లోక కల్యాణం కోసం
మహాలక్ష్మి యాగం
యాగానికి సర్వం సిద్ధం
శోభాయమానంగా మహాలక్ష్మి యాగం
రామచంద్ర రామానుజ జియ్యర్స్వామి ప్రత్యేక ఇంటర్వ్యూ
తిరుపతి గాంధీరోడ్డు: లోక కల్యాణార్థం శ్రీభాష్యకార్ల సిద్ధాంతి పీఠం అనంత శ్రీవిభూషిత శ్రీరామచంద్ర రామానుజ జియ్యర్ స్వామి నిర్వహిస్తున్న 16వ మహాలక్ష్మి యాగం తిరుపతి-రేణిగుంట రోడ్డులోని కృష్ణతేజ విద్యాసంస్థల్లో సోమవారం ప్రారంభమైంది. శ్రీమహాలక్ష్మి అమ్మవారు పుట్టిన రోజు, పెళ్లి వేడుక జరిగిన తిరునక్షత్రాన్ని పురష్కరించుకుని వేడుకకు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు వచ్చి అఖండ భక్తజనకోటికి యాగఫలాన్ని ప్రాప్తింపచేయనున్నారని శ్రీ విభూషిత శ్రీరామచంద్ర రామానుజ జీయ్యర్ స్వామి తెలిపారు. యాగం ప్రాముఖ్యత గురించి జీయ్యర్ స్వామితో ప్రత్యేక ఇంటర్వ్యూ..
సాక్షి: శ్రీమహాలక్ష్మి యాగం ప్రా ముఖ్యత ఏమిటి?
స్వామీజీ: లోక కల్యాణాన్ని ఆకాం క్షించి శ్రీమహాలక్ష్మి యాగం చేస్తున్నాం. ఈ జగత్తులో పితృ దేవతల రుణం తీ ర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది. రుణం తీర్చుకోవడంతో పాటు విశ్వమంతా పశుపక్షాదులు, పా డిపంటలు, బోగభాగ్యాలతో తులతూగాలనే సంకల్పంతో ఈ యాగాన్ని సంకల్పించాం. దేవదేవుని పట్టపురాణి లక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ఈ మహాయాగాన్ని నిశ్చయించాం.
ప్రశ్న : తిరుపతినే ఎందుకు ఎంచుకున్నారు?
స్వామీజీ : ఇక్కడ ఏడుకొండలు వెలశాయి. అందులో జననీ జనుకులైన లక్ష్మీ వేంకటేశ్వరుడు కొలువయ్యారు. పుణ్యస్థలం, పుణ్యక్షేత్రం కావడంతో తిరుపతిలో యాగం చేపట్టాలని అనిపించింది.
ప్రశ్న : ఈ కార్యక్రమానికి బ్రహ్మముహూర్తం ఎప్పుడు నిర్వహించారు?
స్వామీజీ : మీన మాసం ఉత్తర ఫల్గొణ నక్షత్రం నాడయిన సోమవారం 23 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కన్నుల పండువగా మహాలక్ష్మియాగం ప్రారంభించాం.
ప్రశ్న : ఇప్పటివరకు యాగం ఎన్నిచోట్ల జరిపారు?
స్వామీజీ : 15 జిల్లాలో 15 యాగాలు నిర్వహించాం. 16వ యాగం తిరుపతిలో నిర్వహించడం నా పూర్వ జన్మ శుకృతం.
ప్రశ్న : ఈ యాగాల ప్రాముఖ్యత ఏమిటి?
స్వామీజీ : శ్రీ మహాలక్ష్మి యాగంలో మొదటగా శోభాయాత్ర నిర్వహించాం. భూగోదాసమేత గోవిందపైశ్వర, విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణాలు, పండిత ప్రవచనాలు, లక్ష్మీవాహనం, పుత్రకామేష్టి, లక్ష్మీనారాయణేష్టి, సుదర్శనేష్టి, విశ్వక్సేనేష్టి యాగాలు ఉంటాయి. శతకోటి మల్లెలు, తులసి, కుంకుమార్చన, కోటి దీపోత్సవం కార్యక్రమాలు రూపొందించాం.
సాక్షి : ఎన్ని యాగశాలలు ఏర్పాటు చేశారు?
స్వామీజీ : ప్రధాన యాగశాలతో పాటు 25 కుండలు ఏర్పాటు చేశాం. వీటికోసం ప్రత్యేకంగా యాగశాలలు ఏర్పాటయ్యాయి. ప్రధాన యాగ వేదికను తీర్చిదిద్దాం. విశేష అర్చనతో పాటు ఏప్రిల్ మూడో తేదీన 5వేల లీటర్ల పాలతో పాలకడలిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం.
ప్రశ్న : యాగంలో ఎంతమంది పాల్గొంటారు?
స్వామీజీ : మా అంచనా ప్రకారం రోజూ లక్షమందికి పైగా పాల్గొంటారని భావిస్తున్నాం. వీరందరికీ భోజన వసతి కూడా కల్పిస్తున్నాం.
ప్రశ్న : పీఠాధిపతులు, ఇతర ప్రాంతాల ప్రజల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
స్వామీజీ : యాగశాల ప్రాంగణంలో పెద్దపెద్ద వసతి గృహాల్లాగా ఏర్పాటు చేశాం. దేవతామూర్తుల నెలువెత్తు ప్రతిమలు ఏర్పాటయ్యాయి. ప్రతి వ్యక్తీ ఇక్కడ అడుగిడగానే భక్తి పారవశ్యంతో తన్మయులయ్యేలా యాగ స్థలాన్ని తీర్చిదిద్దాం. అమ్మ కల్యాణార్థం కీరావర్ణ మంటపాన్ని రూపొందించాం. భక్తుల సేవల కోసం యాగ కార్యాలయం, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ప్రవచన మంటపం, శ్రీహరి దర్బార్ ఏర్పాటయ్యాయి.
ప్రశ్న : టీటీడీ ఎలాంటి సహకారం అందించింది?
స్వామీజీ : టీటీడీ వారు వేరే ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు వసతి ఏర్పాట్లు చేశారు. మరింత సహాయ సహకారాలు అందిస్తే గణనీయంగా ముందుకు వెళ్లవచ్చు.