‘సూపర్’ కంప్యూటర్
బీజింగ్: చైనాకు చెందిన ఓ కంప్యూటర్ ప్రపంచంలోని సూపర్ కంప్యూటర్లలో ప్రథమ స్థానానికి పోటీ పడుతోంది. దీని గణన సామర్థ్యం ఒక సెకనుకు 93 కోట్ల కోట్లు. దీనికి సన్వే తైహూ లైట్ అని నామకరణం చేశారు. చైనాకు చెందిన నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(ఎన్ఆర్సీపీసీ) సంస్థ తయారు చేసింది. ఇందులోని ప్రాసెసర్లన్నీ చైనాలోనే తయారయ్యాయి. ఇప్పుడు కూడా ప్రపంచంలోని టాప్ సూపర్ కంప్యూటర్లలో చైనాకే చెందిన టియాన్హీ-2 ఉంది.
దీని సామర్థ్యం సెకనుకు 33.86 కోట్ల కోట్లు. దీనికంటే దాదాపు మూడు రెట్లు ప్రభావవంతంగా పనిచేసే కంప్యూటర్ను చైనా తయారు చేయడం విశేషం. అమెరికాకు చెందిన టైటాన్ కంప్యూటర్ సెకనుకు 17.59 కోట్ల కోట్ల సామర్థ్యంతో దీని తర్వాత స్థానంలో ఉంది. జపాన్‌కు చెందిన సీక్వోయా, రికెన్లు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. తాజా జాబితాలో అత్యధికంగా 167 కంప్యూటర్లతో చైనా మొదటి స్థానంలో ఉండగా, అమెరికా 165 కంప్యూటర్లతో రెండో స్థానంలో ఉంది.