Tiruvannamalai district
-
ప్రభుత్వ ఉపాధ్యాయుడి అఘాయిత్యం.. యూకేజీ విద్యార్థిపై లైంగిక దాడి
సాక్షి, చెన్నై: భార్య పేరుతో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తూ నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సేత్తుపట్టు సమీపంలోని గంగసూడామణి గ్రామంలో ప్రైవేటు పాఠశాల నడుస్తుంది. ఇక్కడ యూకేజీ చదువుతున్న ఒక విద్యార్థినికి గత కొద్ది రోజులుగా ఆరోగ్యం సక్రమంగా లేక పోవడంతో తల్లిదండ్రులు వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై తిరువణ్ణామలై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో పాఠశాల కరస్పాండెంట్ ప్రభావతి భర్త ఉలయంబట్టు ప్రభుత్వ పాఠశాల టీచర్ కామరాజ్ తరచూ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ కార్తికేయన్, అడిషనల్ ఎస్పీ రమేష్, విద్యా శాఖ సీఈఓ దయాళన్ ప్రైవేటు పాఠశాలకు నేరుగా వెళ్లి విచారణ చేపట్టారు. ఆ సమయంలో కామరాజ్ తిరుచందూరులోని ఆలయానికి వెళ్లినట్లు తెలియడంతో ఎస్పీ కార్తికేయన్ ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రభావతిని శనివారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ మురగేష్ పాఠశాల టీచర్ కామరాజ్‌ను సస్పెండ్ చేశారు. చదవండి: హతవిధీ!..పదేళ్ల తర్వాత విధులకు..గుండెపోటుతో -
కూతురు ప్రేమపెళ్లి.. హాజరుకాని భార్య.. తిరిగి ఇంటికి రావడంతో...
చెన్నై: కూతురు ప్రేమ వివాహం ఓ తల్లి హత్యకు కారణమైంది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా తాండరామ్ పట్టు సమీపం పుదుచెక్కడి పంచాయతీ జాంబొడై గ్రామానికి చెందిన పళని (47). ఇతని భార్య రాణి (43). వీరికి రాజపాండి (24), శివ (22) అనే ఇద్దరు కుమారులు, భరణి (21) అనే కుమార్తె ఉంది. ఈ క్రమంలో భరణి మదురైకి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. సోమవారం పళని బంధువులు వారికి ప్రేమ వివాహం జరిపించారు. రాణికి ఈ విషయం నచ్చకపోవడంతో వివాహానికి హాజరుకాలేదు. ధర్మపురి జిల్లా కోటపట్టిలోని సోదరి ఇంటికి వెళ్లి మంగళవారం వచ్చింది. కుమార్తె వివాహానికి హాజరు కాకపోవడంపై రాణితో పళని గొడవపడ్డాడు. కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రాణి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమో దు చేసి పళణిని అరెస్టు చేశారు. చదవండి: (స్కాట్లాండ్లో పలమనేరు విద్యార్థి మృతి) -
ట్రాన్స్‌జెండర్ చిరకాల కల నెరవేర్చిన సీఎం స్టాలిన్
చెన్నె: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనంతరం ఎంకే స్టాలిన్ ఆదర్శ నిర్ణయాలు తీసుకుంటూ అందరితో శభాశ్ అనిపించుకుంటున్నారు. పాలనలోనూ.. ఇటు వ్యక్తిగతంగాను స్టాలిన్ ప్రత్యేకత చాటుకుంటున్నారు. తాజాగా స్టాలిన్ తీసుకున్న నిర్ణయంతో ట్రాన్స్ ఉమన్ చిరకాల కల నెరవేర్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకోండి. తిరువాణ్నమలై పట్టణంలోని పవుపట్టుకు చెందిన ఎస్.శివన్య లింగ మార్పిడి చేసుకున్న మహిళ. ఆమె కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఆమెకు ఎప్పటికైనా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కావాలని చిరకాల కల. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం వేసిన పోలీస్ ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తు చేసుకుంది. నీకెందుకు పోలీస్ ఉద్యోగం అని పలువురు అవమానించగా వాటిని సహించింది. ఎంతో దీక్షతో ఉద్యోగానికి సన్నద్ధమైంది. ఈవెంట్స్, పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యింది. లాక్డౌన్ వలన వైద్య, శారీరక పరీక్షలు, ఇంటర్వ్యూ ఆలస్యంగా జరిగాయి. చివరకు అవి కూడా పూర్తి కావడంతో ఇటీవల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శివన్యకు ఎస్సై నియామక పత్రాన్ని అందించారు. ఈ పత్రం అందుకున్న తర్వాత శివన్య ఆనందానికి అవధుల్లేవు. ‘నా సోదరులు, కుటుంబసభ్యులు ఎప్పుడూ నాకు అండగా ఉన్నారు. వారు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నా లక్ష్యం ఎస్సై కాదు. గ్రూప్ 1 సాధించి ఎలాగైనా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కావాలని ధ్యేయం. అది కూడా సాధిస్తా. తమిళనాడు మొదటి లింగమార్పిడి ఎస్సైగా ప్రీతిక యాసిని నాకు ఆదర్శం’ అని శివన్య తెలిపింది. గతంలో శివన్య తిరువణ్నామలై కోర్టులో పారా లీగల్ వలంటీర్‌గా సేవలందించింది. శివన్య అన్నయ్య పేరు స్టాలిన్ కావడం గమనార్హం. ఆమె తమ్ముడు తమిళనిధి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. -
దంపతుల ప్రాణం తీసిన వ్యసనం
కేకేనగర్: ఇంటి యజమాని వ్యసనం ముగ్గురు పిల్లల్ని వీధినపడేలా చేసింది. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా సెయ్యారు సమీప కీళపుదుపాక్కంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. స్థానిక పశుంపొన్ నగర్‌కు చెందిన రజని (35) దినసరి కూలీ. ఇతని భార్య సంగీత (31). వీరికి శాంతిని (7), జమునాదేవి (5), అస్వతి (3) అనే కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్లుగా రజని మద్యానికి బానిసగా మారాడు. ప్రతి రోజు పీకల దాకా తాగి ఇంటికి వచ్చి భార్య, పిల్లలను చితకబాదేవాడు. ఈ విషయమై భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. శుక్రవారం రాత్రి కూడా మద్యం తాగి ఇంటికి వచ్చిన రజని.. భార్యతో రాత్రి 2 గంటల దాకా తగాదా పెట్టుకున్నాడు. భర్త తాగుడుపై విరక్తి చెందిన సంగీత ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. శరీరమంతా మంటలు వ్యాపించడంతో సంగీత పెద్దగా కేకలు పెట్టింది. నేను కూడా నీతోనే చనిపోతానంటూ రజని.. భార్యను ఆలింగనం చేసుకున్నాడు. ఈ సంఘటనలో భార్య భర్త ఇద్దరూ కాలిపోయారు. చుట్టుపక్కలవారు గమనించి వారిని సెయ్యారు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో రజనీ-సంగీతలను చెన్నై కీళ్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. -
'ఫ్లెక్సీ'తో పెళ్లాగిపోయింది!
తిరువణ్ణామలై: పెళ్లి కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఓ యువతి జీవితాన్ని కాపాడింది. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఎయిడ్స్ ఉందని 'ఫ్లెక్సీ' ద్వారా యువతికి తెలియడంతో ఆమె ప్రమాదం నుంచి బయపడింది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా చెంగం పట్టణంలో సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పెళ్లి కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోని వరుడి ఫొటో చూసిన ఓ వ్యక్తి ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారి ఎస్ పళనికి ఫోన్ చేశాడు. పెళ్లికొడుక్కి ఎయిడ్స్ ఉందని తెలిపాడు. 'ఆదివారం రాత్రి 9.30 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. వరుడు హెచ్ ఐవీ చికిత్స తీసుకుంటున్నాడని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఇది వాస్తవమో, కాదో కనుక్కోవాలని ఎస్పీ, మెడికల్ జాయింట్ డైరెక్టర్ కు వెంటనే సూచించాను. వధువు కుటుంబం చిరునామా కనుక్కోమని రెవెన్యూ అధికారులకు పురమాయించాన'ని కలెక్టర్ తెలిపారు. '2014, జూలై 30 నుంచి ప్రభుత్వాసుపత్రిలో వరుడు ఎయిడ్స్ నివారణకు చికిత్స తీసుకుంటున్నట్టు నిర్ధారించుకుని అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో అతడికి ఫోన్ చేశాం. తానే స్వయంగా వచ్చి కలుస్తానని చెప్పాడు. కానీ అతడు రాలేదు. దీంతో వధువు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాం. తన పెళ్లి చెడగొట్టేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని పెళ్లికొడుకు వాళ్లకు ముందే చెప్పడంతో మా మాటలు నమ్మలేదు. దీంతో మేము హుటాహుటిన వివాహ వేదిక వద్దకు చేరుకున్నామ'ని చెంగం తహశీల్దార్ ఎం. కామరాజ్ వెల్లడించారు. వైద్యాధికారి సెంథిల్ కుమార్, చెంగం డీఎస్పీ, తహశీల్దార్.. వధువుకు, ఆమె కుటుంబ సభ్యులకు పెళ్లికొడుకు గురించి చెప్పారు. అతడిని పెళ్లి చేసుకోకూడదని పెళ్లికూతురు నిర్ణయం తీసుకుంది. సకాలంలో స్పందించి తమ కూతురి జీవితాన్ని కాపాడినందుకు అధికారులకు వధువు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. రాత్రి అని కూడా చూడకుండా ఏడు గంటల పాటు తాము కష్టపడినందుకు ఫలితం దక్కిందని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల భద్రత మధ్య వధువు కుటుంబ సభ్యులను సొంత గ్రామానికి తిరిగివచ్చారు. అదేరోజు తమ గ్రామానికి చెందిన మరో యువకుడిని వధువు పెళ్లాడడంతో ఈ ఉదంతం సుఖాంతమైంది. -
మీడియాను అభినందించిన హైకోర్టు
చెన్నై: దంపతులపై తమిళనాడు పోలీసుల దౌర్జన్యంపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న దంపతులను మెరుగైన వైద్యం కోసం చెన్నై ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. పోలీసుల దౌర్జన్యకాండను వెలుగులోకి తెచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను ఉన్నత న్యాయస్థానం అభినందించింది. తనపై దౌర్జన్యం చేసిన పోలీసులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని బాధితులు దాఖలు చేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. తిరువణ్ణామలై జిల్లా సెంగం పట్టణంలో దంపతులు, వారి కుమారుడిపై సోమవారం మధ్యాహ్నం పోలీసులు లాఠీలతో దారుణం కొట్టారు. తేకవాడియ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ రాజ, భార్య ఉష, కుమారుడు సూర్య బంగారం కొనేందుకు సెంగంలోని బంగారు దుకాణానికి వెళ్ళారు. బంగారం కొనే సమయంలో భార్యభర్తల మధ్య గొడవ తలెత్తింది. సెంగం పోలీసులు నమ్ఆల్వార్, మురుగన్, విజయకుమార్ అనే ముగ్గురు వచ్చి రాజ, భార్య ఉష వద్దకు వచ్చి నడి రోడ్డులో ఎందుకు గొడవ పడుతున్నారని ప్రశ్నించారు. ఇది తమ కుటుంబ వ్యవహారమని, మధ్య రావొద్దని అనడంతో కోపంతో రగిలిపోయిన ఖాకీలు రాజ, ఉష్, సూర్యలను విచక్షణారహితంగా కొట్టారు. రాజ, సూర్యకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రాజ బందువులు, స్థానికులు సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. దౌర్జన్యం చేసిన పోలీసులను డిస్మిస్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.