Tiwari
-
World Oceans Day: సముద్ర సంరక్షణలో...Divya Hegde and Rabia Tewari
సముద్రమంత గాంభీర్యం అంటారు. సముద్రమంత సాహసం అంటారు. సముద్రమంత సహనం అంటారు. అయితే ఇప్పుడు ‘గాంభీర్యం’ ‘సాహసం’ ‘సహనం’ స్థానంలో ‘ప్రమాదం’ కనిపిస్తోంది. కాలుష్యం బారిన పడి తల్లడిల్లుతున్న సముద్రం గుండె చప్పుడు విన్న వాళ్లు బాధ పడుతూ కూర్చోవడం లేదు. సముద్ర కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు. ‘వరల్డ్ ఓషన్స్ డే’ సందర్భంగా ఓషన్ యాక్టివిస్ట్‌లు దివ్య హెగ్డే, రబియా తివారీ గురించి...గూగుల్ మాజీ ఉగ్యోగి అయిన దివ్యా హెగ్డే కర్నాటక కోస్తాప్రాంతాలలో సముద్ర కాలుష్యం, నివారణ మార్గాల గురించి ప్రచారం చేస్తోంది. క్లైమెట్ యాక్టివిస్ట్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు పొందిన దివ్య వివిధ కళారూపాల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది.ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను సముద్రంలోపారవేయకుండా నిరోధించడానికి యక్షగాన ప్రదర్శనల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ యక్షగాన ప్రదర్శనలో ప్లాస్టిక్’ ను రాక్షసుడిగా చూపించారు. ఆ రాక్షసుడిని మట్టికరిపించే శక్తి మానవుడిలో ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు.ఈ యక్షగానంలో తడి చెత్త, ΄÷డి వ్యర్థాలపాత్రలను కళాకారులు ΄ోషించారు.సముద్రంపై ప్లాస్టిక్ హానికరమైన ప్రభావాన్ని చూపించేలా ప్లాస్టిక్ అసుర పాత్రను రూపొందించారు.‘కర్ణాటకలో యక్షగానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ బలమైన కళారూపం ద్వారా ΄్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడం నుంచి తడి, ΄÷డి చెత్తను వేరు చేయడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాం. ఈ ప్రచారాల ద్వారా ప్రజలకు మంచి విషయాలను చేరువ చేయడం ఒక కోణం అయితే కళాకారులకు ఆర్థికపరంగా సహాయపడడం మరో కోణం’ అంటుంది దివ్య.‘బేరు’ అనే స్వచ్ఛందసంస్థ ద్వారా తీర్రపాంత వ్యర్థాల నిర్వహణపై పనిచేస్తోంది దివ్య.వ్యర్థాలను ప్రాసెస్ చేయడం గురించి మహిళలకు శిక్షణ ఇచ్చారు. వీరు ఇంటింటికి వెళ్లి ΄్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. సముద్ర వ్యర్థాలను తగ్గించే విధానాలలో ఇది ఒకటి. తడి చెత్తప్రాసెసింగ్ ద్వారా వచ్చే సేంద్రియ ఎరువులను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.వ్యర్థాలను సేకరించడం,ప్రాసెస్ చేయడం ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు.మత్స్యకారుల కుటుంబాలలో డిజిటల్ నైపుణ్యాలు పెంచడంపై కూడా ‘బేరు’ దృష్టి పెట్దింది.దీనిలో భాగంగా యూజర్–ఫ్రెండ్లీ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్‌ను రూపొందించారు. ‘డోర్–టు–డోర్ వేస్ట్ కలెక్షన్’ కార్యక్రమాలలో మహిళలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.ముంబైకి చెందిన రబియా తివారీ తన భర్త ఇంద్రనీల్ సేన్గు΄్తాతో కలిసి సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది. ముంబైలో సముద్రతీర అపార్ట్‌మెంట్‌కు మారినప్పుడు బీచ్‌లో టన్నుల కొద్ది చెత్తను చూసి చలించి΄ోయారు ఈ దంపతులు. ఆ బాధలో నుంచే ‘ఎథికో ఇండియా’ అనే సామాజిక సంస్థను మొదలుపెట్టారు.ఇద్దరు వ్యక్తులతో మొదలైన ‘ఎథికో ఇండియా’ ఆ తరువాత ‘సిటిజెన్ మూవ్మెంట్’ స్థాయికి చేరుకుంది.ఉద్యమం ఊపందుకోవడంతో వాలంటీర్లు మాహిమ్ బీచ్ నుంచి కిలోల కొద్దీ ΄ోగుపడిన సముద్ర వ్యర్థాలను తొలగించారు.సోషల్ మీడియా వేదికగా ఎంతోమందిని ఉద్యమంలో భాగం చేసింది ‘ఎథికో ఇండియా’.‘మాహిమ్ బీచ్ క్లిన్ అప్ డ్రైవ్’ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ ఉద్యమం మరికొన్ని ఉద్యమాలకు ద్వారాలు తెరిచింది. ‘ఓపెన్ ఫెస్ట్’ అనేది అందులో ఒకటి. కళల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడటమే దీని లక్ష్యం.‘ఓపెన్ ఫెస్ట్’లో అంకుర్ తివారీ, మానసీ పరేఖ్, అనురాగ్ శంకర్, చందన బాల కళ్యాణ్, సుమిత్ నాగ్దేవ్లాంటి ప్రముఖ కళాకారులు భాగం అయ్యారు.‘మా ప్రయత్నం ఫలించినందుకు సంతోషం గా ఉంది. అధికారులలో మార్పు వచ్చింది. ప్రక్షాళన కార్యక్రమాల్లో మాతో కలిసి చురుగ్గాపాల్గొంటున్నారు’ అంటుంది రబియా తివారీ. -
ప్రభాస్ రాముడు రావణ బ్రహ్మగా ఎన్టీఆర్
-
త్వరలోనే అణుశక్తి విభాగం ఆకృతి కేంద్రం
అశ్వాపురం: ముంబైలోని బాబా అణుశక్తి పరిశోధన కేంద్రం(ఆటమిక్ రీసెర్చ్ స్టేషన్) ఆకృతి విభాగం ఆధ్వర్యాన త్వరలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఆకృతి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ముంబైకు చెందిన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఏపీ.తివారి, స్మితా ములె, డాక్టర్ సంజీవకుమార్ సాధ్యాసాధ్యాల పరిశీలనకు శుక్రవారం అశ్వాపురం వచ్చారు. శాస్త్రవేత్తలు అశ్వాపురంలోని భారజల కర్మాగారాన్ని సందర్శించారు. ఆ తర్వాత భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం గౌతమీనగర్ కాలనీలో ఏఈసీఎస్ స్కూల్‌ను సందర్శించిన వారు ఇక్కడి అధికారులు, స్థానికులు, రైతులతో మాట్లాడారు. భారజల కర్మాగారం పరిసరాల్లోని గ్రామాల్లో సాగవుతున్న పంటల దిగుబడి, భూముల స్వభావం, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బాబా అణుశక్తి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో చేస్తున్న నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలు, నూతన పరికరాలు, కార్యక్రమాలను అణుశక్తి విభాగం ఆకృతి విభాగం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారజల కర్మాగారం జీఎం సతీశ్, అధికారులు పాల్గొన్నారు. -
హిందూ సమాజ్ నేత దారుణ హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అంతగా గుర్తింపు లేని రాజకీయ పార్టీ హిందూ సమాజ్ అధ్యక్షుడు కమలేష్ తివారీ (45) దారుణ హత్యకు గురయ్యారు. లక్నోలో అత్యంత రద్దీగా ఉండే నాకా హిందోలా ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో శవమై కనిపించారు. లక్నో పశ్చిమ ఏఎస్పీ వికాస్ త్రిపాఠీ అందించిన వివరాల ప్రకారం కమలేష్ తివారీని ఆయన ఇంట్లోనే అతి దారుణంగా హత్య చేశారు. హత్యకు ముందు ఇద్దరు వ్యక్తులు ఆయనను కలవడానికి వచ్చారు. వారితో మాట్లాడుతున్న తివారీ పాన్ల కోసం తన అనుచరుడ్ని బయటకి పంపించారు. మార్కెట్ నుంచి అతను తిరిగి వచ్చేసరికి జరగరాని ఘోరం జరిగిపోయింది. రక్తపు మడుగులో తివారీ శవమై కనిపించారు. తివారీని కలవడానికి వచ్చినవారు ఆ ఇంట్లో అరగంట కంటే ఎక్కువ సేపు గడిపినట్టు పోలీసులు చెబుతున్నారు. హంతకుల్ని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. హిందూ మహాసభతో విభేదాల కారణంగా బయటకు వచ్చిన తివారీ హిందూ సమాజ్ పార్టీని స్థాపించారు. తివారీ హత్య కేసులో ఐదుగురి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముస్లిం మత గురువు అన్వర్-ఉల్ -హక్‌ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. తివారీ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతంలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్తను హత్య చేసేందుకు మహ్మద్ ముఫ్తీ నదీమ్ కాజ్మి, ఇమామ్ మౌలానా అన్వర్-ఉల్-హక్ కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త తలకు రూ.1.5 కోట్లు వెల కట్టారని ఆరోపించారు. కమలేష్ తివారీ హత్యకు సూరత్‌లో కుట్ర చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గురిని సూరత్‌లో శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్ ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని సూరత్ నుంచి అహ్మదాబాద్‌కు తీసుకొచ్చారు. కాగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చి నివాళి అర్పించే వరకు తివారీ పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. తివారీ హత్య నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్నోతో పాటు పలు ప్రాంతాల్లో భద్రతను యూపీ పోలీసులు కట్టుదిట్టం చేశారు. -
గది విశాలంగా కనిపించాలంటే!
సాక్షి, హైదరాబాద్: చిన్న గది.. ఆ ఇరుకుతనం మనసుకు చికాకును తెప్పిస్తుంది. అలా అని బాధపడక్కర్లేదు. ఎత్తు తక్కువగా ఉన్న వారు పొడవాటి చారలున్న దుస్తువులు వేసుకుంటే ఎలాగైతే పొడుగ్గా కనిపిస్తారో.. ఇల్లూ అంతే! అంటే ఇంట్లోని పరదా, తివారీ, సోఫా కవర్ వంటివి పొడవాటి చారలున్నవి ఎంచుకుంటే సరిపోతుంది. అవే చిన్న గదిని విశాలంటే కనిపించేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని చిట్కాలివిగో.. ♦ ఒకవేళ ఆ గదిలోని కిటికీ చిన్నదయినా సరే.. పరదాలు తప్పనిరైతే మాత్రం అవి పై నుంచి వెడల్పుగా, కిందకు జాలువారేలా ఉండేలా చూసుకోవాలి. గోడల రంగులకు నప్పేట్టు చూసుకుంటే గది వెడల్పుగా కనిపిస్తుంది. ♦ చిన్న గదిలో ఓ గోడకు పెద్ద అద్దాన్ని అమర్చండి. అద్దం కృత్రిమ, సహజ వెలుతురిని ప్రతిబింబిస్తుంది. దీంతో గది ఇంకా ప్రకాశవంతంగా, పెద్దగా కనిపిస్తుంది. ♦ ఇంట్లో అక్కడక్కడ అంతగా ఉపయోగపడని వస్తువులుండటం సర్వసాధారణం. అలా ఉపయోపగపడని వస్తువులను ఎప్పటికప్పుడు తీసేయడం తప్పనిసరి. పత్రికలు, పుస్తకాల్లాంటివి ఎక్కడపడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పడేయకుండా పొందిగ్గా చిన్న అల్మరాలు ఎంచుకుని వాటిలో సర్దుకోవాలి. ♦ గది కాస్త పెద్దదిగా కనిపించాలంటే గోడలకు లేత చాయల్లో పెయింట్లు వేసుకోవాలి. అలాగే ఇంటి పైకప్పు పైనా ఆకట్టుకునే డిజైన్లను పెయింట్‌లా వేయించాలి. లేదంటే వాల్ పేపర్ అయినా అతికించాలి. ఆ గదిలోకి వచ్చేవారి దృష్టి దానిపై పడుతుంది. గది విశాలంటే ఉన్నట్టూ కనిపిస్తుంది. పువ్వుల వాల్‌పేపర్ అయితే అదనపు ఆకర్షణ. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
సాహిత్య అకాడమీ పదవికి మలగట్టి రాజీనామా
♦ అకాడమీ అవార్డు వెనక్కి ♦ ఇచ్చిన పంజాబీ రచయితలు బెంగళూరు/చండీగఢ్: హేతువాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆ సంస్థలో మొదలైన రాజీనామాల పర్వం కొనసాగుతోంది. జనరల్ కౌన్సిల్ సభ్యత్వానికి డాక్టర్ అరవింద్ మలగట్టి ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అకాడమీ అధ్యక్షుడు, కార్యదర్శికి పంపానన్నారు. కల్బుర్గి హత్యపై అకాడమీ మౌనంగా ఉండడాన్ని నిరసిస్తూ తానీ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కల్బుర్గి లాంటి వారిని చంపడం రాజ్యాంగ హక్కుల్ని హరించడమేనని రాజీనామా సందర్భంగా మలగట్టి అన్నారు. అకాడమీ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్న రచయితల్లో పంజాబ్‌కు చెందిన మరో ముగ్గురు చేరారు. ప్రముఖ రచయితలు గుర్బచన్ భల్లార్, అజ్మీర్ సింగ్ ఔలఖ్, అతంజిత్ సింగ్, అమన్సేథ్, గుజరాత్ రచయిత గణేష్ దేవి తమకు అకాడమీ ప్రదానం చేసిన అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నామని ఆదివారం ప్రకటించారు. అభ్యుదయ రచయితలు, హేతువాదులపై దాడులకు నిరసనగా తామీ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. రచయితల భావప్రకటన స్వేచ్ఛకు అకాడమీ కట్టుబడి ఉంది వరుస రాజీనామాలు.. అవార్డులు వెనక్కి ఇస్తున్న నేపథ్యంలో అకాడమీ చైర్మన్ తివారీ ఆదివారం ఒక ప్రకటన చేశారు. అకాడమీ దేశంలో రచయితల భావప్రకటనా స్వేచ్ఛకు కట్టుబడి ఉందని.. ఏ రచయిత లేదా కళాకారుడిపైన దాడి జరిగినా అది ఖండనార్హమని స్పష్టం చేశారు. రచయితల గౌరవాన్ని పరిరక్షించేందుకు, స్వయంప్రతిపత్తి గల అకాడమీ ప్రతిష్టను కాపాడేందుకు రచయితలు అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
ముసలోళ్లకి దసరా పండుగ!
-
నేడు ఖరారు కానున్న గవర్నర్ సలహాదారులు