సంస్థ హస్తం'
బెంగళూరు: 'టిప్పు సుల్తాన్' వివాదంలో తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని మైసూర్-కొడగు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను వ్యతిరేకించడంతో తనను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని మైసూరు పోలీసు కమిషనర్ దయానంద్ కు తెలిపారు. మైసూర్ హులీ షాహిద్ మిలాత్ మహాన్ టిప్పు సుల్తాన్ ఇండియన్ ముస్లిం అనే సంస్థ ఫేస్ బుక్ లో తనను హెచ్చరించిందని వెల్లడించారు. తన ఫొటోపాటు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో మృతి చెందిన వీహెచ్ పీ నేత కట్టప్ప ఫొటోను ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారని పోలీసులకు తెలిపారు. అయితే కట్టప్ప మృతి వెనుక ఈ సంస్థ హస్తం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రతాప్ సింహా ఫిర్యాదును విజయానగర్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు. ఆయన ఇంటివద్ద పోలీసు భద్రత పెంచారు. కాగా, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని డిమాండ్ చేసినందుకు తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని గిరీశ్ కర్నాడ్ తెలిపారు. టిప్పు జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. కొడుగు జిల్లా మడికేరిలో తిమ్మయ్య సర్కిల్ వద్ద జరిగిన ఇరువర్గాల ఘర్షణలో వీహెచ్పీ కొడగు జిల్లా ముఖ్యకార్యదర్శి కట్టప్ప(60) మీతి చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కర్ణాటక బంద్ కు వీహెచ్పీ పిలుపునిచ్చింది.